దిల్ హజ్జ్ మాసపు పది దినాల ప్రత్యేకత

images

దిల్హజ్జ్మాసపు పదిదినాలప్రత్యేకత

మొత్తంసంవత్సరంలోనిఇతరదినాలకంటేదిల్హజ్జ్మాసపుమొదటిపదిదినాలుఎలావిభిన్నమైనవి?

కాలాన్నిసృష్టించినఅల్లాహ్కేసకలప్రశంసలుచెందును. ఆయనేకొన్నిప్రత్యేకసమయాలనుఇతరసమయాలకంటేశుభప్రదమైనవిగామరియుకొన్నిప్రత్యేకనెలలను, దినాలను, రాత్రులనుఇతరనెలల, దినాల, రాత్రులకంటేశుభప్రదమైనవిగాచేసెను. ఈశుభకాలములోతనదాసులపైఅల్లాహ్చూపుతున్నప్రత్యేకకారుణ్యంవలనవారిపుణ్యాలుఅనేకరెట్లుగుణింపబడును. ఇదివారినిమరిన్నిపుణ్యకార్యాలుచేయటానికిప్రోత్సహించి, అల్లాహ్నుఇంకాఎక్కువగాఆరాధించేఆసక్తినివారిలోకలిగించును. అలాఎక్కువపుణ్యాలుసంపాదించటానికిచేయవలసినప్రయత్నాలనుముస్లింలలోపునరుద్ధరించి, తనమరణాన్నితద్వారాతీర్పుదినాన్నిఎదుర్కొనటానికి తయారుగాఉండేటట్లుచేయును.

ఈఆరాధనాకాలంఅనేకశుభాలనుతెచ్చుచున్నది. వాటిలోకొన్నిశుభాలు – తమతప్పులను, పాపాలనుసరిదిద్దుకుని ప్రాయశ్చతం చేసుకునేఅవకాశాలు, తమఆరాధనలలోనిమరియుధర్మాచరణలలోనికొరతలను, లోపములనుభర్తీచేసుకునేఅవకాశాలు. ఈప్రత్యేకసమయాలుకొన్నిప్రత్యేకఆరాధనలనుకలిగిఉంటాయి. వీటినిమనస్పూర్తిగా, చిత్తశుద్ధితోఆచరించటంద్వారాదాసులుతమప్రభువైనఅల్లాహ్కుదగ్గరయ్యేఅవకాశాన్ని పొందుతారు.ఇంకా అల్లాహ్తనఇష్టానుసారంప్రసాదించేప్రత్యేకదీవెనలను,కరుణాకటాక్షాలను కూడా పొందుతారు. ఈప్రత్యేకనెలలలో, దినాలలో, ఘడియలలోవీలయినన్నిఎక్కువఆరాధనలుచేస్తూ, అధికపుణ్యాలుసంపాదించటానికిమరియు తనప్రభువైనఅల్లాహ్సారూప్యాన్నిపొందటానికిగట్టిగాప్రయత్నిస్తున్నవ్యక్తులేఇహపరలోకాలలోసంతోషాన్ని, ఆనందాన్నిపొందుతారు. అల్లాహ్ప్రత్యేక దీవెనలప్రసరణవలన, తాము భయంకరమైన నరకాగ్నిజ్వాలలనుండిసురక్షితంగాఉన్నాననిఆశిస్తూ, సంతోషంతోఉంటారు. (ఇబ్నెరజబ్, అల్లతాయిఫ్, p.8)

ప్రతిముస్లింతమజీవితపువిలువనుతప్పకుండాగ్రహించవలెను. చనిపోయేలోగాఅల్లాహ్ను సాధ్యమైనంత ఎక్కువగా ఆరాధిస్తూ, అనేకపుణ్యాలుసంపాదించటానికితీవ్రంగాప్రయత్నించవలెను. దివ్యఖుర్ఆన్లోఅల్లాహ్ఇలాప్రకటిస్తున్నాడు:

మరియుమీపైరూఢీఅయినదిరానంతవరకు, మీప్రభువునుఆరాధించండి.” [సూరహ్అల్హిజ్ర్ 15:99] ముఫస్సిరీన్ (ఖుర్ఆన్వ్యాఖ్యానకర్తలు) ఇలాతెలిపినారు: “రూఢీఅయినదిరానంత వరకు అంటేఖచ్చితమైన, నిస్సందేహమైనమరణము సమీపించనంత వరకు.”

ఆరాధనలకోసంప్రత్యేకింపబడినఅటువంటిశుభసమయాలలోదిల్హజ్జ్మాసంలోనిమొదటిపదిదినాలుకూడావస్తాయి. అల్లాహ్వీటినిసంవత్సరంలోనిమిగతాదినాలకంటేఉత్తమమైనవిగా, ఉన్నతమైనవిగాఎన్నుకొనెను. ప్రవక్తముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లంఒకసారిఉపదేశించిన ఈ హదీథ్ ను వారి సహచరుడైన ఇబ్నెఅబ్బాస్రదియల్లాహుఅన్హుమా ఇలా ఉల్లేఖించినారు: మంచిపనుల (పుణ్యకార్యాల) నుఅల్లాహ్ఎక్కువగాఇష్టపడేదినాలలోపదిదినాలుకాకుండావేరేదినాలేమీలేవు.”అప్పుడుసహచరులుఇలాప్రశ్నించారు, అల్లాహ్కోసంధర్మయుద్ధంచేయటంకంటేనా?”వారుఇలాసమాధానమిచ్చినారు, అల్లాహ్కోసంధర్మయుద్ధంచేయటంకూడాకాదు, అయితే తననుమరియుతనసంపదనుఅల్లాహ్కోసంచేసేధర్మయుద్ధంలోపూర్తిగా సమర్పించుకుని, ఖాళీ చేతులతోమరలివచ్చినతనుతప్ప(సహీహ్బుఖారీహదీథ్గ్రంథం, 2/457).

ఇబ్నెఅబ్బాస్రదియల్లాహుఅన్హుమాఉల్లేఖించినఇంకోహదీథ్లోప్రవక్తముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లంఇలాఉపదేశించినారు: బలిదానపు (ఖుర్బానీ) పదిదినాలలోచేసేపుణ్యకార్యాలకంటేఎక్కువవిలువైనదీ, ఉత్తమమైనదీఅల్లాహ్దృష్టిలోమరేదీలేదు.అప్పుడుసహచరులుఇలాప్రశ్నించినారు, అల్లాహ్కోసంచేసేధర్మయుద్ధంకంటేనా?”(దారిమిగ్రంథం, 1/357; అల్ఇర్వాలోతెలుపబడినట్లుదీనిఉల్లేఖకులపరంపరహసన్వర్గీకరణలోనికివచ్చును, 3/398).

ఈపవిత్ర ఉపదేశాలుమరియుఇటువంటివేఇతరఉపదేశాలుసూచిస్తున్నదానినిబట్టి, ‘సంవత్సరంలోనిమిగిలిన అన్నిదినాలకంటేఈపదిదినాలుఎంతో ఉత్తమమైనవి’ అనటానికిఎటువంటిసందేహామూ లేదు. ఇవిరమదాన్నెలలోనిచివరిపదిదినాలకంటేకూడాఉత్తమమైనవి. కానిరమదాన్నెలలోనిచివరిపదిరాత్రులుతమలోవెయ్యినెలలకంటేఉన్నతమమైనలైలతుల్ఖదర్అనేరాత్రినికలిగిఉండటంవలనఎంతోఉత్తమమైనవి. అంటే సంవత్సరం మొత్తం దినాలలో దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలు మిగిలిన అన్ని దినాల కంటే ఎంతో ఉత్తమమైనవి మరియు సంవత్సరం మొత్తం రాత్రులలో రమదాన్ మాసపు చివరి పది రాత్రులు మిగిలిన అన్ని రాత్రుల కంటే. ఈవిధంగావేర్వేరువ్యాఖ్యానాల, ఉల్లేఖనలమధ్యసమతుల్యాన్ని, పరిష్కారాన్నిసాధించవచ్చును. (తఫ్సీర్ఇబ్నెకథీర్, 5/412).

ఈపదిదినాలుప్రత్యేకమైనవిఅనటానికిఅనేకసాక్ష్యాధారాలుఉన్నాయి:

 1. అల్లాహ్ఖుర్ఆన్లోకొన్నిచోట్లఆప్రత్యేకపదిదినాలపైప్రమాణంచేసియున్నాడు. వేటిపైనైనాప్రమాణంచేయటమంటేఅదివాటిప్రత్యేకతను,గొప్పతనాన్ని,ప్రయోజనాల్నిసూచిస్తుంది. దివ్యఖుర్ఆన్లోఅల్లాహ్ఇలాప్రకటిస్తున్నాడు: ఉషోదయాలప్రమాణంగా; పదిరాత్రులప్రమాణంగా[సూరహ్అల్ఫజర్ 89:1-2]. ఇక్కడఉషోదయాలంటేదుల్హజ్జ్లోనిమొదటిపదిదినాలనిఇబ్నెఅబ్బాస్, ఇబ్నెఅజ్జుబేర్, ముజాహిద్, ఇంకాముందుతరంమరియుతర్వాతతరంవారుఅభిప్రాయపడినారు. “ఇదేసరైనఅభిప్రాయం.”అనిఇబ్నెకథీర్తెలిపినారు(తఫ్సీర్ఇబ్నెకథీర్, 8/413)
 2. పైన తెలిపిన సహీహ్హదీథ్లలో ఈపదిదినాలనుఇహపరలోకాలలోఅత్యుత్తమమైనదినాలుగాప్రవక్తముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లంధృవీకరించినట్లు తెలుసుకున్నాం.
 3. ప్రపంచవ్యాప్తంగాఈపదిదినాలప్రత్యేకతలమరియుహజ్యాత్రికులుఈసమయంలోపవిత్రకాబాగృహందగ్గరచేస్తున్నప్రత్యేకఆరాధనలకారణంగాఈఉత్తమసమయంలోమంచిపనులు, పుణ్యకార్యాలుసాధ్యమైనంత ఎక్కువగాచేయాలనిప్రవక్తముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లంప్రజలనుప్రోత్సహించినారు.
 4. ఈమంచి సమయంలోతస్బీహ్ (సుభహానల్లాహ్), తహ్మీద్ (అల్హమ్దులిల్లాహ్) మరియుతక్బీర్ (అల్లాహ్అక్బర్) ఎక్కువగాఉచ్ఛరించమనిప్రవక్తముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లంఉపదేశించినారు. అబ్దుల్లాహ్ఇబ్నెఉమర్రదియల్లాహుఅన్హుమాఉల్లేఖించినఈహదీథ్లోముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లంఇలాఉపదేశించినారు: తనుపుణ్యకార్యాలనుఅమితంగాఇష్టపడేదినాలలోపదిదినాలుకాకుండాఅల్లాహ్దృష్టిలోవేరేదినాలేమీలేవు.కాబట్టిసమయంలోఎక్కువగాతహ్లీల్ (లాఇలాహఇల్లల్లాహ్), తక్బీర్ (అల్లాహ్అక్బర్), తహ్మీద్ (అల్హమ్దులిల్లాహ్) ఉచ్ఛరించవలెను(అహ్మద్హదీథ్గ్రంథం, 7/224; అహ్మద్షాకిర్దీనినిసహీహ్గావర్గీకరించెను).
 5. ఈపదివిశిష్టదినాలలోయౌమ్అరఫాహ్అంటేఅరఫాహ్దినంకూడాఉన్నది. అల్లాహ్ఇదేదినమునతనధర్మాన్నిసంపూర్ణంచేసినాడు. ఈఉత్తమదినమునఉండేఉపవాసమురెండుసంవత్సరాలపాపాలనుప్రక్షాళనచేయును. ఈఉత్తమదినాలలోయౌమ్అన్నహర్ (బలిదానపుదినంఅంటేఖుర్బానీదినం) కూడాఉన్నది. ఇదిసంవత్సరంమొత్తందినాలలోఅత్యుత్తమమైనదినంమరియుహజ్జ్దినాలలోఅత్యుత్తమమైనదినం. ఈదినముఇతరఅన్నిదినాలమాదిరిగాకాకుండాఆరాధనలనుప్రత్యేకపద్ధతిలోఒక చోటికిచేర్చును.
 6. ఈపదిదినాలలోబలిదానపుదినంఅంటేఖుర్బానీదినంమరియుహజ్జ్దినాలుకూడాఉన్నాయి.

ప్రశ్న: ఉద్హియహ్ (బలిదానంఖుర్బానీ) ఇవ్వాలనుకునేవ్యక్తిపదిదినాలలోవేటినుండిదూరంగాఉండవలెను?

సున్నహ్ప్రకారం(ప్రవక్తముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లంయొక్కఉపదేశాలప్రకారం)బలిదానం (ఖుర్బానీ) ఇవ్వాలనుకునేవ్యక్తితనవెంట్రుకలను,గోళ్ళనుకత్తిరించడంమరియుతనచర్మంనుండిదేన్నైనాసరేతొలగించడంమొదలైనవిఈదిల్హజ్జ్పదిదినాలఆరంభంనుండిబలిదానంసమర్పించేవరకు (ఖుర్బానీచేసేవరకు)మానివేయవలెను. ఎందుకంటేప్రవక్తముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లంఇలాఉపదేశించిఉన్నారు: దిల్హజ్జ్యొక్కక్రొత్తనెలవంకచూడగానే, మీలోఎవరైనాఉద్హియహ్ (బలిదానంఖుర్బానీ) సమర్పించాలనుకుంటే, అదిపూర్తిచేసేవరకు(పశుబలిపూర్తిచేసేవరకు)తనవెంట్రుకలనుమరియుగోళ్ళనుకత్తిరించడంమానివేయవలెను.ఇంకోఉల్లేఖనప్రకారంప్రవక్తముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లంఇలాతెలిపినట్లునమోదుచేయబడినది: అతనుతనవెంట్రుకలులేకచర్మంనుండి (దానినిఅంటిపెట్టుకునిఉన్నవాటిని) దేనినీతొలగించకూడదు.” (నలుగురుఉల్లేఖకులతోసహీహ్ముస్లింహదీథ్గ్రంథంలోనమోదుచేయబడినది, 13/146)

ప్రవక్తముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లంయొక్కఈఆదేశాలుఒకదానినితప్పనిసరిగాచేయమంటున్నాయి (ఖుర్బానీని). ఇంకావారియొక్కనిషేధాజ్ఞలు ఇంకోదానిని(వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించటాన్ని)హరామ్ (ఎట్టిపరిస్థితులలోనుచేయకూడదు) అనిప్రకటిస్తున్నాయి. సరైనఅభిప్రాయంప్రకారంఈఆదేశాలుమరియునిషేధాజ్ఞలుబేషరతుగామరియుతప్పించుకోలేనివిగాఉన్నాయి. అయితే, ఎవరైనావ్యక్తిఈనిషేధించినవాటినికావాలనిచేసినట్లయితే, అతనువెంటనే అల్లాహ్యొక్కక్షమాభిక్షఅర్థించవలెను. అతనిబలిదానం(ఖుర్బానీ)స్వీకరించబడును. అంతే కానిదానికిప్రాయశ్చితంగాఅదనపుబలిదానం (ఖుర్బానీ)సమర్పించుకోవలసినఅవసరంలేదు;హానికలిగిస్తున్నకారణంగాఉదాహరణకుచీలిపోయినగోరు బాధపెట్టటం, వెంట్రుకలున్నచోటగాయంకావటంమొదలైన అత్యవసర పరిస్థితుల వలనకొన్నివెంట్రుకలు లేక గోరుతొలగించవలసి వస్తే, అటువంటివారువాటినితొలగించవచ్చును. అలాచేయటంలోఎటువంటితప్పూ, పాపమూలేదు. ఇహ్రాంస్థితిఎంతోముఖ్యమైనదప్పటికీ, వెంట్రుకలులేకగోళ్ళువదిలివేయటంవలనహానికలుగుతున్నట్లయితే, వాటినికత్తిరించటానికిఅనుమతిఇవ్వబడినది. దిల్హజ్జ్మాసపుమొదటిపదిదినాలలోస్త్రీలుగాని, పురుషులుగానితమతలవెంట్రుకలనుకడగటంలోఎటువంటితప్పూలేదు. ఎందుకంటేప్రవక్తముహమ్మద్సల్లల్లాాహుఅలైహివసల్లంవాటినికత్తిరించటాన్నేనిరోధించినారుగానివాటినికడగటాన్నినిరోధించలేదు.

వెంట్రుకలులేకగోళ్ళుతీయటంపైఉన్ననిషేధంవెనుకఉన్నవివేచనఏమిటంటేబలిదానంసమర్పిస్తున్నతనిఅల్లాహ్కుదగ్గరకావాలనుకునిచేస్తున్నఈపశుబలివంటికొన్నిధర్మాచరణలు, హజ్జ్లేకఉమ్రాయాత్రలోఇహ్రాంస్థితిలోఉన్నవారితోసమానం. కాబట్టివెంట్రుకలు, గోళ్ళుతీయటంవంటికొన్నిఇహ్రాంస్థితిలోనినిబంధనలుపశుబలిఇస్తున్నవారికికూడావర్తిస్తాయి. దీనినిపాటించటంవలనఅల్లాహ్అతనినినరకాగ్నినుండివిముక్తిచేస్తాడనిఒకఆశ.  అల్లాహ్యేఅత్యుత్తమమైనజ్ఞానంకలిగినవాడు.

ఒకవేళఎవరైనాదుల్హజ్జ్నెలలోనిమొదటిపదిదినాలలోఉదియహ్ (బలిదానం) ఇవ్వాలనేసంకల్పంలేకపోవటంవలనతనవెంట్రుకలులేకగోళ్ళుతీసి, ఆతర్వాతఉదియహ్ఇవ్వాలనినిర్ణయించుకున్నట్లయితే, ఆక్షణంనుండిఅతనువెంట్రుకలులేకగోళ్ళుతీయకుండాఉండవలెను.

కొందరుస్త్రీలుదుల్హజ్జ్లోనిమొదటిపదిదినాలలోతమవెంట్రుకలనుకత్తిరించుకునేందుకువీలుగా, తమబలిదానాన్నిచ్చేబాధ్యతనుతమసోదరులకులేకకొడుకులకుఅప్పగిస్తారు. ఇదిసరైనపద్ధతికాదు. ఎందుకంటే, బలిదానంసమర్పిస్తున్నవారికేఈనిబంధనవర్తిస్తుంది–అసలుపశుబలినిపూర్తిచేసేబాధ్యతఇతరులకుఅప్పగించినా, అప్పగించకపోయినా. ఎవరికైతేఆబాధ్యతఇవ్వబడినదోవారికిఈనిబంధనవర్తించదు. స్వయంగాఇష్టపడిఇతరులపశుబలిచేస్తున్నాలేకఇతరులుతమకుఅప్పగించినబాధ్యతనుపూర్తిచేస్తున్నా, అటువంటివారిపై  ఈనిషేధమువర్తించదు.

ఇంకా, ఈనిబంధనబలిదానం (ఖుర్బానీ) చేస్తున్నతనిపైనేఉంటుందిగానిఅతనిభార్యాబిడ్డలకువారుకూడావేరుగాబలిదానం(ఖుర్బానీ) చేస్తున్నట్లయితేనేతప్పవర్తించదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ కుటుంబం తరఫున బలిదానం సమర్పించేవారు కాని వారిని తమ వెంట్రుకలు, గోళ్ళు తీయకుండా ఈ నిబంధనలు పాటించమని ఆదేశించినట్లు ఎక్కడా సాక్ష్యాధారాలు లేవు.

ఎవరైనా బలిదానం(ఖుర్బానీ) సమర్పించాలని నిశ్చయించుకుని, ఆ తర్వాత హజ్జ్ యాత్ర చేయటానికి నిర్ణయించుకున్నట్లయితే, వారు ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు వెంట్రుకలు గాని గోళ్ళు గాని తీయకూడదు. ఎందుకంటే ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు అవసరమైనప్పుడు వెంట్రుకలు లేక గోళ్ళు తీయటమనేది సాధారణ సమయాలలో మాత్రమే పాటించే ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచారం. కాని ఒకవేళ “తమత్తు” పద్ధతి ప్రకారం హజ్జ్ చేస్తున్నట్లయితే, [ఉమ్రా పూర్తి చేసి, ఇహ్రాం స్థితి నుండి బయటకు వచ్చి, మరల హజ్జ్ కోసం క్రొత్తగా ఇహ్రాం స్థితిలో ప్రవేశించేవారు], ఉమ్రా పూర్తి చేసిన తర్వాత తన వెంట్రుకలను చిన్నగా కత్తిరించకోవలెను. ఎందుకంటే వెంట్రుకలు తీయటమనేది ఉమ్రాలోని ఒక ఆచరణ.

పైన తెలిపిన హదీథ్ లో బలిదానం(ఖుర్బానీ) ఇచ్చేవారికి వర్తించే నిబంధనలన్నీ తెలియజేయబడినవి. సుగంధద్రవ్యాల వాడకంలో లేక భార్యతో సంభోగం చేయటంలో లేక కుట్టబడిన దుస్తులు ధరించటంలో ఎటువంటి నిషేధాజ్ఞలు లేవు. అల్లాహ్ కే ప్రతిదీ తెలియును.

ఈ పది దినాలలో ఆచరించవలసిన ఆరాధనా పద్ధతులు: అల్లాహ్ తరఫు నుండి ఈ పది దినాలు తన దాసుల వైపునకు ఒక గొప్ప దీవెనగా గ్రహించవలెను. మంచి  పనులలో, శుభకార్యాలలో, దానధర్మాలలో చైతన్యవంతంగా, క్రియాత్మకంగా పాల్గొనటం ద్వారా వీటికివిలువనిచ్చినట్లగును. ఈ దీవెనకు తగిన ప్రాధాన్యతనివ్వటం ముస్లింల కనీస బాధ్యత. పూర్తి ఏకాగ్రతతో, వివిధ దైవారాధనలలో ఎక్కువ సమయం గడపటానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఈ పది దినాలలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించటానికి స్వయంగా తనను తాను అంకితం చేసుకోవలెను.మంచి పనులు చేయటానికి మరియు వివిధ ఆరాధనలు చేయటానికి ప్రసాదించబడిన రకరకాల అవకాశాలు కూడా అల్లాహ్ తన దాసులపై అవతరింపజేసిన ప్రత్యేక దీవెనలలోనికే వస్తాయి. ఈ శుభకార్యాల ద్వారా ముస్లింలు ఎల్లప్పుడూ చైత్యవంతంగా, క్రియాత్మకంగా మరియు నిరంతరాయంగా తమ అల్లాహ్ ను ఆరాధించటానికి అవకాశం ఉన్నది.

 

దిల్ హజ్జ్ మాసపు మొదటి పది పవిత్రదినాలలో ముస్లింలు ఆచరించటానికి ప్రయత్నించవలసిన కొన్ని మంచి పనులు:

 1. ఉపవాసం.దిల్ హజ్జ్ 9వ తేదీన ఉపవాసం ఉండటమనేది ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆచరించి మార్గదర్శకత్వం వహించిన ఆచరణలలోనిది. ఈ శుభసమయంలో మంచి పనులు చేయవలెనని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించి ఉన్నారు. మరి, ఉపవాసమనేది పుణ్యకార్యాలలో ఒక మహోన్నతమైన పుణ్యకార్యం కదా. సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథపు ఒక హదీథ్ ఖుద్సీలో ఉపవాసాన్ని తను ఎన్నుకున్న ఆరాధనగా అల్లాహ్ ప్రకటించెను: అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: ‘ఒక్క ఉపవాసం తప్ప, ఆదం సంతానపు పుణ్యకార్యాలన్నీ వారి కోసమే. అది మాత్రం నా కోసం. మరియు దాని ప్రతిఫలాన్ని నేను స్వయంగా అతనికి ప్రసాదిస్తాను.’”
 2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దిల్ హజ్జ్ మాసపు 9వ రోజున ఉపవాసం ఉండేవారు.హునైదహ్ ఇబ్నె ఖాలిద్ తన భార్య ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహి వసల్లం యొక్క కొందరు భార్యలు ఇలా పలికినారని ఉల్లేఖించెను: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 9వ దిల్ హజ్జ్ దినమున, అషూరహ్ దినమున, ప్రతి నెల మూడు దినములలో మరియు ప్రతి నెల మొదటి రెండు సోమవారాలు మరియు గురువారాలు ఉపవాసం ఉండేవారు.” (అన్నిసాయి హదీథ్ గ్రంథం, 4/205 మరియు అహూ దావూద్ హదీథ్ గ్రంథం; సహీహ్ అబి దావుద్ గ్రంథంలో, 2/462 దీనిని సహీహ్ హదీథ్ గా షేఖ్ అల్ బానీ వర్గీకరించెను.)
 3. తక్బీర్. దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో తక్బీర్ (“అల్లాహు అక్బర్”), తహ్మీద్ (“అల్హమ్దులిల్లాహ్”), తహ్లీల్ (“లా ఇలాహ ఇల్లల్లాహ్”) మరియుతస్బీహ్ (“సుభహానల్లాహ్”) అని బిగ్గరగా       ఉచ్ఛరించవలెను. ఇది మస్జిద్ లలో, ఇంటిలో, దారిలో, ఇంకా ఆరాధనలో భాగంగా మరియు అల్లాహ్ యొక్క మహోన్నత్వాన్ని మరియు సార్వభౌమత్వాన్ని ప్రకటించటంలో భాగంగా అల్లాహ్ పేరు స్మరించటానికి మరియు బిగ్గరగా ఉచ్ఛరించటానికి అనుమతింపబడిన ప్రతి చోట ఉచ్ఛరించలెను.పురుషులు దీనిని బిగ్గరగా మరియు మహిళలు నిదానంగా ఉచ్ఛరించవలెను. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:

వారు తమ కొరకు అక్కడ ఉంచబడిన ప్రయోజనాలను చూసుకోవాలని, అల్లాహ్ వారికి ప్రసాదించబడిన పశువులపై కొన్ని నిర్ణీత దినాలలో ఆయన పేరును స్మరించాలి (అల్లాహ్ పేరుతో బలిదానం చేయాలని) స్వయంగా తినాలి, లేమికి గురి అయిన ఆగత్యపరులకు పెట్టాలి…” [సూరహ్ అల్ హజ్జ్ 22:28]

నిర్ణీత దినాలంటే దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలని మెజారిటీ పండితులు అంగీకరించినారు. ఎందుకంటే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఒక హదీథ్ లోని పదాలలో “(దిల్ హజ్జ్ మాసపు) మొదటి పది దినాలు నిర్ణీత దినాలని” ఉన్నది.

తక్బీర్ లో “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహ్;వల్లాహు అక్బర్ వ లిల్లాహిల్ హమ్ద్(అల్లాహ్ యే మహోన్నతుడు, అల్లాహ్ యే మహోన్నతుడు, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడెవరూ లేరు; అల్లాహ్ యే మహోన్నతుడు మరియు సకల స్తోత్రములు అల్లాహ్ కే చెందును)” మరియు ఇలాంటి ఇతర పదాలు కూడా పలక వచ్చును.

తక్బీర్ పలకటమనేది ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణా విధానం. కాని నేటి కాలంలో దీనిని ప్రజలు పూర్తిగా మరచిపోయినారు. ఈ రోజులలో చాలా అరుదుగా అతి కొద్ది మంది మాత్రమే తక్బీర్ పదాలు పలుకు తున్నారు. ఈ తక్బీర్ ను బిగ్గరగా ఉచ్ఛరించ వలెను. దీని ద్వారా నిర్లక్ష్యం చేయబడుతున్న ఒక సున్నహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచారాన్ని)ను తిరిగి పునరుద్ధరింపవలసిన అవసరాన్ని గుర్తు చేసినట్లవుతుంది. ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమామరియు అబు హురైరా రదియల్లాహు అన్హు లు దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో మార్కెట్ ప్రాంతాలకు వెళ్ళి, అక్కడ బిగ్గరగా తక్బీర్ ఉచ్ఛరించేవారని మరియు వారి తక్బీర్ పలుకులు వినగానే ప్రజలు కూడా బిగ్గరగా తక్బీర్ పలుకులు ఉచ్ఛరించే వారని స్పష్టమైన సాక్ష్యాధారాలతో నమోదు చేయబడినది. ప్రజలను తక్బీర్ పలుకలు ఉచ్ఛరించమని గుర్తు చేయటం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, ప్రతి ఒక్కరూ స్వయంగా తక్బీర్ ఉచ్ఛరించమనేగాని అందరూ కలిసి సమశ్రుతిలో ఒకేసారి తక్బీర్ ఉచ్ఛరించమని కాదు. ఇలా ఒకేసారి అందరూ కలిసి ఒకే గొంతులో ఉచ్ఛరించే విధానానికి షరిఅహ్ లో ఎటువంటి ఆధారం లభించదు.

పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన సున్నహ్ ను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచారాన్ని మరల పునరుద్ధరించటమనే చర్యకు అనేకమైన పుణ్యాలు లభించును. దీనికి ఆధారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించి ఈ హదీథ్: ఎవరైతే నా మరణం తర్వాత ప్రజలు మరచిపోయిన నా సున్నహ్ ను (ఆచారాన్ని) తిరిగి పునరుద్ధిరంచారో, వారు ఆ సున్నహ్ ను ఆచరిస్తున్న ప్రజల పుణ్యాలలో ఎటువంటి తగ్గింపూ లేకుండా, వారూ (పునరుద్ధరించినవారూ) అన్ని పుణ్యాలు పొందుతారు.(అత్తిర్మిథీ హదీథ్ గ్రంథం, 7/443; ఉల్లేఖకుల పరంపర ఆధారంగా ఇది హసన్ హదీథ్ గా వర్గీకరింపబడినది.)

 • హజ్జ్ మరియు ఉమ్రా యాత్ర చేయటం.ఈ పవిత్ర పది దినాలలో ఎవరైనా చేయగలిగే ఉత్తమ శుభకార్యాలలో అల్లాహ్ యొక్క గృహాన్ని హజ్జ్ యాత్ర కోసం సందర్శించటం.ఎవరికైతే అల్లాహ్ తన పవిత్ర గృహాన్ని సందర్శించే మరియు సరైన పద్ధతిలో అన్ని ఆరాధనలు పూర్తి చేయటానికి సహాయ పడుతున్నాడో వారి ఔన్నత్యాన్ని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీథ్ ఇలా ప్రకటించినారు: స్వీకరింపబడిన హజ్జ్ యాత్ర తెచ్చే పుణ్యఫలం స్వర్గం కంటే తక్కువ ఉండదు.”

 

 1. మంచి పనులు అధికంగా చేయటం. ఎందుకంటే అల్లాహ్ కు మంచి పనులంటే ఇష్టం మరియు అవి అల్లాహ్ నుండి అమితమైన పుణ్యాలను సంపాదించి పెట్టును.ఎవరైతే హజ్జ్ యాత్రకు వెళ్ళలేక పోయారో, వారు ఈ పవిత్ర సమయంలో అల్లాహ్ ధ్యానంలో, ప్రార్థనలలో, నమాజలలో, ఖుర్ఆన్ పఠనంలో, అల్లాహ్ ను స్మరించటంలో, దానధర్మాలలో, తల్లిదండ్రులను గౌరవించటంలో, బంధువులతో సంబంధాలు మెరుగు పరచటంలో, సమాజంలో మంచిని ప్రోత్సహించటంలో మరియు చెడును నిరోధించటంలో, ఇంకా ఇతర వివిధ రకాల మంచి పనులు, పుణ్యకార్యాలలో, ఆరాధనలలో మునిగి పోవలెను.
 2. ఖుర్బానీ – బలిదానం సమర్పించటం.ఈ పవిత్ర పది దినాలలో ఎవరినైనా అల్లాహ్ కు దగ్గర చేర్చే శుభకార్యాలలో పశుబలి సమర్పించటం, దాని కోసం ఒక ఉత్తమమైన పశువును ఎన్నుకోవటం, దానిని బాగా మేపటం, అల్లాహ్ కోసం ఖర్చు పెట్టటం అనేలి కూడా ఉన్నాయి.
 3. చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడటం మరియు క్షమాపణ వేడుకోవటం. ఈ పది పవిత్ర దినాలలో ఎవరైనా చేయగలిగే మంచి శుభకార్యాలలో ఒకటి – తాము చేసిన తప్పులకు, పాపములకు పశ్చాత్తాప పడుతూ, అల్లాహ్ ను చిత్తశుద్ధితో క్షమాపణ వేడుకోవటం. తమలోని అని అవిధేయతా పనులను, పాపపు పనులను, చెడు అలవాట్లను వదిలివేయటానికి గట్టిగా నిర్ణయించుకోవటం. పశ్చాత్తాపపడటమంటే అల్లాహ్ వైపునకు తిరిగి మరలటం మరియు అల్లాహ్ ఇష్టపడని అన్ని తప్పుడు పనులను అవి రహస్యమైనవైనా లేక బహిరంగమైనవైనా సరే వదిలివేయటం. ఏ పాపాలైతే జరిగి పోయినవో, వెంటనే వాటిని పూర్తిగా వదిలి వేసి, మరల వాటి వైపు మరలమని గట్టిగా నిశ్చయించుకుని, అల్లాహ్ ఇష్టపడే పుణ్యకార్యాలనే మనస్పూర్తిగా చేయటానికి ప్రయత్నించ వలెను.

ఒకవేళ ఎవరైనా ముస్లిం పాపం చేసినట్లయితే, ఆలస్యం చేయకుండా వెనువెంటనే పశ్చాత్తాప పడవలెను. దీనికి మొదటి కారణం చావు ఏ క్షణాన వస్తుందో ఎవరికీ తెలియక పోవటం. రెండోది ఒక పాపపు కార్యం ఇంకో పాపపు కార్యానికి దారి చూపుతుందనే వాస్తవ అనుభవం.

ప్రత్యేక సమయాలలో పశ్చాత్తాపపడటం, అల్లాహ్ ను క్షమాపణ వేడుకోవటంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే ఆయా శుభసమయాలలో ప్రజల ఆలోచనలు ఆరాధనల వైపునకు మరలి, మంచి పనులు చేయాలనే ఆసక్తి కలిగి, తమలోని తప్పులను, పాపాలను గుర్తించటానికి దారి చూపును. తద్వారా వారిలో గతం గురించిన పశ్చాత్తాప భావనలు కలుగును. పశ్చాత్తాప పడటమనేది అన్ని సమయాలలోనూ తప్పని సరియే. కాని, ఒక ముస్లిం అత్యంత శుభప్రదమైన దినాలలో మంచి పనులతో పాటు, ఆరాధనలతో పాటు పశ్చాత్తాపాన్ని జత పరచటమనేది అల్లాహ్ ఆమోదిస్తే (ఇన్షాఅల్లాహ్) సాఫల్యానికి చిహ్నమగును. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: కాని, ఎవరు ఇక్కడ పశ్చాత్తాప పడతాడో, విశ్వసించి మంచి పనులు చేస్తేడో, అతడు అక్కడ సాఫల్యం పొందే వారి మధ్య ఉండగలను అని ఆశించగలుగుతాడు.” [సూరహ్ అల్ ఖశశ్ 28:67]

సమయం త్వరత్వరగా గడిపోతుండటం వలన, ఈ ముఖ్యసమయాలలోని శుభాలను ముస్లింలు కోల్పోకుండా చూసుకోవలెను. తనకు అవసరమైనప్పుడు పనికి వచ్చేవి మంచి పనుల ద్వారా సంపాదించుకున్న పుణ్యాలే. ఎన్ని పుణ్యాలున్నా సరే, అక్కడి అవసరాలకు చాలవు. కాబట్టి ఇలాంటి శుభసమాయలలో అధిక పుణ్యాలు సంపాదించుకుంటూ, రాబోయే సుదీర్ఘ ప్రయాణానికి స్వయంగా తయారు కావలెను. ఏ క్షణంలో బయలుదేరటానికైనా సరే సిద్ధంగా ఉండవలెను. గమ్యస్థానం చాలా దూరంగా ఉన్నది. ఏ ఒక్కరూ తప్పించుకోలేని సుదీర్ఘ ప్రయాణము భయభ్రాంతుల్ని కలిగిస్తున్నాయి. మోసం, దగా, వంచన నలుమూలలా వ్యాపించి ఉన్నాయి. కాని, అల్లాహ్ ప్రతి క్షణాన్ని గమనిస్తున్నాడు. ఆయన వైపునకే మనము మరల వలసి ఉన్నది మరియు ఆయనకే మన కర్మలు సమర్పించవలసి ఉన్నది. దీని గురించి దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: కాబట్టి ఎవరైతే అణువంత మంచిని చేసారో, వారు దానిని చూస్తారు. మరియు ఎవరైతే అణువంత చెడును చేసారో, వారు దానిని చూస్తారు.”[సూరహ్ అజ్జల్ జలాహ్99:7-8]

కూడగట్ట వలసిన పుణ్యఫలాలు చాలా ఉన్నాయి. కాబట్టి విలువ కట్టలేని మరియు ప్రత్యామ్నాయం లేని ఈ పది శుభదినాలలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవలెను. చావు సమీపించక ముందే, సరైన సమయంలో ప్రతిస్పందించక, మంచి అవకాశాన్ని చేజార్చుకోక ముందే, ఏ ప్రార్థనలూ స్వీకరించబడని చోటుకు చేరుకోమని ఆదేశింపబడక ముందే, ఆశించుతున్న వానికి మరియు అతను ఆశించిన వాటికి మధ్య చావు అడ్డుపడక ముందే, నీ కర్మలతో సమాధిలో చిక్కుకోక ముందే మంచి పనులు, శుభకార్యాలు చేయటానికి త్వరపడవలెను.

గాఢాంధకారంతో నిండిన హృదయం గలవాడా, నీ హృదయాన్ని వెలుగుకిరణాలతో నింపి, మెత్తపరచే సమయం ఇంకా ఆసన్నం కాలేదా? ఈ పది శుభదినాలలో మీ ప్రభువైన అల్లాహ్ తరఫు నుండి వీస్తున్న చల్లటి దీవెనల ఆహ్లాదాన్ని కోల్పోవద్దు. అల్లాహ్ తను ఇష్టపడిన వారికి ఈ చల్లటి పవనాలు తప్పక స్పర్శించేటట్లు చేస్తాడు. అటువంటి పుణ్యాత్ములు తీర్పుదినాన ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను మరియు వారి కుటుంబాన్ని మరియు వారి సహచరులను అల్లాహ్ మరింతగా దీవించు గాక.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *