హజ్జ్ అంటే ఏమిటి?

హజ్జ్ అంటే అల్లాహ్ యొక్క “పవిత్ర గృహమైన కాబాను సందర్శించే ఉద్దేశ్యంతో, హజ్జ్ ఆరాధనలు (మనాసిక్ లను) అంటే ‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన హజ్జ్ లో నమోదు చేయబడిన తవాఫ్ (కాబాగృహం చుట్టూ 7సార్లు తిరగటం) చేయటం, సయీ చేయటం (సఫా మరియు మర్వా గుట్టల మధ్య 7 సార్లు పరుగెట్టటం తీయటం), అరఫాహ్ మైదానంలో నిలుచోవటం, మీనాలోని జమరాత్ పై (షైతాన్ ను సూచించే రాతి స్థంభాలపై) రాళ్ళు విసరటం’ మొదలైన ఆదేశాలు మరియు ఆచరణలను అమలు చేసే ఉద్దేశ్యంతో ప్రయాణించటం.”

హజ్జ్ యాత్ర బ్రహ్మాండమైన లాభాలను, ప్రయోజనాలను ప్రజలకు అందజేస్తుంది. అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని బహిరంగంగా ప్రకటించటం వలన హజ్జ్ యాత్రికులకు మన్నింపు, క్షమాపణ ప్రసాదింపబడును. ఇంకా వేర్వేరు దేశాలలోని ముస్లింలు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవటానికి మరియు పరస్పరం ఇస్లాం ధర్మ నియమనిబంధనలు నేర్చుకోవటానికి అవకాశం లభిస్తున్నది. మీరు వయస్సులో చాలా చిన్నవారైనప్పటికీ మరియు కెనడా వంటి ముస్లిమేతర దేశంలో నివసిస్తున్నప్పటికీ హజ్జ్ గురించి కుతూహంగా అడిగి తెలుసుకుంటున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మీకూ హజ్జ్ చేసే మరియు హజ్జ్ యాత్రలోని ఆరాధనలన్నింటినీ ఆచరించే భాగ్యం కలుగజేయాలని అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాము మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అపరిమితమైన అనుగ్రహాలను అల్లాహ్ కురిపించుగాక!

అశాంతి

నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలలో అశాంతి కూడా  ఒక సమస్య అని చెప్పటం లో ఎంత మాత్రం సందేహం లేదు. ఎందుకంటే నేడు సమాజంలో

 ఏ మూల చూసినా దొంగతనాలు, దోపిడీలు, బాంబులు, 

బ్లాస్టులు, వ్యభిచారం, మద్యపానం, సినిమాలలో అశ్లీలత పెరిగిపోవడం యువత చెడు వ్యసనాలకు దుర అలవాట్లకు బానిస కావటం సర్వసాధారనమైపోయింది. మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సమాజ పరిస్థితి ఏమి కావాలి? పై రుగ్మతలను ఆపే బాధ్యత ఎవరిదీ? పాలకులదా లేక పావ్రులదా? అసలు ఈ సమస్య కు పరిష్కారమే లేదా ? మరి మనం పోగట్టుకున్న శాంతిని తిరిగి పొందాలంటే ఏంచేయాలి? ఇదే ఈ రోజు మనందరి ముందు ఉన్నటువంటి అతి ముఖ్యమైన చిక్కు ప్రశ్న. ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటో తెలుసుకుందాం.

   దుష్కార్యాలకు, పాప కార్యాలకు పాల్పడే ప్రతి వ్యక్తీ ఈ క్రింది విషయాలలో జ్ఞానం సంపాదించి  ఆ పైన  దాని పై ఆచరణాత్మకంగా నిలబడితే అతను తన జీవిత కాలంలో ఎన్నడు కూడా ఎలాంటి దుష్కార్యాలకు లేదా పాపకార్యాలకు పాల్పడే అవకాశం ఉండనే ఉండదు.  అవేమిటంటే !

 1 – ముందుగా మనలో ప్రతీ ఒక్కరూ దైవం పట్ల భయ భక్తీ కలవారై ఉండాలి.

 2 – నేను చేస్తున్న ఈ దుష్కార్యానికి లేదా ఈ పాప కార్యానికి నన్ను పుట్టించిన ఆ దైవం  ప్రతీ క్షణమ్ నన్ను చూస్తూనే ఉన్నాడనే  భావన కలిగి ఉండాలి.

 3 – మరణించిన తరువాత నాకు మరో జీవితం ఉన్నది. అంటే తీర్పు దినాన నేను తిరిగి రెండవ సారి మళ్లీ లేపబడతాను అనే భావన కలిగి ఉండాలి.

 4 – ఆ రోజు (తీర్పు దినాన ) నేను చేసుకున్న సత్కార్యాలకు,దుష్కార్యాలకు, నన్ను పుట్టించిన దైవం  ముందు నిలబడి సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది అనే భావన కలిగి ఉండాలి.

 5 – ఇహలోకంలో దైవాజ్ఞుసారం జీవితం గడిపితే పరలోకంలో శాశ్వతమైన స్వర్గం లభిస్తుందని పరిపూర్ణ  విశ్వాసం కలిగి ఉండాలి.

 6 – దైవం చూపించిన మార్గం కాకుండా మనిషి తన ఇష్టానుసారం జీవితాన్ని గడిపితే పరలోకంలో విఫలమై శాశ్వతమైన నరకం ప్రాప్తం అవుతుందనే సత్యాన్ని తెలుసుకోవాలి.

ఇస్లామీయ క్యాలెండర్

హిజ్రీ శకం ఎలా మొదలయింది ?
     దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స) మక్కా నుంచి మదీనాకు  వలస వెళ్ళడం (హిజ్రత్ చేయడం ) అనేది ఇస్లామీయ చరిత్రలో ఓ మహత్తర సంఘటన. ఆయన (స) దుల్ హిజ్జా మాసం చివర్లో,
 ముహర్రం మాసం ప్రారంభంలో మక్కా నుంచి మదీనాకు  వలస వెళ్ళారు.  ఆ సంఘటనే తర్వాత హిజ్రీ శకం 17 వ  సంవత్సరం లో ఇస్లామీయ క్యాలెండరు ప్రారంభంగా హజ్రత్ ఉమర్ (ర)గారు  ఖరారు చేశారు. ఆ ప్రకారం ఇస్లామీయ క్యాలెండర్ నెలలు ఇవి: (1 ) ముహర్రం. 2 )సఫర్. 3 )రబీ ఉల్ అవ్వల్. 4 )రబీ ఉస్సాని. 5 ) జమాదిఉల్ అవ్వల్. 6 ) జమాదిఉస్సాని. 7 )రజబ్. 8 )షాబాన్.9 )రమదాన్. 10 )షవ్వాల్. 
11 ) దుల్ ఖఅద. 12 ) దుల్ హిజ్జ.  ఇప్పుడు మనం కొన్ని నెలలకు సంబంధించిన సమాచారం తెలుసు కుందాం . 
 ముహర్రం :
     సంవత్సరంలో నెలల సంఖ్యా  12 అయితే, అందులో నాలుగు నెలలు పవిత్రమైనవి Allah ఖుర్,ఆన్ లో పేర్కొన్నాడు. వాటిలో మొదటి మాసం ముహర్రం. చరిత్రను పరిశీలిస్తే ముహర్రం మాసం 10 వ తేదికి 
ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు ఉపవాసం పాటించవలసిందిగా దైవ ప్రవక్త (స)తన సముదాయాన్ని ప్రోత్సహించారు. 
 సఫర్ :
     ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఇది రెండవ మాసం. ఈ మాసానికి సంబంధించి సమాజంలో అనేక అపనమ్మకాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఈ మాసం దుశకునాలతో కూడినది.ఈ మాసంలో వివాహాలు 
మొదలగు శుభ కార్యాలు జరుపుకోరాదని మూఢ నమ్మకాలను ప్రజలు కల్పించుకున్నారు. నిజానికి ఇస్లాం ఏ దినాన్ని, మరే రోజును, ఘదియనూ చెడుగా భావించాడు. ఈ కారణంగానే ప్రవక్త (స) ” అపశకునంగా భావించి ముస్లిం తన పనులను మానేయరాదు” అని నొక్కి వక్కాణించారు. ( అబూదావూద్)