సుందర సమాజంకోసం దివ్యఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్(స.అ.సం) గారి సూక్తులు

సుందర సమాజంకోసం దివ్యఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్(స.అ.సం) గారి సూక్తులు

 • దైవంతో సమానంగా ఎవరినీ నిలబెట్టకండి, ఆరాధించకండి.
 • తల్లిదండ్రులపట్ల సత్ప్రవర్తన కలిగివుండండి.
 • పలికితే న్యాయమే పలకండి, వ్యవహారం మీ బంధువులదైనా సరే.
 • కొలతల్లో తూనికల్లో న్యాయంగా వ్యవహరించండి.
 • చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించండి.
 • పొరుగువారు ఆకలితో వుంటే కడుపునిండా భుజించువాడు విశ్వాసి కాలేడు.
 • తల్లి పాదాలక్రింద స్వర్గం వుంది,తండ్రి స్వర్గానికి మహాద్వారం.
 • కూలివాని చెమట ఆరకముందే అతని కూలిని చెల్లించండి.
 • విధ్యాభోధన చేసిన చేసిన గురువును గౌరవించండి.
 • మీలో ఎవరు నీతిమంతులో వారే గొప్పవారు.
 • బంధుత్వాన్ని తెంచివేసినవారు స్వర్గంలోకిలేరు.

ఫిత్రాదానము

ఫిత్రాదానము

ఫిత్రాదానముఅర్థము:ఈదుల్ ఫిత్ర్ పండుగకు ముందు ఆహారధాన్యాల నుండి (బియ్యం, గొధుమలు మొదలగు వాటి నుండి) ఒక సా” (3 కేజీలు) బీద ముస్లిములకు దానం చేయుట. ఇది ఉపవాస స్థితిలో జరిగే చిన్నచిన్న తప్పులకు పరిహారము వంటిది.

ఫిత్రాదానమువిధిఅగుటకుకారణము: హదీథ్ లలో ఈ విధముగా తెలుపబడినది: ఇది ఉపవాసి యొక్క చిన్నచిన్న పొరపాట్లను దూరము చేయును. బీదవారుకూడా అందరితో కలిసి పండుగ జరుపుకుంటారు, మరియు అల్లాహ్ కు కృతఙతలు తెలుపుకోవడానికి ఎవరైతే మనచేత రమదాన్ నెల ఉపవాసములు పూర్తి చేయించి ఇస్లాం యొక్క ఒక మూల స్థంభము పై అమలు చేసే శక్తిని మనకు ప్రసాదించాడో.

ఎవరిపైఫిత్రావిధిచేయబడినది:

ప్రతి ఒక్కరిపైఅనగా అప్పుడే పుట్టిన శిశువునుండి, పెద్దవారి వరకు, మరియు బానిసల తరఫు నుండి, అందరి తరఫు నుండి ఆ ఇంటి పెద్ద ఫిత్రా దానము చెల్లించాలి.

అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ముస్లిం పై, స్వతంతృడుగాని, బానిసగానీ, పురుషుడుగాని, స్త్రీ గానీ, పిల్లలు గానీ, పెద్దవారుగానీ, అందరిపై ఒక సాగోధుమలు లేదా ఒక సాబార్లీ దానముగా తీయుటను విధిగావించిరి.” (ముత్తఫఖున్ అలైహ్)

ఫిత్రా దానము ఎవరికి చెల్లించాలి:బీద ముస్లిములకు.

ఫిత్రా దానము గురించి గుర్తుంచుకొన వలసిన విషయాలు:

 1. ఫిత్రా దానము ఈదుల్ ఫిత్రా కి ముందు చెల్లించవలెను.
 2. ఈదుల్ ఫిత్ర్ కు ఒకటి, రెండు రోజులు ముందుగా కూడా చెల్లించవచ్చును.
 3. ఈదుల్ ఫిత్ర్ పండుగ తరువాత చెల్లించిన యెడల అది మామూలు దానము అగును. కనుక పండుగకు ముందే తప్పక చెల్లించవలెను.

 

 

 

 

 

 

కవిత ఎలా నూర్ ఫాతిమాగా మారిపోయినది?

కవిత ఎలా నూర్ ఫాతిమాగా మారిపోయినది? (ఇంటర్వ్యూ: బింత్ అర్షద్ సాహీ)

ఒక ఉగ్రవాద శివసేన హిందూ కుటుంబానికి చెందిన, ఒక అమ్మాయి కథ ఇది. ‘కవిత’ అనే ఆ అమ్మాయి స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది.  ఇస్లాం స్వీకరణ తరువాత ఆమె పేరు ‘నూర్ ఫాతిమా’ గా మార్చుకున్నది.

ప్రశ్న: ఇస్లాం స్వీకరణకు ముందు మీ పేరేమిటి?

జవాబు: ఇస్లాం స్వీకరణకు పూర్వం నా పేరు ‘కవిత’, నన్ను అందరూ ముద్దుగా పేరు ‘పూనమ్’ అని పిలిచేవారు.

ప్రశ్న: మరి ఇస్లాం స్వీకరించిన తరువాత ఇప్పుడు మీ పేరేమిటి?

జవాబు: ఇస్లాం స్వీకరించిన తరువాత నాకు ‘నూర్ ఫాతిమా’ అని పేరు పెట్టడం జరిగింది.

ప్రశ్న: మీరెక్కడ జన్మించారు, ఇప్పుడు మీ వయసెంత? జవాబు: నేను ముంబాయి లో జన్మించాను.  ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. కానీ, నావరకు నేను, నావయసు ఐదు సంవత్సరాలే అనుకుంటాను. ఎందుకంటే, ఇస్లాంకు సంబంధించి నా ఙ్ఞానమూ, అవగాహనా, ఒక ఐదు సంవత్సరాల ముస్లిం పిల్లవాడి కంటే మించదు.

ప్రశ్న: మీ విద్యాభ్యాసాన్ని గురించి చెబుతారా?

జవాబు: ఇండియాలో స్కూలు విద్య పూర్తి చేసిన తరువాత, పై చదువుల కోసం నేను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాను.  మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత, అక్కడే ఎన్నో కంప్యూటర్ కోర్సులు చేసాను. నిజంగా నేను విచారిస్తున్నాను, ప్రాపంచిక జీవితం కోసం చాలా డిగ్రీలు సంపాదించాను.  కానీ పరలోక జీవితం కోసం ఏమీ చేయలేక పోయాను.  ఈ ఆశయం సాధించడం కొరకు ఇప్పుడు సాధ్యమైనంత చేయాలని కోరుకుంటున్నాను.

ప్రశ్న: మీ జీవితానికి సంబంధించి ఇంకా వివరాలు చెప్పండి?

జవాబు: నా చదువులు పూర్తయిన తరువాత, ముంబాయిలో నేను ఒక స్కూల్లో టీచరుగా చేరాను. అది చాలా పెద్ద స్కూల్.  కోటీశ్వరుల పిల్లలే అక్కడ చదవడానికి వస్తారు.

ప్రశ్న: మీ వివాహం ఎక్కడ జరిగింది, మీకెంత మంది పిల్లలు?

జవాబు: నా వివాహం ముంబాయిలో జరిగింది.  కానీ తరువాత నేను నా భర్త వెంట బహ్రెయిన్ వచ్చాను.  నాకు ఇద్దరు మగపిల్లలు.

ప్రశ్న: మీరు ఇస్లాం స్వీకరించటం ఏ విధంగా జరిగింది?

జవాబు: అన్నింటికన్నా ముందుగా నాపై కురిపించిన అనుగ్రహాలకు గాను నేను అల్లాహ్ కు కృతఙ్ఞతలు అర్పించుకుంటున్నాను.  ఆయన ప్రవక్త, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నట్లు “ఎవరికైతే అల్లాహ్ మంచి చేయాలని తలపోస్తాడో, వారికి ధర్మానికి సంబంధించిన అవగాహనను కలుగజేస్తాడు” అని, నాపై అల్లాహ్ ఎంతగానో తన కారుణ్యాన్నీ, అనుగ్రహాన్నీ కురిపించాడని అనుకుంటున్నాను. ముస్లిములు అంటేనే విపరీతంగా అసహ్యించుకునే, ఉగ్రవాద హిందూ వాతావరణంలో పెరిగాను నేను.  నేను ఇస్లాం స్వీకరించటం నా వివాహం అయిన తరువాత జరిగింది. కానీ, చిన్నప్పటినుంచే విగ్రహాలకు పూజ చేయటం అంటే ఇష్టం ఉండేది కాదు నాకు.  ఇప్పటికీ బాగా గుర్తు నాకు – ఒక సారి, మా ఇంట్లో ఉన్న ఒక విగ్రహాన్ని తీసుకెళ్ళి స్నానాలగదిలో పడేసాను.  దాంతో మా అమ్మ నన్ను బాగా తిట్టిపోసింది. దానికి నేను మా అమ్మతో “తనను తాను కూడా రక్షించుకోలేని ఆ విగ్రహానికి ఎందుకమ్మా మీరు తలలు వంచి దండాలు పెడతారు.  అది మీకేం ఇస్తుందనీ?” అన్నాను.  మా కుటుంబంలో ఒక సాంప్రదాయం ఉంది.  ఆడపిల్లకు పెళ్ళైనపుడు, ఆ అమ్మాయి తన భర్త కాళ్ళు కడిగి, ఆ నీళ్ళను తాగాలి.  కానీ ఆ మొట్టమొదటి రోజే, నేను అలా చేయడానికి నిరాకరించాను. దానికి అందరూ నన్ను విపరీతంగా తిట్టారు.  నేను మీకు ముందే చెప్పాను కదూ, నేను ఒక స్కూల్లో టీచరుగా చేరానని – స్కూలుకు నేను ఒక్కదాన్నే వెళ్ళి వస్తూ ఉండటం, కారును నేను స్వయంగా డ్రైవ్ చేయటం వల్ల, దార్లోనే ఉన్న, ఒక ఇస్లామిక్ సెంటర్ కు వెళ్ళడం ప్రారంభించాను. నేను వారి సంభాషణ విన్నాను.  వారు విగ్రహాలను పూజించరన్న విషయం నాకు అర్థమైంది.  వారు, అనుగ్రహాలను, ఆశీర్వాదాలను కోరుకునేది వేరే ఇంకెవరి నుంచో.  వారి దేవుడు విగ్రహాలు కాదు – వేరే ఇంకెవరో.  వారి అభిప్రాయాలు నచ్చాయి నాకు.  తరువాత నాకు అర్థమైంది ఆ ‘వేరే ఇంకెవరో’ –  ‘అల్లాహ్’ అనీ, సమస్త కార్యాలనూ పరిపూర్తి చేసేది ఆయనే అనీ.

ప్రశ్న: ఇస్లాం వైపునకు మీరు ఎలా ఆకర్షించబడ్డారు?

జవాబు: వారి ఆరాధనా విధానం, అదే ‘నమాజు’ నన్ను బాగా ప్రభావితం చేసింది.  అది ‘ఆరాధన’ అన్న విషయం అంతకు ముందు తెలియదు నాకు.  అయితే ముస్లిములందరూ అలా చేస్తారని మాత్రం తెలుసు.  అదేదో ఒకరకం వ్యాయామం కాబోలు అనుకునే దాన్ని. ఇస్లామిక్ సెంటర్ కి వెళ్ళి రావడం మొదలు పెట్టిన తరువాత, అది ఒక ‘ఆరాధన’ అనీ, దానిని ‘నమాజు’ అంటారనీ తెలిసింది నాకు.  నేనెప్పుడూ కలలో ఒక రకమైన ఆకారాన్ని చూస్తూ ఉండే దాన్ని.  అది నలుచదరపు గదిలా ఉండేది.  ప్రతి రోజూ కలలో చూస్తూ ఉండే దానిని.  కలత చెంది నిద్ర నుంచి లేచి పోయేదానిని.  చెమటలు పట్టేవి. పడుకుంటే మళ్ళీ కలలోకి వచ్చేది. నా కలలో కనిపించిన ఆ గదిని గురించి, తరువాత చాలా తెలుసుకున్నాను నేను.

ప్రశ్న:  మీరు ఇస్లాం స్వీకరించడం గురించి మీ కుటుంబానికి ఎలా తెలిసింది?

జవాబు: పెళ్ళయింతర్వాత, నా భర్తతో పాటు బహ్రెయిన్ కు వెళ్ళటం, ఇస్లాం పట్ల అవగాహన పెంచుకోవాటానికి బాగా ఉపకరించింది. అదొక ముస్లిం దేశం కావటం వల్ల, మా ఇంటి చుట్టుపక్కల అందరూ ముస్లిములే ఉండేవారు.  అలా ఒక ముస్లిమం అమ్మాయితో నాకు స్నేహం అయ్యింది.  ఆ అమ్మాయి ఎపుడో కానీ మాయింటికి వచ్చేది కాదు.  చాలాసార్లు నేనే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళుతూ ఉండే దానిని.  ఒకసారి, అది రమదాన్ నెల కావటంతో, ఒకరోజు నాతో వాళ్ళ ఇంటికి ఇక రావద్దని కరాఖండిగా చెప్పేసింది.  నేను ఆశ్చర్యపోయాను.  “నువ్వు మా ఇంటికి రావడం వల్ల, నా ఆరాధనలకు అతరాయం కలుగుతున్నది” అంది తను. నాకు, ఇస్లాం యొక్క ఆరాధనలు, ఆచరణలు, సాంప్రదాయాలు తెలుసుకోవాలని బాగా కోరికగా ఉండటంతో, ఆ అమ్మాయి మాటలు నాలో మరింత ఉత్సుకతను రేపాయి.  నేను ఆ అమ్మాయిని బతిమాలాను “ప్లీజ్! అలా అనకు.  నువ్వు ఏ ఆరాధన చేయాలనుకుంటావో, చెయ్యి.  ఎలా ఆచరిస్తావో అలా ఆచరించు. నేను ఒక్క మాట కూడా మాట్లాడను.  కేవలం చూస్తూ ఉంటానంతే.  నువ్వు ఏం చదువుతావో, జస్ట్ వింటూ ఉంటానంతే.  నావల్ల నీకు ఎలాంటి అంతరాయం, ఆటంకం కలుగకుండా మసలుకుంటాను.” అన్నాను.  ఆ అమ్మాయి సరేనంది.  నేను ఎప్పుడైనా ఆ అమ్మాయిని ఏదో ఒక ఆరాధనలో మునిగి ఉండగా చూస్తే, దానికి బాగా ఆకర్షితమై పోయే దానిని – నేను కూడా అలా చేయాలనీ, అలా ఆచరించాలనీ బలంగా అనిపించేది నాకు.  ఒకసారి ఆ అమ్మాయిని అడిగాను ఆ ‘యోగా వంటి వ్యాయామాన్ని’ గురించి.  తను చెప్పింది దానిని ‘నమాజు’ అంటారనీ, తను పఠించే ఆ గ్రంథాన్ని ‘దివ్య ఖుర్’ఆన్’ అంటారనీ.  నేను కూడా అవన్నీ చేయాలనీ ఆశపడేదానిని.  ఇంటికి తిరిగి వెళ్ళినపుడు, ఒక గదిలోకి దూరి, లోనుంచి గడియ పెట్టుకుని, నాకు అంతగా ఏమీ తెలియక పోయినా, ఆ ఏకాంతంలో నా స్నేహితురాలు ఆచరించినట్లుగా అన్ని పనులూ ఆచరిస్తూ ఉండే దానిని. ఒకరోజు, గది తలుపులు లోపలి నుంచి గడియ పెట్టడం మరిచిపోయి, నమాజు ఆచరించటం ప్రారంభించాను.  నా భర్త గదిలోనికి ప్రవేశించటప్పటికి నేను నమాజులో ఉన్నాను.

‘ఏం చేస్తున్నావ్?’ అని అడిగాడు నన్ను. ‘నమాజు చేస్తున్నాను’ అన్నాన్నేను.

‘నీకేమన్నా మతి పోయిందా?  తెలివుండే మాట్లాడ్తున్నావా నువ్వూ? ఏమంటున్నావో అర్థమవుతున్నదా నీకసలు?’ కోపంతో ఊగిపోతూ అడిగాడు.

ముందు నేను కొద్దిగా వణికాను, భయంతో నాకళ్ళు మూసుకుపోతున్నాయి. కానీ అంతలోనే, నాలో అంతరంగా ఉన్న శక్తి, ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాకు ధైర్యాన్నిచ్చింది.  అంతే, నేను గట్టిగా అరిచి మరీ చెప్పాను ‘అవును, నేను ఇస్లాం స్వీకరించాను. అందుకే నమాజు చేస్తున్నాను’.

‘ఏంటీ? ఏమన్నావ్? ఏదీ మళ్ళొకసారి అను?’ కోపంతో ఊగిపోతూ, రెట్టించి అడిగాడు అతను.

‘అవును, నేను ఇస్లాం స్వీకరించాను’ అన్నాన్నేను.

అంతే, నన్ను పశువును కొట్టినట్లు, కొట్టడం మొదలు పెట్టాడు.  మా అరుపులు, ఆ దెబ్బల చప్పుళ్ళు విని, మా అక్క పరుగెత్తుకు వచ్చింది. ఆవిడ నన్ను విడిపించటానికి ప్రయత్నించింది.  కానీ, నా భర్త చిప్పిందంతా విని, తాను కూడా నాపై చేయి చేసుకోవడం ప్రారంభించింది. నేను తనని ఆపి అన్నాను “అక్కా! దయచేసి, నాదారికి అడ్డు రావద్దు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు.  నా కొరకు ఏది మంచో, ఏది చెడో నాకు తెలుసు.  నేను ఎంచుకున్న మార్గం పై నేను నడిచి తీరుతాను.’ ఇది విని, నా భర్త ఉగ్ర రూపం దాల్చాడు.  నన్ను ఎంతగా హింసించాడంటే – నేను స్పృహ తప్పి పడిపోయాను.

ప్రశ్న: మరి అప్పుడు మీ పిల్లలు ఎక్కడున్నారు? ఎంత వయసు ఉండి ఉంటుంది వాళ్ళకపుడు?  అక్కడినుంచి ఎలా తప్పించుకో గలిగారు మీరు?

జవాబు: ఈ భయానకమైన డ్రామా అంతా జరుగుతున్నపుడు నా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.  నా పెద్ద కొడుకు 9 వ సంవత్సరంలోనూ, నా చిన్న కొడుకు 8 వ సంవత్సరంలోనూ ఉన్నారు.  కానీ ఈ సంఘటన జరిగిన తరువాత నేను ఎవరినీ కలువకుండా కట్టడి చేసారు, చివరికి నా పిల్లలను కూడా.  నన్ను ఒక గదిలో వేసి తాళం వేసారు.  సాంప్రదాయబధ్ధంగా నేను ఇస్లాం స్వీకరించక పోయినప్పటికీ, నేను ఆవిధంగా అనేసాను ‘నేను ఇస్లాం స్వీకరించాను’ అని.  ఒక రోజు రాత్రి, నేను ఆ గదిలో పడిఉండగా, నా పెద్దకొడుకు నావద్దకు వచ్చాడు. అంతే, నన్ను చూస్తూనే, నా చేతుల్లో వాలిపోయి, గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టాడు.  లోనుంచి తన్నుకు వస్తున్న ఏడుపును దిగమింగుకుని, ‘వాళ్ళందరూ లేరా?’ అని అడిగాను.  ఎవరూ ఇంట్లో లేరనీ, వాళ్ళందరూ ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళారనీ చెప్పాడు  (ఏదో హిందూ పండుగ సందర్భంగా జరుగుతున్న ఫంక్షన్ అది). నా పెద్దకొడుకు ‘అమ్మా! వాళ్ళంతా నిన్ను చంపాలనుకుంటున్నారు.  నువ్విక్కడినుంచి పారిపోమ్మా’ అన్నాడు.  నేను వాడిని సముదాయించాను ‘కన్నా! నాకేమీ జరుగదు.  వాళ్ళు నన్నేమీ చేయలేరు. నువ్వు జాగ్రత్త, నీ తమ్ముడ్ని కూడా జాగ్రత్తగా చూసుకో.’ అన్నాను.  కానీ వాడు నన్ను పోరుతున్నట్లుగా, సముదాయిస్తూ మళ్ళీ అడగటం మొదలుపెట్టాడు ‘అమ్మా! నువ్విక్కడి నుంచి పారిపోమ్మా!’ అని.  నేను వాడిని మళ్ళీ సముదాయించాను ‘నాకేమీ జరుగదని, తనను జాగ్రత్తగా ఉండమనీ, తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకోమనీ’. కానీ వాడు ఏడుస్తూ ఎక్కిళ్ళమధ్య మళ్ళీ నన్ను పోరడం మొదలుపెట్టాడు.  నేను వాడికి అర్థమయ్యేలా చెప్పాను ‘నేను వెళ్ళలేననీ, వెళ్ళితే తననీ, తమ్ముడ్నీ చూసే అవకాశం కోల్పోతాననీ’.  వాడన్నాడు ‘నువ్వు బ్రతికి ఉంటే కదమ్మా మమ్మల్ని చూసేదీ!  వెళ్ళిపోమ్మా ఇక్కడినుంచి, వాళ్ళు నిన్ను హత్య చేస్తారు, చంపేస్తారమ్మా నిన్నూ, – ప్లీజ్, ఇక్కడినుంచి వెళ్ళిపో ……..’ వాడు ఏడుస్తూ అంటూనే ఉన్నాడు.  నా కన్నీళ్ళను నేను కళ్ళలోనే ఇంకించుకుంటున్నాను. చివరికి నేను నిర్ణయించుకున్నాను ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని. ఆ నిర్ణయం తీసుకున్న కఠినమైన క్షణాలను నేను ఎన్నటికీ మరిచిపోలేను.  నా పెద్దకొడుకు, నిద్రపోతున్న నా చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి ‘నానీ ! లేవరా ! అమ్మ వెళ్ళిపోతున్నది. మళ్ళీ మనల్ని కలుస్తుందో లేదో, లేవరా!’ అని లేపుతున్నాడు. వాడు కళ్ళు నులుముకుంటూ లేచాడు.  నన్ను చాలా రోజుల తరువాత చూస్తున్నాడు వాడు. ఒకడుగు ముందుకు వేసి ఏడుస్తూ నన్ను అల్లుకు పోయాడు. నేను మనసులోనే రోదిస్తున్నాను.  బహుశా, పిల్లలకు అన్ని విషయాలూ ముందుగానే తెలుసులా ఉంది.  వాడు నన్ను ఒక్కటే మాట అడిగాడు ‘అమ్మా! వెళ్ళిపోతున్నావా నువ్వూ?’  కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా ‘అవును’ అన్నట్లుగా తలాడించాను ‘మనం తప్పకుండా మళ్ళీ కలుస్తాంరా నానీ’ అంటూ.  నేను మోకాళ్ళపై కూర్చుని, పిల్లలిద్దర్నీ హత్తుకుని తనివితీరా ఏడుస్తున్నాను. ఒకవైపు పిల్లలపై ప్రేమ, వారిని విడిచి వెళ్ళిపోతున్నాని బాధ, మరోవైపు దానిని అధిగమిస్తూ ఇస్లాం పట్ల ప్రేమ.  ఆ చలిచీకటి రాత్రిలో, నేను వెళ్ళిపోతూఉంటే, నా ఇద్దరు కొడుకులూ వీడ్కోలు చెబుతున్నట్లుగా నన్నే చూస్తూ నిలబడ్డారు.  వాళ్ళపై, లోనుంచి పెల్లుబికి వస్తున్న మమతానురాగాలనూ, ప్రేమనూ అతి కష్టంగా అదుపు చేసుకుంటూ వెళ్తున్నాన్నేను. నా వంటిపై గాయాలు పచ్చిగా ఉన్నాయి.  నడవడం కూడా రావడం లేదు.  గేటు దగ్గర నిలబడి పిల్లలిద్దరూ కన్నీళ్ళతో చేతులూపుతున్నారు.  ఆ దృశ్యాన్నీ, ఆ క్షణాలనూ నేను ఎన్నటికీ మరిచిపోలేను. ఆ క్షణాలు నాకెప్పుడు గుర్తుకు వచ్చినా, ముస్లిములు ఇస్లాం కొరకు, తమ కుటుంబాలనూ, భార్యాపిల్లలనూ, తమ సొంత ఊళ్ళనూ వదిలి వలస వెళ్ళిన సంఘటనలను గుర్తు చేసుకునేదానిని.

ప్రశ్న: అప్పుడు మరి ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇస్లాం ఎక్కడ స్వీకరించారు?

జవాబు: ఇంటినుంచి తిన్నగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళాను. పెద్ద చిక్కు ఏమిటంటే, అక్కడెవరికీ, నేను మాట్లాడే భాష ఏమిటో తెలియదు.  అందులో కొద్దిగా ఇంగ్లీషు అర్థం చేసుకోగలిగే ఒకతను ఉన్నాడు.  నేనున్న ఆందోళణకర స్థితిలో శ్వాస తీసుకోవటానికి కూడా కష్టంగా ఉంది నాకు.  నన్ను కొద్ది సేపు విశ్రాంతి తీసుకోనివ్వమని అతడ్ని రిక్వెస్ట్ చేసి, ఆ ప్రక్కన కూర్చుండి పోయాను.  కొద్దిగా కుదుటపడిన తరువాత, అతనికి చెప్పాను ‘నేను ఇల్లు విడిచి వచ్చేసాననీ, నేను ఇస్లాం స్వీకరించాలనీ’. నేను కంగారు-కంగారుగా అన్ని విషయాలూ అతనికి చెప్పేసాను.  అతడు నన్ను ఓదార్చాడు. తను కూడా ముస్లిమేననీ, తనకు చేతనైనంత సహాయం తప్పనిసరిగా చేస్తాననీ అన్నాడు. అతడు నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళి, తన ఇంట్లో అందరికీ పరిచయం చేసాడు.  ఆ రాత్రికి నాకు వాళ్ళ ఇంట్లోనే ఆసరా కల్పించాడు.  ప్రొద్దున్నే నా భర్త పోలీస్ స్టేషన్ కు వచ్చి, తన భార్య కిడ్నాప్ కు గురైందనీ, పోలీసుల సహాయం కోసం వచ్చినట్లుగా చెప్పాడు.  కానీ వాళ్ళు,  నేను కిడ్నాప్ కు గురి కాలేదనీ, నా అంతట నేనే అక్కడికి వచ్చాననీ అతడికి తెలియజేసారు.  నేను ఇస్లాం స్వీకరించలని కోరుకుంటున్నందున, అతడికి (ముస్లిం కానందున) నాపై ఎటువంటి అధికారం లేదనీ, నాతో ఎటువంటి సంబంధమూ లేదనీ కూడా తెలియజేసారు.  కానీ అతడు మొండిగా నేను తనతో రావల్సిందేనని పట్టుబట్టి, బెదిరించడం ప్రారంభించాడు.  నేను అతడితో వెళ్ళడానికి నిరాకరించాను.  ‘కావాలంటే, నా నగలు, బాంకులో ఉన్న డబ్బూ, ఆస్తీ మొత్తం తీసుకో’ అని, అతడితో వెళ్ళనని తెగేసి చెప్పాను.  అయినా మొదట్లో అతడు ఆశ వదులుకోలేదు.  కానీ తరువాత, ఆశలు వదులుకుని, ఆస్తికి సంబంధించి, నాతో ఒక వ్రాత ఒప్పందం మీద సంతకాలు తీసుకుని వెళ్ళిపోయాడు.

ఆ పోలీసు ‘ఇప్పుడు నీకు ఏ ప్రమదమూ లేదు, నీ వాళ్ళెవరూ నిన్నేమీ చేయలేరు.  నీవు నిర్భయంగా ఇస్లాం స్వీకరించవచ్చు’ అని అన్నాడు. తరువాత  చికిత్స కొరకు కొద్ది రోజుల పాటు నేను హాస్పిటల్ లోనే ఉండి పోవలసి వచ్చింది.  ఒకసారి ఒక డాక్టర్ అడిగాడు ‘ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? ఇన్ని రోజులైంది, నిన్ను చూడ్డానికి ఒక్కరైనా రాలేదే’ అని.  నేను మౌనంగా ఉండిపోయాను.  ఒకేఒక్క విషయాన్ని అణ్వేశిస్తూ నేను ఇంటిని విదిలేసాను.  ఇప్పుడు నాకు ఇల్లూ లేదూ, ఒక కుటుంబమూ లేదు. నాకు ఉన్న ఒకేఒక బంధం ‘ఇస్లాం’.  ఇంటిని విడిచి బయటకు అడుగు వేసిన మొదటి దశలోనే నన్ను ఆదుకుంది, ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నది .  ఆ ముస్లిమ్ పోలీసతను నన్ను ‘చెల్లీ’ అని పిలిచాడు. తన ఇంట్లో చోటిచ్చాడు. నాకున్న బంధుత్వాలన్నీ తెగిపోయిన, ఆ చలిచీకటి రాత్రి బంధువై నాకు ఆశ్రయం కల్పించాడు.  ఆ సహాయాన్ని నేను ఎన్నటికీ మరిచిపోలేను.

హాస్పిటల్ లో ఉండగా, ‘తరువాత ఏమిటి’ అని ఆలోచిస్తూ ఆందోళనకు గురయ్యే దానిని. మనశ్శాంతీ, రక్షణ కోసం ఎక్కడికెళ్ళాలీ?  హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయిన తరువాత నేరుగా ఇస్లామిక్ సెంటర్ కు వెళ్ళాను.  అప్పుడక్కడ ఎవరూ లేరు, వయసు మీరిన ఒకాయన తప్ప, బహుశా అందులోనే అతని నివాసం కూడానేమో. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, నా కథంతా చెప్పాను.  ఆయన సలహా మేరకు ముస్లిం స్త్రీలు ధరించే సాంప్రదాయక దుస్తులు ధరించాను. నమాజు ఆచరించటానికి ముందు ముస్లిములు తమ ముఖమూ, చేతులూ, కాళ్ళూ, ఏవిధంగా శుభ్రపర్చుకుంటారో ఆ విధంగా నన్ను శుభ్రపరుచుకోమన్నాడు. (ఆ విధంగా శుభ్ర పరచుకోవటాన్ని ‘వుదూ’ అంటారు). ఆయన వుదూ చేసి చూపించాడు.  తరువాత ఒక గదిలోకి తీసుకెళ్ళాడు నన్ను.  అక్కడ గది గోడకు వేళ్ళాడ్తూ ఉన్న పటాన్ని చూసి అధాట్టుగా అరిచాన్నేను ‘అదే – అదే, ఆ నలుచదరపు గదినే నేను కలలో చూసింది’.  ఆయన నా వైపు చిరునవ్వుతో చూసి అన్నాడు ‘అది అల్లాహ్ గృహం. ప్రపంచం నలుమూలల నుంచీ ముస్లిములు ఉమ్రా, హజ్జ్ ఆచరించటానికి అక్కడికి వస్తూ ఉంటారు. దానిని ‘బైతుల్లాహ్’ అంటారు.’ అది విని, ఆశ్చర్యంతో ‘అల్లాహ్ ఆ గదిలో ఉంటాడా?’ అని అడిగాను ఆయన నా అన్ని ప్రశ్నలకూ ఎంతో వాత్సల్యంగా, ఓర్పుగా సమాధానాలిస్తున్నాడు. బహుశా ఆయనకు ఇస్లాం గురించి చాలా తెలుసు. నేనూ ఆయనతో ఎటువంటి జంకూ లేకుండా మాట్లాడుతూ ఉన్నాను.  ఆయన నా భాషలోనే ఎన్నో విశయాలను విశదీకరిస్తున్నాడు. ఏదో అర్థంకాని అనిర్వచనీయమైన సంతోషాన్ని అనుభవిస్తున్నాన్నేను.  ఆయన నాతో ‘కలిమా’ చదివించాడు.  ఇస్లాం గురించీ, ముస్లిముల గురించీ ఎన్నో విషయాలు చెప్పాడు. నాకిపుడు ఏ ఆందోళనా లేదు, నా హృదయం పై ఎటువంటి భారమూ లేదు.   నాకిపుడు ఎంతో తేలికగా ఉంది. దుర్గంధపూరిత మురికి నీళ్ళల్లో నుంచి స్వచ్ఛమైన జలాలలోనికి ఈదుకు వచ్చినట్లుగా ఉంది నాకు.  ఆ ఇస్లామిక్ సెంటర్ యజమాని, నన్ను తన కూతురిగా చేసుకున్నాడు.  నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు.  తరువాత ఒక ముస్లిం కుటుంబంలో నా వివాహం జరిపించాడు. అవకాశం లభించగానే, మొట్టమొదట ‘బైతుల్లాహ్’ చూడాలనీ, ఉమ్రా చేయాలనీ నా కోరిక.

ప్రశ్న: ఇస్లాం స్వీకరించిన తరువాత మీరెపుడైనా ఇండియా వెళ్ళారా?

జవాబు: లేదు, నేను ఎప్పుడూ, ఇండియా వెళ్ళనూ లేదు, ఇకముందు వెళ్ళాలనే కోరిక కూడా లేదు. అక్కడ నా కుటుంబం వారికి రాజకీయాలలో, హిందూ ధార్మిక వర్గాలలో బాగా పలుకుబడి ఉంది. నన్ను చంపటానికి బహుమతిని కూడా ప్రకటించారు వాళ్ళు. ఇప్పుడు నేనొక ముస్లింను, ఒక ముస్లిమునకు కూతురిని, నాకింకేం కావాలి? నేను ముస్లింను అయినందుకు గర్వపడుతున్నాను. ఇస్లాం వెలుగులో నేను నా శేషజీవితాన్ని గడపాలనుకుంటున్నాను.

ప్రశ్న: ఇస్లాం స్వీకరించటానికి ముందు ‘ముజాహిదీన్’ల గురించి మీ ఆలోచనలు ఏవిధంగా ఉండేవి?

జవాబు: వాళ్ళు దౌర్జన్య పరులనీ, దౌర్జన్యపు అన్ని హద్దులనూ దాటిపోయిన వారనీ మాకు నూరిపోయడం జరిగేది. వాళ్ళ పేరు వింటేనే అసహ్యించుకునేలా తయారు చేసేవారు మమ్మల్ని. కానీ మీడియా తప్పుడు ప్రచారంలోని సత్యాసత్యాలు గ్రహించి తరువాత, నేను వారిని అభిమానిస్తున్నాను.  ప్రపంచ శాంతియే లక్ష్యంగా పని చేస్తున్న వారి విజయం కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా నేను అల్లాహ్ ను వేడుకుంటున్నాను ‘ఒకవేళ ఆయన నాకు కుమారులను ప్రసాదిస్తే, ‘ముజాహిదీన్’ ల  మొదటి వరుసలో వారిని నిలబెడతాను.  వారిని ఇస్లాం యొక్క ఔన్నత్యం కొరకు అంకితం చేస్తాను.  ఇన్షాఅల్లాహ్!

 

ప్రవక్త పలుకులు… సాఫల్యానికి సోపానాలు

5[1]

 ప్రవక్త పలుకులు… సాఫల్యనికి సోపానాలు

ఇతరులు మనల్ని ప్రేమించాలని, గౌరవించాలని ఎలాగైతే కోరుకుంటామో, మనం కూడా ఇతరులపట్ల అలానే మసలుకోవాలి.
 
 ఈ భూప్రపంచంలో మానవ జీవితం ఎలాంటి ఆటుపోట్లు, సమస్యలు లేకుండా సాగిపోవాలంటే కొన్ని సిద్ధాంతాలను, నియమాలను పాటించాలి. అయితే అవి స్వయంకల్పితాలు కాకుండా సృష్టికర్త అయిన అల్లాహ్, ఆయన చెప్పిన ధర్మాన్ని ఆయన తరఫున మానవాళికి బోధించిన దైవప్రవక్త ముహమ్మద్ (స) వంటివారు చెప్పినవై ఉండాలి. ఈ సందర్భంలో ముహమ్మద్ (స) ప్రవచించిన కొన్ని ధార్మిక విషయాలను తెలుసుకుందాం.
 
 1. హరాం (నిషిద్ధాలకు దూరంగా ఉండటం) 2.అల్లాహ్ మీ అదృష్టంలో రాసిన దానిపట్ల సంతృప్తితో ఉండటం 3. ఇరుగుపొరుగులతో సత్ప్రవర్తన  కలిగి ఉండటం, 4. ఇతరులు మీ పట్ల ఎలాంటి వైఖరి అవలంబించాలని మీరు కోరుకుంటారో, మీరూ ఇతరుల పట్ల అలాంటి వైఖరినే ప్రదర్శించడం. 5.సాటివారిని ఎగతాళి చేయకుండా ఉండడం, వారిని చూసి నవ్వుకోకుండా ఉండటం.
 
 దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ప్రవచించిన ఈ ధర్మాలను పాటిస్తే మన సమాజం అన్నిరకాల రుగ్మతల నుంచి బయట పడగలుగుతుంది. నిషిద్ధాలకు దూరంగా ఉంటే గొప్ప దైవభక్తి పరులవుతారన్నారు ప్రవక్త మహనీయులు. అంటే ధర్మసమ్మతం కాని ప్రతిదీ అధర్మమే, నిషిద్ధమే. సృష్టికర్తను వదిలి సృష్టిరాశుల్ని పూజించడం, తల్లిదండ్రులకు సేవచేయకుండా, వారి ఆదేశాలను ధిక్కరించడం, హింసాదౌర్జన్యాలు, రక్తపాతం, జూదం, మద్యపానం, వ్యభిచారం, అవినీతి, అక్రమాలు, అనాథల ఆస్తిని అపహరించడం, ఇతరుల మత విశ్వాసాలను దెబ్బతీయడం వంటి అనేక విషయాలన్నీ హరాం. అంటే అధర్మం, నిషిద్ధం. వీటికి దూరంగా ఉండటం నిజంగా గొప్ప ఆరాధన. అందుకే వీటికి దూరంగా ఉన్న వారు గొప్ప దైవభక్తిపరులు అన్నారు ప్రవక్త మహనీయులు.
 
 ఇక రెండవ విషయానికి వస్తే, అల్లాహ్ మన అదృష్టంలో ఎంత రాస్తే అంత తప్పక లభించి తీరుతుంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని పెంచడం కాని, తగ్గించడం కాని చెయ్యలేరు అన్న విషయాన్ని విశ్వసించి, ఉన్నదానిలోనే తృప్తిపడే వారి మనసులో ఒక విధమైన మనశ్శాంతి, ప్రశాంతత ఉంటాయి. లేనిదానికోసం వెంపర్లాట ఉండదు. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ (స) ఇలాంటి వారిని ఎవరి అవసరం లేని సంపన్నులు అన్నారు.
 
 మిగతా రెండు విషయాలను తీసుకుంటే ఇతరులు మనల్ని ప్రేమించాలని, గౌరవించాలని ఎలాగైతే కోరుకుంటామో, మనం కూడా ఇతరులపట్ల అలానే మసలుకోవాలి. ఎవరి దుర్నడత కారణంగా అతడి పొరుగువారు సురక్షిత ంగా ఉండరో, అతడు ముస్లిం కాదు అన్నారు ముహమ్మద్ ప్రవక్త ఒక ప్రవచనంలో. ఒకరి గౌరవ మర్యాదలపై, ధనప్రాణాలపై నోటి ద్వారాగాని, చేతిద్వారా గాని ఎలాంటి దాడీ చేసే హక్కు, అధికారం ఎవరికీ లేదు. అందుకని మనం మనకోసం ఎలాంటి స్థితిని కోరుకుంటామో, పరులకోసం కూడా అలాంటి స్థితినే కోరుకోవాలి. దీనికి భిన్నంగా పరుల కీడు కోరేవారు ముస్లింలు కాలేరు అని ప్రవక్త మహనీయులు స్పష్టం చేశారు.
 అలాగే అధికంగా నవ్వడం కూడా మంచిది కాదు. నవ్వు దివ్య ఔషధం ఐనప్పటికీ మితిమీరితే అనర్థమే. అల్లాహ్ నామస్మరణలో హృదయం సజీవంగా ఉంటుంది.
 
 అల్లాహ్‌ను విస్మరించి, ప్రాపంచిక వినోదంలో మునిగి తేలడం వల్ల హృదయం నిర్జీవమయ్యే ప్రమాదం ఉంది. అందుకే మితిమీరి  నవ్వడం, ఇతరులను గేలిచేయడం మంచిది కాదన్నది ప్రవక్త ప్రవచన సారం. చిరునవ్వు సదా అభిలషణీయమే. ముహమ్మద్ ప్రవక్త (స) ప్రవచించిన ఈ విషయాలను గమనంలో ఉంచుకుని ఆచరించగలిగితే సమాజం నిజంగానే శాంతి సామరస్యాలతో తులతూగుతుంది. పరలోక సాఫల్యం ప్రాప్తిస్తుంది.

అల్లాహ్ ఎవరు

allahin-benzeri-yoktur-hicbirseye-benzemez[1]

అల్లాహ్ ఎవరు

అనేక మంది ఆరాధ్యుల్లో నుంచి తమకు నచ్చిన ఒక్కరిని ఎంచుకొని జీవితాంతం ఆయనకే కట్టుబడి ఉండటం కూడా ఏకదైవారాధనే అవుతుందని కొందరు అనుకుంటారు. ఇది పెద్ద పొరపాటు. ఈ పొరపాటు జరగకుండా ఉండాలంటే ముందుగా అల్లాహ్అనే పదానికి గల అర్ధం ఏమిటో తెలుసుకోవాలి.

“అల్లాహ్అనేది అరబీ భాషా పదం. ఇది అల్ మరియు ఇలాహ్అనే రెండు పదాలు కలసి ఏర్పడింది. అల్ అనేది ఇంగ్లీషులో వాడబడే THE వంటి ఉపపదము – ఆర్టికల్. దీని అర్ధం నిర్దిష్టమైన, నిర్ణీతమైన, ప్రత్యేకమైన, ఇంతకూ ముందు ప్రస్తావించబడిన, ఏకైక మరియు వాస్తవమైన అని.

ఇప్పుడు ఈ రెండు పదాలను (అల్ + ఇలాహ్)ను కలిపితే అల్లాహ్ అనే పదం ఏర్పడింది. అదే విధంగా దాని ప్రత్యేక అర్ధం కూడా ఉనికిలోకి వచ్చింది. అనగా నిజ ఆరాధ్యుడు, ఏకైక ఆరాధ్యుడు, సాటిలేని ఆరాధ్యుడు, అసలైన ఆరాధ్యుడు, అందరికీ తెలిసిన ఆరాధ్యుడు, ఇస్లాం దృష్టిలో సర్వలోకాల సృష్టికర్త అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు అర్హుడు. మిగతా జీవరాశులు, ఇతర సృష్టిరాశులు, ఆరాధనలకు అనర్హమైనవి. ఎందుకంటే అవి కూడా తమ సృష్టికర్త ద్వారా ఉనికిలోకి వచ్చినవే. అవన్నీ అల్లాహ్ ఆజ్ఞ మేరకు తమ కాలం వెళ్ళబుచ్చుతున్నవి మాత్రమే. అంతిమ లక్ష్యం వైపు పయనిస్తున్నవి మాత్రమే.

అల్లాహ్ ముస్లింల దేవుడు మాత్రమే కాదు

అల్లాహ్ అంటే ముస్లిముల దైవం, ఇంకో పేరున మరో జాతి వారి దైవం అని జనం చెప్పుకుంటూ ఉంటారు. ఇది కూడా పొరపాటే. ఇస్లాం సర్వమానవాళిని ఒకే తల్లిదండ్రుల సంతానంగా పరిగణిస్తున్నది. వారందరి దైవం కూడా ఒక్కడే. ఆ దైవం మరియు ఆరాధ్యుని వివరణ విశ్లేషణ దివ్య ఖుర్ఆన్ లో ఇలా ఉన్నది: “మీరు చెప్పండి! ఆయన, అల్లాహ్ అద్వితీయుడు (ఒక్కడే). అల్లాహ్ నిరుపేక్షాపరుడు (ఎవరి ఆధారము, ఎవరి అక్కరా లేనివాడు, అందరూ ఆయనపై ఆధారపడేవారే) ఆయనకు సంతానము ఎవరూ లేరు మరియు ఆయన ఎవరి సంతానమూ కాదు ఆయనకు సరిసమానులెవరూ లేరు.” ఖుర్ఆన్ సూరా అల్ ఇఖ్లాస్ 112:1- 4      

విశ్వప్రభువుకు అన్ని విధాలా శోభాయమైన పదంఅల్లాహ్

తెలుగులో మనం దేవుడు అంటాం. అరబీలో అల్లాహ్ అంటారు. ఇంగ్లీషులో గాడ్ (God)  అని అంటారు. ఇలా మానవులు ఆరాధ్య దైవాన్ని ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలుస్తుండవచ్చు. కాని ఇన్ని పదాల్లోకెల్లా అల్లాహ్ అనేది ఎంతో విలక్షణమైన పదం. అరబీ భాషలోని అల్లాహ్ అనే పదం విశ్వప్రభువుకు అన్ని విధాలా శోభాయమానమైనదని చెప్పవచ్చు 

ఒక అపోహ

ముస్లిమేతరులకు ఇస్లాం గురించి ఉన్న అనేక పెద్ద అపోహల్లో అల్లాహ్అనే పదానికి సంబంధించిన అపోహ కూడా ఒకటి. ముస్లింలు, క్రైస్తవుల యూదుల దేవుణ్ణి కాకుండా వేరెవరో దేవుణ్ణి ఆరాధిస్తారని చాలా మంది అనుకుంటారు. కాని నిజానికి ఇదంతా ఓ అపోహ మాత్రమే. ఎందుకంటే అల్లాహ్ అనే పదం దేవుడు అనే పదానికి పర్యాయపదం. దేవుడు అందరికీ ఒక్కడే.

దేవుడు ఎవరు? ఆయన అస్తిత్వం ఏమిటి? అనే విషయాల్లో యూదులు – క్రైస్తవులు – ముస్లింల మధ్య భేదాభిప్రాయాలున్నాయి, ఉదాహరణకు: యూదులు క్రైస్తవుల్లో ఉన్న త్రిత్వ భావనను (Trinity)  తిరస్కరిస్తారు. ముస్లింలు కూడా త్రిత్వ భావనను (Trinity) తిరస్కరిస్తారు. అంతమాత్రం చేత ఆ మూడు మతాలకు ముగ్గురు వేర్వేరు దేవుళ్ళు ఉన్నారని అర్ధం కాదు. ఎందుకంటే – విశ్వమంతటికి నిజదేవుడు ఒక్కడే. ఇస్లాం చెప్పేది ఏమిటంటే – ఇతర మతాల వాళ్ళు కూడా అల్లాహ్ నే విశ్వసిస్తున్నారు. కాని అల్లాహ్ ను ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించటం లేదు. దేవుడు ఫలానా విధంగా ఉంటాడని స్వయంగా కల్పనలు చేసుకొని విశ్వసిస్తున్నారు.

 

పరదా (ముసుగు)

Hijab-001[1]

అరబీ పదం హిజాబ్అంటే పరదా, ముసుగు వగైరా. ఇది అల్లాహ్ విధేయతకు సూచన. ఇది స్వచ్చత, వినయము, రుజుమార్గం, విశ్వాసానికి నిదర్శనం.

పరిచయం

ఖుర్ఆన్ లో పరదా పురుషులు మరియు స్త్రీలకు అనివార్యం చేయబడింది. ఇస్లాంలో ఇది ముందుగా పురుషులకు, ఆ తర్వాత స్త్రీలకు వర్తిస్తుంది. ఖుర్ఆన్ మరియు హదీసులలో (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం విధానం) సూచించిన విధంగా కేవలం ఒక్క అల్లాహ్ నే ప్రార్దిoచడం తన కర్తవ్యo మరియు అల్లాహ్ యే తాను సృష్టించబడటానికి కారణం అని ప్రతి ముస్లిం భావిస్తాడు. పరదా కూడా అల్లాహ్ కు విధేయత చూపే ఓ మార్గం.

“(చూడండి) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ వ్యవహారంలోనైనా ఒక నిర్ణయం చేసిన తరువాత విశ్వాసులైన ఏ పురుషునికిగానీ, స్త్రీకిగానీ తమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే అతను స్పష్టమైన అపమార్గానికి లోనైనట్లే (జాగ్రత్త). ఖుర్ఆన్ సూరా అహజాబ్ 33:36   

ఖుర్ఆన్ మహిళలకు పరదా ఎందుకు విధించిందంటే దాని వల్ల వారు గౌరవం గల స్త్రీలు అని తెలుస్తుంది మరియు స్త్రీల మానమర్యాదలకు హాని కలిగే అవకాశం ఉండదు. వినయం విశ్వాసానికి చిహ్నం. వినయం, విధేయత, పరదా లేని వారు ధర్మానికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు. పరదా స్త్రీని కించపరచదు, సరికదా ఆమె మానమర్యాదలను కాపాడుతుంది. పరదా వల్ల స్త్రీలపై గౌరవం పెరుగుతుంది మరియు సమాజంలో శాంతి నెలకొంటుంది. 

పురుషుల పరదా

పురుషుల పరదా

ఖుర్ఆన్ లో అల్లాహ్ సెలవిస్తున్నాడు: (ఓ ప్రవక్తా!) ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలనీ, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు. ఖుర్ఆన్ సూరా నూర్ 24:30

స్త్రీల పరదా

 (ఓ ప్రవక్త ! ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలనీ, బహిర్గితమై ఉండేది తప్ప తమ అలంకరణను బహిర్గతం చేయరాదనీ, తమ వక్షస్థలాలపై ఓణిలు వేసుకోవాలనీ, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కాచెల్లెళ్ళ కొడుకులు లేక తమతో కలసి మెలసి ఉండే స్త్రీలు, లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని బాలురు వీళ్ళ ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను (అందచందాలను) కనబడనివ్వకూడదనీ, దాగి ఉన్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు. ముస్లింలారా ! మీరంతా కలసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.ఖుర్ఆన్ సూరా నూర్ 24:31  

ఓ ప్రవక్తా ! తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి, వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. సూరా అహజాబ్ 33:59   

Shirk – అష్షిర్క్ – దైవత్వంలో భాగస్వాములను చేర్చటం

 

1. అష్షిర్క్ – దైవత్వంలో భాగస్వాములను చేర్చటం – الشرك

నిర్వచనం:

అల్లాహ్ యొక్క దైవత్వం (తౌహీద్ రుబూబియత్) లో మరియు అల్లాహ్ యొక్క ఏకత్వపు ఆరాధనల (తౌహీద్ ఉలూహియత్) లో ఇంకెవరినైనా చేర్చటం, అంటే ఇతరులను అల్లాహ్ యొక్క భాగస్వాములుగా చేయటం. తౌహీద్ ఉలూహియత్ (అంటే దైవారాధనలలో అల్లాహ్ యొక్క ఏకత్వానికి వ్యతిరేకంగా, ఇతరులను భాగస్వాములుగా చేర్చటం – ఇంకో మాటలో బహుదైవారాధన చేయటం)లో బహుదైవారాధన ఎక్కువగా జరుగుతుంది. అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా వేడుకోవటం, ప్రార్థించటం అనేది దీనిలోని ఒక విధానం. కేవలం అల్లాహ్ కే చెందిన ఏకదైవారాధనా పద్ధతులలో కొన్నింటిని ఇతరులకు ప్రత్యేకం చేయటం దీనిలోని మరొక విధానం. ఉదాహరణకు – బలి ఇవ్వటం, ప్రమాణం చేయటం, దిష్టి తీయటం, భయపడటం, ఆశించటం, భక్తి చూపటం (ప్రేమించటం) మొదలైనవి. క్రింద తెలుపబడిన కొన్ని ప్రత్యేక ఆధారాల మరియు మూలకారణాల వలన అష్షిర్క్ (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో భాగస్వామ్యం కల్పించటం) అనేది,  పాపాలన్నింటిలోను అత్యంత ఘోరమైన పాపంగా గుర్తింప బడినది

1-   పోలిక: షిర్క్ అనేది దివ్యగుణాలలో సృష్టికర్తను తన సృష్టితాలతో పోలిక కల్పిస్తున్నది. ఎవరైనా అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా ఆరాధిస్తున్నట్లయితే, వారు అల్లాహ్ కు భాగస్వాములను చేర్చినట్లు అగును. ఇది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని). దివ్యఖుర్ఆన్ లోని లుఖ్మాన్ అధ్యాయం 13వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

(لقمان 13) “إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ” – భావం యొక్క అనువాదం – {ఖచ్ఛితంగా, అష్షిర్క్ (బహుదైవారాధన) అనేది అత్యంత ఘోరమైన పాపిష్టి పని}. దౌర్జన్యం (పాపిష్టి పని) అంటే ఒకదానికి చెందిన స్థానంలో వేరేది ఉంచటం. అంటే దేనికైనా చెందిన స్థానంలో దానిని కాకుండా వేరే దానిని ఉంచటం. కాబట్టి ఎవరైనా కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ఆరాధనలలో ఇతరులను కూడా చేర్చటమనేది, వారు తమ ఆరాధనలను తప్పుడు స్థానం లో ఉంచటమన్న మాట. ఇంకో మాటలో – అనర్హులైన వాటికి తమ ఈ ఉన్నతమైన బాధ్యతను (ఆరాధనను) సమర్పించటం. కాబట్టి, కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ‘ఆరాధన’ అనే దివ్యమైన హక్కును, దాని స్థానం నుండి తప్పించి, వేరే స్థానంలో ఉంచటం అంటే అనర్హులైన, అయోగ్యులైన వేరే వాటికి సమర్పించటం అనేది అత్యంత ఘోరమైన మహాపాపంగా సృష్టకర్త ప్రకటించినాడు.

2-    క్షమింపబడని ఘోరాతి ఘోరమైన మహాపాపం: ఎవరైతే ఈ ఘోరమైన మహాపాపం నుండి పశ్చాత్తాపం చెందకుండా, క్షమాభిక్ష వేడుకోకుండా చనిపోతారో, అటువంటి వారిని అల్లాహ్ (ఎట్టి పరిస్థితులలోను క్షమించనని) ప్రకటించెను. ఖుర్ఆన్ లోని అన్నీసా (స్త్రీలు) అనే అధ్యాయంలోని 48వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

(النساء 48) – “إِنَّ اللَّهَ لا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ”

భావం యొక్క అనువాదం – {తనకు భాగస్వాములను కల్పించటాన్ని (షిర్క్) అల్లాహ్ క్షమించడు; కాని ఇది (షిర్క్) కాక  ఇతర పాపలన్నింటినీ ఆయన క్షమించవచ్చును}

3-    స్వర్గం నిషేధించబడినది:  ఎవరైతే తన ఆరాధనలలో ఇతరులకు భాగస్వామ్యం కల్పిస్తారో (బహుదైవారాధన) చేస్తారో అటువంటి వారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. మరియు వారిని అల్లాహ్ శాశ్వతంగా నరకంలోనే ఉంచును. దివ్యఖుర్ఆన్ లోని అల్ మాయిదహ్ (వడ్డించిన విస్తరి) అనే అధ్యాయంలోని 72వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

”إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ “ (المائدة 72)

భావం యొక్క అనువాదం– {తనతో పాటు ఇతరులను ఆరాధిస్తున్న వారి పై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను మరియు నరకంలోనే వారు శాశ్వతంగా ఉండబోతున్నారు. అటువంటి పాపిష్టులకు సహాయపడే వారెవ్వరూ ఉండరు}.

4-   పుణ్యకార్యాలన్నీవ్యర్థమవుతాయి: షిర్క్ (బహుదైవారాధన) కారణంగా చేసిన పుణ్యకార్యాలన్నీ నిష్ప్రయోజనమవుతాయి, వ్యర్థమవుతాయి, ఉపయోగపడకుండా పోతాయి. దివ్యఖుర్ఆన్ లోని అల్ అన్ ఆమ్ అధ్యాయంలోని 88వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

” ذَلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ مَا كَانُوا يَعْمَلُونَ- “ (الأنعام 88)

భావం యొక్క అనువాదం – {ఇది అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వం: ఎవరి ఆరాధనలైతే తనను మెప్పిస్తాయో, వారికి అల్లాహ్ దీనిని ప్రసాదిస్తాడు. ఒకవేళ వారు గనుక ఇతరులను అల్లాహ్ ఏకదైవత్వంలో భాగస్వాములుగా చేర్చితే, వారి చేసిన (కూడగట్టిన) పుణ్యకార్యాలన్నీ వ్యర్థమైపోతాయి}.

ఇంకా దివ్యఖుర్ఆన్ లోని అజ్జుమర్ అధ్యాయంలోని 70వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

(الزمر70) –  “وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنْ الْخَاسِرِينَ”

భావం యొక్క అర్థం – {కాని, ఏవిధంగా నైతే పూర్వికుల ముందు అవతరించినదో, అదే విధంగా మీ దగ్గర కూడా ఇది అవతరింపబడి ఉన్నది. ఒకవేళ మీరు ఎవరినైనా (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో) చేర్చితే, నిశ్చయంగా మీ యొక్క (జీవితపు) ఆచరణలు నిష్ప్రయోజనమైపోతాయి మరియు మీరు తప్పక (అధ్యాత్మికంగా) నష్టపోయిన వారి పంక్తులలో చేర్చబడతారు}

5-  ప్రాణ సంపదలకు రక్షణ ఉండదు: ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతారో, వారి యొక్క రక్తం (జీవితం) మరియు సంపద నిషిద్ధం కాదు. దివ్యఖుర్ఆన్ లోని అత్తౌబా అధ్యాయం లోని 5వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.

(التوبة 5)-  “فَاقْتُلُوا الْمُشْرِكِينَ حَيْثُ وَجَدْتُمُوهُمْ وَخُذُوهُمْ وَاحْصُرُوهُمْ وَاقْعُدُوا لَهُمْ كُلَّ مَرْصَدٍ”

భావం యొక్క అనువాదం – {యుద్ధరంగంలో మీకు ఎదురైన ప్రతి బహుదైవారాధకుడితో (ఏకైక ఆరాధ్యుడైన సర్వలోక సృష్టికర్త యొక్క దైవత్వంలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతున్న వారితో) యుద్ధం చేయండి మరియు వారిని హతమార్చండి మరియు వారిని బంధించండి మరియు చుట్టుముట్టండి మరియు వారి ప్రతి యుద్ధతంత్రంలో, యుక్తిలో ఘోరవైఫల్యం నిరీక్షిస్తున్నది.}

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ఉపదేశించారు

“أمرت أن أقاتل الناس حتى يقولوا لا إله إلا الله و يُقيموا الصلاة و يُؤتوا الزكاة” –

అనువాదం – “లా ఇలాహ్ ఇల్లల్లాహ్ (కేవలం ఒక్క అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు) మరియు ముహమ్మదుర్రసూలుల్లాహ్ (ముహమ్మద్ ^ అల్లాహ్ యొక్క సందేశహరుడు) అని సాక్ష్యమిచ్చి, నమాజు స్థాపించి, విధిదానం (జకాత్) ఇచ్చే వరకు ప్రజలతో పోరు జరపమని (అల్లాహ్ నుండి) నాకు ఆజ్ఞ ఇవ్వబడినది. కాబట్టి వారు పైవిధంగా ఆచరిస్తే, వారి రక్తం మరియు సంపదకు ఇస్లామీయ ధర్మశాస్త్ర ఆదేశాల సందర్భంలో తప్ప,  నా తరపున గ్యారంటీగా రక్షణ లభిస్తుంది.

6-      ఘోరాతి ఘోరమైన మహాపాపం: షిర్క్ (బహుదైవారాధన, అల్లాహ్ యొక్క ఏకైక దైవత్వంలో ఇతరులను చేర్చటం) అనేది మహా పాపములలో ఘోరాతి ఘోరమైనది.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా సంబోధించారు –  “ألا أنبئكم بأكبر الكبائر” – అనువాదం – “ఘోరాతి ఘోరమైన మహాపాపం గురించి మీకు తెలియజేయ మంటారా?” మేము (సహచరులం) ఇలా సమాధానమిచ్చాం, “అవును,  ఓ అల్లాహ్ యొక్క సందేశహరుడా r”, వారు ఇలా పలికారు, “الإشراك بالله وعقوق الوالدين” – అనువాదం – “అల్లాహ్ తో ఇతరులెవరినైనా జతపర్చటం, తల్లిదండ్రులకు అవిధేయత చూపటం

కాబట్టి షిర్క్ (బహుదైవారాధన) అనేది అత్యంత ఘోరాతి ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని) మరియు తౌహీద్ (ఏకదైవత్వం) అత్యంత స్వచ్ఛమైనది, న్యాయమైనది. మరియు ఏదైనా సరే అల్లాహ్ యొక్క ఏకదైవత్వాన్ని ఖండిస్తున్నట్లయితే, తిరస్కరిస్తున్నట్లయితే, నిరాకరిస్తున్నట్లయితే, వ్యతిరేకిస్తున్నట్లయితే అది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (అన్యాయం) అవుతుంది. ఇంకా తన ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చే వారిపై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. వారి జీవితం, సంపద, భార్య మొదలైనవి కేవలం తననే ఆరాధిస్తున్న ఏకదైవారాధకుల రక్షణ పరిధి లోనికి రావని అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. ఇంకా తర్వాతి వారు మొదటి వారిని వారి బహుదైవారాధన కారణంగా ఖైదీ (దాసులుగా) చేయటానికి అనుమతి ఇవ్వబడుతున్నది. ఇంకా బహుదైవారాధకుల ఏ చిన్న మంచి పనినైనా సరే ఆమోదించటాన్ని లేదా ఎవరిదైనా సిఫారసు స్వీకరించటాన్ని లేదా పునరుత్థాన దినమున వారి పిలుపును అందుకోవటాన్ని అల్లాహ్ తిరస్కరించెను. ఎందుకంటే కేవలం అజ్ఞానం వలన, అల్లాహ్ కు భాగస్వామ్యం జతపర్చిన బహుదైవారాధకుడు అందరి కంటే ఎక్కువగా అవివేకుడు, మూఢుడు. అ విధంగా అతడు అల్లాహ్ పై దౌర్జన్యం (అన్యాయం) చెయ్యటమే కాకుండా స్వయంగా తనకు వ్యతిరేకంగా తానే దౌర్జన్యం (అన్యాయం) చేసుకుంటున్నాడు.

7-   ఒకలోపం మరియు తప్పిదం: షిర్క్ (బహుదైవారాధన)  అనేది ఒక లోటు, ఒక లోపం, ఒక దోషం, ఒక కళంకం, ఒక లొలుగు మరియు ఒక తప్పిదం – అల్లాహ్ యొక్క అత్యుత్తమమైన స్వభావం దీని (షిర్క్ భావనల) కంటే ఎంతో మహాన్నతమైనది. కాబట్టి, ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతున్నారో, అలాంటి వారు కేవలం అల్లాహ్ కే చెందిన ప్రత్యేక ‘మహోన్నత స్థానాన్ని’ తాము ఖండిస్తున్నామని మరియు వ్యతిరేకిస్తున్నామని స్వయంగా అంగీకరిస్తున్నట్లవు తున్నది.

షిర్క్ (బహుదైవారాధన) లోని భాగాలు:

షిర్క్ (బహుదైవారాధన) రెండు విభాగాలుగా విభజింపబడినది.

మొదటి విభాగం: అష్షిర్క్ అల్ అక్బర్ (ఘోరమైన భాగస్వామ్యం) – ఇది ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింపజేస్తుంది మరియు ఒకవేళ పశ్చాత్తాప పడి, క్షమాభిక్ష అర్థించకుండానే చనిపోయినట్లయితే, వారిని నరకాగ్నిలో శాశ్వతంగా శిక్షింపబడుతూ ఉండేటట్లు చేస్తుంది. దైవశక్తులనే మూఢనమ్మకంతో ఇతరులను దర్శించి, వాటికి బలి సమర్పించుకుని తద్వారా తమ కోరికలు పూర్తిచేయమని, కష్టాలు తీర్చమని వేడుకోవటం, సమాధులకు, జిన్నాతులకు, దుష్టశక్తులకు మొక్కు బడులు చెల్లించడం వంటి తెలిసిన ఏ ఆరాధననైనా సర్వలోక సృష్టికర్త, సర్వశక్తిసమర్ధుడు అయిన అల్లాహ్ కు కాకుండా వేరే ఇతర వాటికి సమర్పించటం లేదా అల్లాహ్ తో పాటు వేరే ఇతర వాటికి కూడా సమర్పించటం. ఇంకా తమకు హాని చేయవద్దని చనిపోయిన వారిని, జిన్నాతులను, దుష్టశక్తులను, దయ్యాలను వేడుకోవటం మరియు కేవలం అల్లాహ్ మాత్రమే ప్రసాదించగలిగే శుభాలను అవి కూడా కలిగించ గలవని ఆశించి వాటిపై నమ్మకం పెట్టుకోవటం. దౌర్భాగ్యం కారణంగా ఈ రోజుల్లో దివ్యపురుషుల మరియు పుణ్యపురుషుల సమాధులపై గోపురాలు కట్టడం పెరిగి పోతున్నది. ఖుర్ఆన్ లో యూనుస్ అధ్యాయంలోని 18వ వచనంలో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు –

سورة يونس : 18 “وَيَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ مَا لا يَضُرُّهُمْ وَلا يَنْفَعُهُمْ وَيَقُولُونَ هَؤُلاءِ شُفَعَاؤُنَا عِنْدَ اللَّهِ”

భావం యొక్క అనువాదం – {అల్లాహ్ తో పాటు వారు ఎటువంటి హాని కలిగించలేని మరియు ఎటువంటి శుభాలు కలిగించలేని ఇతరులను ఆరాధిస్తున్నారు. మరియు వారు ఇలా పలుకుతున్నారు: “ఇవి మా గురించి అల్లాహ్ దగ్గర సిఫారసు చేస్తాయి}

రెండవ విభాగం: అష్షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన), ఇది ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింపజేయదు, కాని నిశ్చయంగా ఏకైక దైవారాధనకు తప్పక నశింప జేస్తుంది  మరియు ఇది తప్పక ఘోరమైన భాగస్వామ్యానికి (అష్షిర్క్ అల్ అక్బర్) చేర వేస్తుంది. ఇది రెండు రకాలుగా విభజింపబడినది.

మొదటి రకం: شرك ظاهر బయటికి కనబడే షిర్క్, మరియు ఇది మాటల ద్వారా మరియు చేతల ద్వారా జరుగుతుంది.

మాటలలో బయటికి కనబడే షిర్క్ అంటే అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయటం ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు “من حلف بغير الله”- అనువాదం – “ఎవరైతే అల్లాహ్ పై కాకుండా ఇతరుల పై ప్రమాణం చేస్తారో, వారు అవిశ్వాసపు పని (లేదా అల్లాహ్ యొక్క ఏకత్వంలో భాగస్వామ్యాన్ని చేర్చిన పని) చేసిన దోషిగా శిక్షకు అర్హులవుతారు.” మరొకసారి ఒక సహచరుడు – అల్లాహ్ మరియు మీరు ఏది తలిస్తే (అది జరుగుతుంది) అని వారితో పలికినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఇలా స్పందించారు, “أجعلتني لله نداّ” – అనువాదం – “నన్ను అల్లాహ్ కు సాటిగా చేస్తున్నారా? (అలా పలకే బదులు) కాని ‘కేవలం అల్లాహ్ ఏదైతే తలుస్తాడో (అది జరుగుతుంది)’ అని పలక వలెను.” అలాగే ‘అల్లాహ్ కోసం మరియు ఫలానా ఫలానా వారికోసం’ అని పలికే బదులు, ఎవరైనా ఇలా పలకవలెను ‘‘ఏదైతే అల్లాహ్ తలుస్తాడో, ఆ తర్వాత ఫలానా ఫలానా వారు తలుస్తారో’ అని పలక వలెను. ఎందుకంటే ‘అల్లాహ్ తర్వాత ఫలానా ఫలానా’ అని పలకటంలో ‘తర్వాత’ అనే వదం పరంపర క్రమాన్ని తగ్గిస్తున్నది. కాబట్టి, దాసుడి ఇష్టాని కంటే ముందు అల్లాహ్ యొక్క ఇష్టం వస్తున్నది. దివ్యఖుర్ఆన్ లోని అత్తక్వీర్ అధ్యాయంలోని 29వ వచనంలో అల్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు  “وَمَا تَشَاءُونَ إِلا أَنْ يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ” (التكوير 29) – భావం యొక్క అనువాదం – {కాని మీరు ఇష్టపడలేరు, కాని సర్వలోకాల పరిపాలకుడైన ఒక్క అల్లాహ్ తప్ప}. ఇక ‘మరియు’ అనే పదం, తెలిపిన వైఖరి ప్రకారం ఇది జతపర్చటాన్ని మరియు పంచుకోవటాన్ని సూచిస్తుంది. ఉదాహరణగా “ నాకు సహాయపడే వారిలో అల్లాహ్ మరియు మీరు” అనేది మరియు “ఇది అల్లాహ్ యొక్క మరియు మీ యొక్క దీవెనల వలన” .

చేతలలో బయటికి కనబడే షిర్క్ – అంటే ఆపదలను, కష్టాలను తొలగిస్తుందని మరియు వాటి నుండి రక్షిస్తుందని, రింగు తొడగటం లేదా త్రాడు లేక దారం కట్టుకోవటం. ఏదేమైనప్పటికీ, ఈర్ష్యాసూయాల నుండి, దిష్టి తగలటం నుండి కాపాడుకోవటం కోసం రక్షాబంధనలు, తాయెత్తులు, తావీజుల వంటివి కట్టుకోవలెనని అల్లాహ్ యొక్క ఇస్లామీయ ధర్మ శాస్త్రం (షరియత్) లో ఎక్కడా ప్రకటింప బడలేదు. కాబట్టి ఎవరైనా ఇటువంటి మంత్రతంత్రములను సహాయపడతాయని విశ్వసిస్తూ, వాటిని ఉపయోగిస్తున్నట్లయితే షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన భాగస్వామ్యం) చేస్తున్న వారవుతారు. కాని ఒకవేళ ఎవరైనా ఆ తాయెత్తుల వంటివి స్వయంగా తమకు లాభం చేకూర్చుతాయని నమ్మితే, వారు షిర్క్ అల్ అక్బర్ (ఘోరమైన మహాపాపం) చేస్తున్న వారవుతారు. ఎందుకంటే వారు అల్లాహ్ పై కాకుండా ఇతర వాటిపై ఆధారపడుతున్నారు.

రెండవరకం: شرك خفي బయటికి కనబడని, రహస్యమైన షిర్క్ మరియు ఇది తలంపుల, సంకల్పం, కోరికల, ఇష్టాయిష్టాల ద్వారా ఇతరులకు చూపాలనే ఉద్ధేశంతో జరుగుతుంది. ఎవరికైనా చూపించాలనే సంకల్పంతో, వారు తనను పొగడాలనే కోరికతో ప్రార్థనలు చేయటం. ఉదాహరణకు ప్రజలు తనను పొగడాలనే ఉద్ధేశంతో ప్రార్థనలు చేస్తూ, ఇతరులకు దానధర్మాలు చేయటం, ఇంకా తన కంఠస్వరాన్ని ప్రజలు పొగడాలని మంచి ఖిరాత్ తో ఖుర్ఆన్ పారాయణం చేయటం. ఈ సంకల్పం తప్పక వారి ఆరాధనలను నిర్వీర్యం చేస్తుంది. దివ్యఖుర్ఆన్ లోని అల్ కహాఫ్ అనే అధ్యాయంలోని 110వ వచనంలో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు.

(الكهف 110) – “فَمَنْ كَانَ يَرْجُوا لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلا صَالِحًا وَلا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا”

భావం యొక్క అనువాదం – {తన ప్రభువు ను కలవబోతున్నామని ఎవరైతే భావిస్తున్నారో, వారు పుణ్యకార్యాలు చేయవలెను మరియు అల్లాహ్ కు భాగస్వామిగా ఎవరినీ అంగీకరించకూడదు}.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు,

“ أخوف ما أخاف عليكم الشرك الأصغر ”

“నేను మీ గురించి ఎక్కువగా భయపడేది ఏమిటంటే అష్షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన)” అప్పుడు సహచరులు ఇలా ప్రశ్నించారు. ‘అష్షిర్క్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన) అంటే ఏమిటి, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా r?’, వారిలా జవాబిచ్చారు -“అర్రియా الرياء (show off పనులు)”. ఉదాహరణకు ప్రపంచంలో కొన్ని లాభాలు పొందటానకి ప్రార్థనలు చేయటం. అలాంటి సంకల్పంలో కొందరు వ్యక్తులు హజ్ యాత్ర చేస్తారు, అజాన్ (నమాజు కోసం పిలిచే పిలుపు) ఇస్తారు, నమాజులో ప్రజలకు నాయకత్వం వహించి, బదులుగా పైసలు తీసుకుంటారు, ఇస్లామీయ ధర్మ విద్యను అభ్యసిస్తారు, ఇంకా ధనం కోసం ధర్మయుద్ధం (జిహాద్) లో పాల్గొంటారు. వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు “تعس عبد الدينار” – అనువాదం – “దీనార్ దాసుడు, దిర్హమ్ దాసుడు, ఖమీలా (మందమైన మెత్తని ఉన్నతమైన వస్త్రం) దాసుడు మరియు ఖమీసా (మంచి దుస్తుల) దాసుడు నశించిపోవుగాక, ఎందుకంటే వాటితో అతడు సంతృప్తి పడినాడు అవి దొరకకపోతే అతడు సంతోషం చెందడు (అసంతృప్తి చెందతాడు)”

ఇబ్నె ఖయ్యుం అనే ప్రముఖ ఇస్లామీయ పండితుడు ఇలా తెలిపెను, ‘సంకల్పంలో మరియు భావాలలో బహుదైవారాధన అంటే ‘అది తీరాలు లేని ఒక సముద్రం లాంటిది, చాలా తక్కువ మంది అందులో నుండి బతికి బయట పడినారు’. కాబట్టి, ఎవరైనా సరే, ఏదైనా పనిని అల్లాహ్ ను కాకుండా వేరే ఇతరులను సంతృప్తి పరచటానికి చేసినా మరియు అల్లాహ్ వైపుకు  కాకుండా వేరే ఇతరుల దరి చేరి, వేడుకున్నా, వారు తమ సంక్పంలో మరియు ఆలోచనలలో షిర్క్ (అల్లాహ్ యొక్క ఏకత్వంలో భాగస్వామ్యం కల్పించటం) చేసిన వారవుతారు.   దానికి విరుద్ధంగా, దైవ విశ్వాసం అంటే తమ మాటలలో, చేతలలో మరియు సంకల్పంలో, భావాలలో అల్లాహ్ కు విశ్వసనీయుడిగా జీవించటం అన్నమాట. ఇదియే తన దాసుల నందరినీ ఆచరించమని అల్లాహ్ ఆదేశించిన ఇబ్రహీం అలైహిస్సలాం యొక్క హనీఫా ధర్మం (బహుదైవారాధన నుండి ఏక దైవరాధన వైపునకు మరలటం). ఈ ధర్మం కాకుండా వేరే ఇతర ఏ ధర్మాన్నీ అల్లాహ్ తీర్పుదినం నాడు స్వీకరించడు. హనీఫా ధర్మాన్ని ఉన్నది ఉన్నట్లుగా తిరిగి బోధించటమే ఇస్లాం ధర్మంలోని సుగుణం.   దివ్యఖుర్ఆన్ లోని ఆలె ఇమ్రాన్ అధ్యాయంలోని 85వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

سورة آل عمران : 85 “وَمَنْ يَبْتَغِ غَيْرَ الإسْلامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنْ الْخَاسِرِينَ” –

దివ్యవచనపు భావం యొక్క అనువాదం – {ఎవరైనా ఇస్లాం ధర్మాన్ని కాకుండా వేరే ఇతర ధర్మాన్ని అనుసరించాలని కోరుకుంటే, అది ఎన్నటికీ స్వీకరించబడదు. మరియు పరలోకంలో వారు నష్టపోయిన వారి (పుణ్యాలన్నీ కోల్పోయిన వారి) శ్రేణులలో ఉంటారు}. వాస్తవానికి ఇదే ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క సురక్షిత విశ్వాసం, దీనిని తిరస్కరించిన వారందరూ అజ్ఞానంలో అట్టడుగు స్థాయికి చేరుకున్నవారే.”

అష్షిర్క్ అల్ అక్బర్ (అత్యంత ఘోరాతి ఘోరమైన బహుదైవారాధన) మరియు అష్షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన) ల మధ్య ఉన్న కొన్ని ప్రధాన విభేదాలను ఇక్కడ పున:పరిశీద్దాం:

1-   అష్షిర్క్ అల్ అక్బర్ ప్రజలను ఇస్లాం నుండి బహిష్కరింప జేస్తుంది. కాని అష్షిర్క్ అల్ అస్గర్ ప్రజలను ఇస్లాం నుండి బహిష్కరింప జేయదు.

2-     అష్షిర్క్ అల్ అక్బర్ ప్రజలను నరకాగ్నిలో శాశ్వత నివాసం ఏర్పరుస్తుంది. కాని అష్షిర్క్ అల్ అస్గర్ ప్రజలను నరకాగ్ని లో శాస్వత నివాసం ఏర్పరచదు. కొంతకాలం శిక్షను అనుభవించిన తర్వాత అలాంటి వారిని నరకాగ్నిలో నుండి బయటకు తీయటం జరుగును.

3-     అష్షిర్క్ అల్ అక్బర్ వలన చేసిన పుణ్యకార్యాలన్నీ ఎందుకూ పనికి రాకుండా పోతాయి. ప్రపంచ జీవితంలో చేసిన మంచి పనులు, పుణ్యకార్యాలు పరలోకంలో నిష్ప్రయోజనమైపోతాయి.  అష్షిర్క్ అల్ అస్గర్ వలన అలా జరుగదు. అయితే లభించే పుణ్యాలు తగ్గుతాయి.

అష్షిర్క్ అల్ అక్బర్ వలన ప్రాణం మరియు సంపద సంరక్షణలో ఉండవు. కాని అష్షిర్క్ అల్ అస్గర్ వలన సంరక్షణలో ఉంటాయి.

अल्लाह का चैलेंज है कि कुरआन में कोई रद्दोबदल नहीं कर सकता।

 

 

 

कुरआन में इस बात का एलान है कि इसका कोई अंश नष्ट न हो सकेगा, कभी इसके शब्द आगे-पीछे न हो सकेंगे।
अनुवादः
”निस्सन्देह यह जिक्र अर्थात कुरआन हमीं ने उतारा है और हम निश्चय ही इसे सुरक्षित रखेंगे।’ – सुरः हिज्र 9
As for the Admonition, indeed it is We Who have revealed it and it is indeed We Who are its guardians. ( Quran: 15:9) 
بےشک یہ (کتاب) نصیحت ہمیں نے اُتاری ہے اور ہم ہی اس کے نگہبان ہیں (٩) 
‘यकीनन यह एक किताबे अज़ीज़ है। बातिल (असत्य) न इसके आगे से इसमें राह पा सकता है, न इसके पीछे से।” – सूरः हाममीम सज्दा

‘किताबे अज़ीज़’ होने का अर्थ यह हुआ कि इसके वजूद को कभी होई हानि नहीं हो सकती, इस के सम्मान को कोई आघात नहीं पहुंचा सकता और इसका रूप और इस की हैसियत किसी भी परिवर्तन की पहुँच से परे है।
दुनिया कि हर किताब अपने मूल रूप में नहीं है सभी में इतने परिवर्तन हो चुके हैं कि कब क्या था यह जानना भी मुश्किल होगया। एकतरफ कुरआन है कि खुदा चैलेंज करता है कि इसमें कोई रद्दोबदल नहीं कर सकता। सारी दुनिया मिल जाये हल्का सा फर्क अर्थात विभिन्नता करके दिखादे।
चोदह सौ से अधिक वर्षां से इस्लाम दुश्मन सब तरह की कोशिश करके देख चुके, नाकाम रहे। आज भी ज्यूँ का त्यूँ है। जैसाकि मुहम्मद स. को लगभग 23 साल में याद कराया गया था।

कुरआन के बारे में खुली दावत है छानबीन करें।

 

‘क्या वे क़ुरआन में सोच-विचार नहीं करते? यदि यह अल्लाह के अतिरिक्त किसी और की ओर से होता, तो निश्चय ही वे इसमें बहुत-सी बेमेल बातें पाते।‘ -सूरःनिसा  (कुरआन 4:82 )

 

 लगभग सभी भाषाओं में कुरआन का अनुवाद मिल जाता है। सबको चाहिए कि इसके औचित्य को जांचने और सच्चाई मालूम करने की कोशिश करे। बुद्धि‍जीवी किसी ऐसी चीज को नज़रन्दाज़ नहीं कर सकता, जो उसके शाश्वत राहत का सामान होने की सम्भावना रखती हो और छान-बीन के बाद शत-प्रतिशत विश्वास में निश्चित रूप से बदल सकती हो।

सोचिये क्या ऐसी वैज्ञानिक व बौधिक दलीलें किसी पुस्तक में मिलती हैं? जैसी कुरआन में हैं। नहीं मिलती तो मान लिजिये कि कुरआन ही निश्चित रूप से खुदाई कलाम अर्थात ईशवाणी है।

 

 

అల్లాహ్ ఎవరు? (Who is Allah?)

 

అల్లాహ్ భూమ్యాకాశాలకు  మరియు సర్వానికి సృష్టి కర్త. మీ సృష్టి కర్త ను గురించి తెలుసుకొని ,ఎందుకు ఆతని ఆజ్ఞకు లోబడి ఇస్లాం స్వీకరించాలో తెలుసుకొనండి.

 

“దైవం గురుంచి మానవ జాతి యెక్క తప్పుడు నమ్మకాలను,సిద్దాంతాలను సరిదిద్దడమే ఇస్లాం యెక్క ప్రధాన కర్తవ్యమని స్పష్టంగా అర్ధం చేసుకోండి”

విశ్వప్రభువుకు అన్నివిధాలా శోభాయమానమైన పదం ‘అల్లాహ్’ :

“అల్లాహ్” అనేది అరబీ భాషాపదం. ఇది “అల్” మరియు “ఇలాహ్” అనే రెండు పదాలు కలిసి ఏర్పడింది. అల్ అనేది ఇంగ్లీషులో వాడబడే THE వంటి ఉపపడం – ఆర్టికల్. దీని అర్ధం నిర్దిష్టమైన,నిర్ణీతమైన, ప్రత్యేకమైన, ఇంతకూ ముందు ప్రస్తావించబడిన, ఏకైక మరియు వాస్తవమైన అని.

అల్ (The) + ఇలాహ్ (God) = అల్లాహ్ (The God)

ఇప్పుడు ఈ రెండు పదాలను (అల్+ఇలాహ్)ను కలిపితే “అల్లాహ్” అనే పడం ఏర్పడింది.అదే విధంగా దాని ప్రత్యేక అర్ధం కూడ ఉనికిలోకి వచ్చింది. అనగా నిజ ఆరాధ్యుడు, ఏకైక ఆరాధ్యుడు, సాటిలేని ఆరాధ్యుడు, అసలైన ఆరాధ్యుడు, అందరికి తెలిసిన ఆరాధ్యుడు. ఇస్లాం దృష్టిలో సర్వ లోకాల సృష్టికర్త మాత్రమే ఆరాధనలకు అర్హుడు. మిగతా జీవరాశులు, ఇతర సృష్టి రాశులు ఆరాధనలకు అనర్హమైనవి. ఎందుకంటే అవి కూడా తమ సృష్టికర్త ద్వారా ఉనికిలోకి వచ్చినవే. అవన్నీ అల్లాహ్ ఆజ్ఞ మేరకు తమ కాలం వేల్లబుచ్చుతున్నవి మాత్రమే. అంతిమ లక్ష్యం వైపు పయనిస్తున్నవి మాత్రమే.

తెలుగులో మనం ‘దేవుడు’ అంటాం. అరబీలో “అల్లాహ్” అంటారు. ఇంగ్లీషులో గాడ్ (God) అని అంటారు. ఇలా మానవుల ఆరాధ్య దైవాన్ని ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలుస్తుండవచ్చు. కాని ఇన్ని పదాల్లోకెల్లా “అల్లాహ్” అనేది ఎంతో విలక్షణమైన పదం. విశ్వప్రభువుకు అది అన్ని విధాలా శోభాయమానమైన పదం.

అరబ్బీ మాట్లాడే క్రైస్తవులు మరియు యూదులు “దేవుడు” అనే పదానికి  బదులుగా “అల్లాహ్” అనే పదాన్ని వాడుతారు. ఇంగ్లిష్ Bible లో God అని వాడిన చోటల్లా అరబిక్ Bible లో “అల్లాహ్” అనే పదం  కనపడుతుంది.

‘దేవుడు’ అనే పదం బహువచనమైతే దేవుళ్ళు అయిపోతుంది. స్త్రీలింగ మయితే దేవత అవుతంది. అలాగే ఇంగ్లీషులో కూడా  God అనే పదం  gods మరియు  goddess అవటానికి ఆస్కారముంది. అలాగే ఆ పదం స్త్రీ పురుష భేదాన్ని సూచించేటట్టుగా కూడా ఉండరాదు మరియు ఆయన అస్తిత్వాన్ని సూచించటానికి బహువచన పదం అక్కర్లేదు.నిజానికి మానవుల ఆరాధ్యదైవం ఎన్నటికీ ఒక్కడే. అందువల్ల అరబీ భాషలోని అల్లాహ్ అనే పదం విశ్వప్రభువుకు అన్నివిధాలా శోభాయమానమైనదని చెప్పవచ్చు.

ఒక అపోహ :

ముస్లిమేతరులకు ఇస్లాం గురించి ఉన్న అనేక పెద్ద అపోహల్లో “అల్లాహ్” అనే పదానికి సంబంధించిన అపోహ కూడా ఒకటి. ముస్లింలు క్రైస్తవుల, యూదుల దేవుణ్ణి కాకుండా వేరెవరో దేవుణ్ణి ఆరాధిస్తారని చాలామంది అనుకుంటారు. కాని నిజానికి ఇదంతా ఓ అపోహ మాత్రమే. ఎందుకంటే “అల్లాహ్” అనేపదం దేవుడు అనే పదానికి పర్యాయపదం. దేవుడు అందరికీ  ఒక్కడే.

దేవుడు ఎవరు? ఆయన అస్తిత్వం ఏమిటి? అనే విషయాల్లో యూదులు-క్రైస్తవులు-ముస్లింల మధ్య భేదాభిప్రాయాలున్నాయి, ఉదా; క్రైస్తవుల్లో ఉన్న త్రిత్వభావన (Trinity) ను  యూదులు తిరస్కరిస్తారు. ముస్లింలు కూడా దాన్ని తిరస్కరిస్తారు. అంతమాత్రం చేత ఆ మూడు మతాలకు వేర్వేరు దేవుళ్ళు ఉన్నారని అర్ధంకాదు. ఎందుకంటే- విశ్వమంతటికి నిజదేవుడు ఒక్కడే. ఇస్లాం చెప్పేది ఏమిటంటే- ఇతర మతాలవాళ్ళు కూడా అల్లాహ్ నే విశ్వసిస్తున్నారు. కాని అల్లాహ్ ను ఏ విధంగా విశ్వసించాలో ఆవిధంగా విశ్వసించటం లేదు. దేవుడు ఫలానా విధంగా ఉంటాడని స్వయంగా కల్పనలు చేసుకుని విశ్వసిస్తున్నారు.

అల్లాహ్ ముస్లింల దేవుడు మాత్రమే కాదు :

అల్లాహ్ అంటే ముస్లిముల దైవం, ఇంకో పేరున మరోజాతి వారి దైవం అని జనం చెప్పుకుంటూ ఉంటారు. ఇది కూడా పొరపాటే. ఇస్లాం సర్వమానవాళిని ఒకే తల్లిదండ్రుల సంతానంగా పరిగణిస్తుంది. వారందరి దైవం కూడా ఒక్కడే. ఆ దైవం మరియు ఆరాధ్యుని వివరణ మరియు విశ్లేషణ దివ్యఖురాన్ లో ఇలా ఉన్నది:

” మీరు చెప్పండి! ఆయన, అల్లాహ్ అద్వితీయుడు(ఒక్కడే).
అల్లాహ్ నిరపేక్షాపరుడు (ఎవరి ఆధారము, అక్కరా లేనివాడు, అందరూ ఆయనపై ఆధారపడేవారే).
ఆయనకు సంతానము ఎవరూ లేరు మరియు ఆయన ఎవరి సంతానమూ కాదు.
ఆయనకు సరిసమానులెవరూ లేరు.” (ఖురాన్ 112 వ అధ్యాయం)

నీ ప్రభువు పుట్టుపూర్వోత్తరాలను, అయన వంశ పరంపరను గురించి కాస్త వివరించమని బహుదైవారాధకులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను డిమాండు చేసిన నేపధ్యంలో ఈ  ఖురాన్ అధ్యాయం  అవతరించింది.

అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు. ఆయనకు ఎవరి అవసరమూ లేదూ.ఆయన ఎవరిపైనా ఆధారపడిన వాడుకాడు. అందరికీ ఆయన అవసరం ఉంది. అందరూ ఆయన పైనే ఆధారపడి ఉన్నారు. అల్లాహ్ అందరికన్నా వేరైనవాడు, నిరపేక్షాపరుడు. ఆయనకు సంతానం లేదు. ఆయనకు తల్లిదండ్రులు సైతం లేరు. ఆయన ఎవ్వరినీ కూడా కుమారులుగా కాని, కుమార్తెలుగా గాని చేసుకోలేదు. ఆయన ఉనికిలోగాని, ఆయన గుణగణాలలో కానీ, ఆయన అధికారాలో కానీ ఆయనకు భాగస్వాములు లేరు. ఆయనకు సరిజోడీ కూడా లేరు.

” ఆయన లాంటిది  సృష్టిలో ఏదీ లేదు”(ఖురాన్ షూరా – 11).