Article

మెదడు నుద్ధేశించి ఖుర్ఆన్ లో

brain 300x224 మెదడు నుద్ధేశించి ఖుర్ఆన్ లో
సృష్టికర్తయగు అల్లాహ్ దివ్వ ఖుర్ఆన్ లో ఓ దుష్టుడిని ఉద్దేశించి ఈవిధంగా అన్నాడు .
అతడు గనక మానకపోతే , మేము అతన్ని అతని నుదుటి వెంట్రుకలు పట్టుకుని ఈడుస్తాము ,అబద్దానికి , ఘోరపాపానికి పాల్పడిన నుదురు అది.(96-15-16)
పై ఖుర్ఆన్ వాక్యములో చెప్పబడిన చెప్పబడిన అబద్దానికి ఘోరపాపనికి పాల్పడిన నుదురు అన్న మాటలు ఈనాడు వైద్య విజ్ఞానము వలన తెలిసిన విషయాలు ఎంత దగ్గరగా ఉన్నాయో చూడండి.
Essential of Anatom & physiology అను పుస్తకములో ఈ విధముగా వ్రాయబడింది నుదురు వైపు ఉన్న మెదడు భాగాన్ని Pre Frontal Area అంటారు మెదడులోని ఈ భాగమే మనిషి ఏదైనా మంచి చెడు పనులు చెయ్యాలనే ఆలోచన కలుగజేస్తుందని వాటిని ఆచరించే వైపునకు పురిగొల్పుతుందని, ఉద్రేకాన్ని కల్గించే కేంద్రం కూడా ఇదే సత్యం లేదా అసత్యపు మాటలాడటానికి వాటిని ఆచరణలో పేట్టే విధంగా శరీరంలో మిగతా భాగాలను పురిగొల్పుతుంది అని ఈPre Frontal Area పని చేసే విధానమును ఈ మధ్యకాలములోనే Professor keith l.Moore అను శాస్త్రవేత్త కనుగొన్నారు.
ఒక దుష్టుడైన ఆవిశ్వాసి ముహమ్మద్ సలల్లాహు అలైహివసల్లం వారిని తరచూ ఇబ్బందులకు గురిచేసేవాడు వాడి బుర్రలో ఎప్పుడు ముహమ్మద్ సలల్లాహు అలైహివసల్లం వారిని ఎలా కించపరచాలి ఆయన ప్రచారాన్ని ఎలా అటంకపరచాలి అనే ఆలోచన తప్ప మరోకటి ఉండేది కాదు ముహమ్మద్ సలల్లాహు అలైహివసల్లం మసిడు కు వేళ్ళే త్రోవలో ముళ్ళకంపలు పరచేవాడు ఆయన ప్రార్థిస్తూ ఉండగా వీపుపై ఒంటే ప్రేగులు వేసేవాడు ఒక్కోక్కసారి ఇసుక గుమ్మరించేవాడు ఇలాంటి వాడి గురించే ఖుర్అన్ అబధ్ధాన్ని ఘోరానికి పాల్పడిన నుదురు వాడిది అందుచేతనే నుదుటి వెంట్రుకలను పట్టి ఈడ్చుకుంటూపోయి నరకంలో వేస్తానని హెచ్చరించడం జరిగింది . అంటే వీరికి ఇలాంటి ఆలోచనలు ప్రణాళికలు కల్గించేది ఈ స్థానమే అని ఖుర్ఆన్ చెబుతుంది నేడు వైద్య విజ్ఞానము ఈ స్థానమేఇలాంటి వాటికి కేంద్ర బిందువు అని చెబుతుంది

Scridb filter