ముహమ్మద్ సల్లలాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర

అజ్ఞాన కాలంలో అరబ్ పరిస్థితి
ఒకప్పుడు అరబ్బుల్లో బహుదైవారాధన ఒక ప్రధాన ధర్మంగా ఉండేది. సత్యధర్మానికి వ్యతిరేకమైన ఈ బహుదైవారాధన (షిర్క్)ను వారు పాటించినందు వలన వారి ఆకాలమును “అజ్ఞానకాలం” అనబడింది. అల్లాహ్ ను గాక, వారు పూజించే దేవతల్లో ప్రసిద్ధి చెందినవి – ‘లాత్’, ‘ఉజ్జా’, ‘మనాత్’, మరియు ‘హుబుల్’. అరబ్బుల మధ్య యూదమతాన్ని, క్రైస్తవ మతాన్ని అవలంబించినవారు మరియు పార్శీలు కూడా ఉండేవారు. వారందరి మధ్య కొందరు, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ‘దీనె హనీఫ్’ (బహుదైవారాధనకు అతీతంగా సవ్యమైన ధర్మం)పై స్థిరంగా ఉన్నవారు కూడా ఉండిరి.

ఇక వారి ఆర్థిక జీవతం అంటేః ఎడారివాసుల (అనాగరికుల) పూర్తి ఆధారం పశు సంపద, వాటిని మేపుటయే ఉండింది. నాగరికతలో ఉన్నవారి ఆధారం వ్యవసాయం, వ్యాపారంపై ఉండింది. ఇస్లాం ధర్మ జ్యోతి ప్రకాశించేకి కొంచం ముందు ‘మక్కా’ అరబ్ ద్వీపంలో ఒక పెద్ద వ్యాపార కేద్రంగా పేరుగాంచింది. మదీనా, తాయిఫ్ మరియు ఇతర కొన్ని ప్రాంతాల్లో కూడా నాగరికత ఉండినది.
సామాజిక వ్యవస్థః అన్యాయం విపరీతంగా వ్యాపించి యుండింది. బలహీనులకు ఎలాంటి హక్కు లేకపోవడం, ఆడ బిడ్డలను సజీవ సమాధి చేయడం, మానభంగాలకు పాల్పడడం, బలహీనుల హక్కు బలవంతుడు కాజేయడం, హద్దు లేకుండా భార్యలనుంచుకోవడం, వ్యభిచారం సర్వ సామాన్యమై యుండినది. తుచ్ఛమైన కారణాలపై సంవత్సరాల తరబడి తెగల్లో అంతర్ యుద్ధం జరిగేది. ఒకప్పుడు ఒక తెగకు సంబంధించిన సంతానంలో కూడా ఈ యుద్ధాలు జరిగేవి. ఇది ఇస్లాంకు ముందు అరబ్ ద్వీపం యొక్క సంక్షిప్త సమాచారం.
ఇబ్నుజ్జబీహైన్
(అనగా ఇస్మాఈల్ అలైహిస్సలాంను వారి తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ ఆజ్ఞతో జిబహ్ చేయబోయాడు. అబ్దుల్ ముత్తలిబ్ తన మ్రొక్కుబడిని పూర్తి చేయు టకు అబ్దుల్లాహ్ ను జిబహ్ చేయబోయాడు. అబ్దుల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తండ్రి అయితే ఇస్మాఈల్ అలైహిస్సలాం తాత ముత్తాతల్లో వస్తారు. ఈ విధంగా ఆయన బలికెక్కిన ఇద్దరి వ్యక్తుల కుమారుడు అని భావం.)
అబ్దుల్ ముత్తలిబ్ -ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తాత- అధిక ధన, సంతానం గలవారని ఖురైష్ అతన్ని చాలా గౌరవించేవారు. ‘అల్లాహ్ పది మగ సంతానం ప్రసాదిస్తే అందులో ఒకరిని దేవతలకు బలిస్తాన’ని అతను మ్రొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. పది మంది మగ సంతానం కలిగారు. అందులో ఒకరు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తండ్రి అబ్దుల్లాహ్. అబ్దుల్ ముత్తలిబ్ తన మ్రొక్కుబడిని పూర్తి చేయదలుచుకున్నపుడు, ఖురైష్ తన ముందుకు వచ్చి ఇది ప్రజలలో ఒక ఆచారముగా అయిపోతుందన్న భయంతో అతనికి అడ్డుపడి పది ఒంటెల మరియు అబ్దుల్లాహ్ మధ్య చీటి (పాచిక) వేసి పది ఒంటెలను అబ్దుల్లాహ్ కు బదులుగా బలిదానమివ్వాలి. ఒక వేళ చీటి అబ్దుల్లాహ్ పేరున వస్తే, మళ్ళీ పది ఒంటెలను పెంచాలని ఏకీభవించారు. ఈ విధంగా చీటి వేశారు. కాని ప్రతి సారి అబ్దుల్లాహ పేరే వచ్చేది. పదవసారి అనగ వంద ఒంటెలు ఒకవైపు అబ్దుల్లాహ్ ఒక వైపు ఉండగా ఒంటెల పేరున చీటి వెళ్ళింది. అప్పుడు ఒంటెలను బలి ఇచ్చాడు అబ్దుల్ ముత్తలిబ్.
అబ్దుల్ ముత్తలిబ్ కు మొదటి నుండి ఇతర సంతానముకన్నా అబ్దుల్లాహ్ యే హృదయానికి అతి చేరువుగా ఉండే. అతన్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. ప్రత్యేకంగా ఈ బలిదానము యొక్క సంఘటన తర్వాత. అతను పెరిగి, పెండ్లీడుకు చేరిన తర్వాత అతని తండ్రి జుహ్రా కుటుంబానికి చెందిన ఆమిన బిన్తె వహబ్ తో అతని వివాహం చేశాడు. అబ్దుల్లాహ్ వైవాహిక జీవితం గడుపుతూ ఆమిన మూడు నెలల గర్భములో ముహమ్మదును మోస్తుండగా ఒకసారి వ్యాపార బృందముతో సీరియా దేశం వైపు వెళ్ళాడు. తిరిగి వస్తుండగా దారిలోనే ఒక వ్యాదికి గురై మదీనలో నజ్జార్ వంశానికి చెందిన తన మేన మామల వద్ద ఆగిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడే మరణించాడు. అంతిమ క్రియలు అక్కడే జరిగాయి.
ఇటు ఆమిన నెలలు నిండినవి, సోమవారం రోజున ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించారు. కాని నిర్ణీత తారీకు మరియు నెల ప్రస్తావన రాలేదు. రబీఉల్ అవ్వల్ మాసం తొమ్మిదవ తారీకు అని చెప్పబడింది. అదే నెల 12 అనీ ఉంది. అలాగే రమజాను నెల అని కూడా అనబడింది. తదితర అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాని అది క్రీ.శ. ప్రకారం 571 సంవత్సరం అన్నది నిజం. అదే సంవత్సరాన్ని ఆముల్ ఫీల్ (ఏనుగుల సంవత్సరం) అని అంటారు.

ఏనుగుల సంఘటన
సంక్షిప్తంగా ఏనుగుల సంఘటన ఏమిటంటేః యమన్ లో నజ్జాషి యొక్క ప్రతినిధి అబ్రహా హబ్షీ ఉండేవాడు. అరబ్బులందరూ మక్కా నగరంలో ఉన్న పవిత్ర కాబా గృహాన్ని గౌరవిస్తూ, దూర ప్రాంతాల నుండి దాని దర్శనానికి వస్తూ, హజ్ చేస్తున్నది చూసిన అబ్రహా, యమన్ దేశపు రాజధాని ‘సనఆ’ లో ఒక పెద్ద చర్చి నిర్మించాడు. హజ్ కొరకు వచ్చే అరబ్బులందరూ కాబాకు బదులుగా దీని దర్శనానికి రావాలని కోరాడు. అది విన్న బనీ కినాన (అరబ్ వంశాల్లోని ఒక వంశం)లోని ఒక వ్యక్తి రాత్రి సమయంలో అందులో ప్రవేశించి ఆ చర్చి గోడలకు మలినము పూసాడు. ఈ విషయం తెలిసిన అబ్రహా ఆగ్రహముతో మక్కా నగరములోని కాబా గృహాన్ని ధ్వసం చేయాలని పూనుకొని అరవై వేల సైన్యంతో వెళ్ళాడు. సైన్యంలో తన వెంట తొమ్మిది ఏనుగులను తీసుకొని, తాను అన్నిట్లో పెద్ద ఏనుగుపై పయనమయి మక్కా సమీపానికి చేరుకున్నాడు. అక్కడ సైన్యాన్ని సరిచేసుకొని మక్కాలో ప్రవేశించాలన్న ఉద్దేశంతో సిద్ధమయ్యాడు. కాని తను అధిరోహించిన ఏనుగు కాబా వైపునకు ఒక్క అడుగు వేయడానికి సిద్ధం లేనట్లు కూర్చుండి పోయింది. కాబా దిశకు గాకుండా వేరే దిశలో లేపినప్పడు లేచి పరుగెత్తేది. కాని కాబా దిశకు మార్చితే కూర్చుండి పోయేది. వారు ఈ ప్రయత్నాల్లో ఉండగా అల్లాహ్ వారిపై పక్షుల్ని గుంపులు గుంపులుగా పంపాడు. అవి వారిపై గులకరాళ్ళను విసిరాయి. అల్లాహ్ చివరికి వారిని పశువులు తినవేసిన పొట్టు మాదిరిగా చేశాడు. అది ఎలా అంటేః ప్రతి పక్షి వద్ద చణక గింజంత మూడు రాళ్ళుండేవి. ఒకటి వారి చుంచువులో, రెండు వారి కాళ్ళల్లో. అవి ఎవరిపై పడిన వారి అవయవాలు ముక్కలు ముక్కలయి దారి గుండా పడుతూ చివరికి సర్వనాశనమయ్యేవారు. అబ్రహాపై అల్లాహ్ ఒక వ్యాదిని పంపాడు. దాని కారణంగా అతని వ్రేళ్ళు ఊడిపోయాయి. అతడు సనఆలో చేరుకునే సరికి ఆ రోగం ముదిరిపోయి, తన తడాక చూపింది. అక్కడే వాడు చనిపోయాడు.
ఇటు ఖురైషుల విషయం: అబ్రహ వస్తున్న విషయం విని, వారు భయపడి కొండల్లో, కొనల్లో పరుగెత్తి పోయారు. ఆ సైన్యంపై విరుచుకు పడ్డ ఆపదను చూసి అందరూ తృప్తి, శాంతితో తమ తమ ఇండ్లల్లోకి తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మకు 50 రోజుల ముందు జరిగినది. (అందుకే ఈ సంవత్సరానికి ఆముల్ ఫీల్ అన్న పేరు వచ్చింది).

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పోషణ
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించిన తరువాత, ఆయన పిన తండ్రి అయిన అబూ లహబ్ యొక్క బానిస సువైబ అను ఆమె ఆయనకు పాలు పట్టింది. ఆమె అంతకు ముందు హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కు కూడా పాలు పట్టింది. (ఇతను ప్రవక్త బాబాయి). ఈ విధంగా హంజా ప్రవక్త పాల సంబంధ సోదరుడయ్యాడు.
అరబ్బుల అలవాటేమనగా వారు తమ పసిపిల్లలకు గ్రామీణ వాతవర ణములో ఉంచి అక్కడ పాలు పట్టించేవారు. ఎందుకనగా శారీరకంగా, ఆరోగ్యంగా ఉండుటకు అచ్చట పూర్తి సహాయం లభించేది. ఇలా ముహ మ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరో దాయి వద్దకు చేరుకున్నారు. దాని వివరణ ఇలా ఉందిః ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించిన రోజుల్లో మక్కాలో ఉన్న శిశువులను, పాలు త్రాగించడానికి తీసుకెళ్ళే ఉద్దేశ్యంతో బనీ సఅద్ వారి ఒక బృందం వచ్చింది. ప్రతి స్త్రీ పసిపిల్లలున్న గృహాలను గాలించి, అట్లే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికి వచ్చి అతను అనాధ, పేదవాడు అని తెలుసుకొని వెను దిరిగింది. అందరి వలే హలీమ సఅదియా కూడా ఆయన్ని స్వీకరించక తిరిగి పోయింది. కాని అనేక గృహాలను గాలించినప్పటికీ, తన వెంట తీసు కెళ్ళడానికి శ్రీమంతుల బాలున్ని పొందలేక పోయింది. ఆమె ఉద్దేశ ప్రకారం, శ్రీమంతుల బాలున్ని పొందుతే, ఆ బాలుని ఇంటివారు పాలు పట్టినందుకు ఇచ్చే పైకం ద్వారా వారి పస్తుల్లో గడుస్తున్న రోజులకు సమాప్తం ఉండ వచ్చు, ప్రత్యేకంగా అనావృష్టి వల్ల దారిద్ర్య రేఖకు దిగజారిన వారి జీవితం బాగు పడవచ్చన్న ఆశ ఆమెది. వేరే ఏ మార్గం దొరక్క అదే అనాథ బాలున్ని, వారు ఇచ్చే చిన్న పాటి పారితోషికాన్ని స్వీకరించటానికి తిరిగి ఆమిన (ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తల్లి) ఇంటికి వచ్చింది. హలీమ తన భర్తతో మరీ నిదానంగా నడిచే (పరుగెత్తలేని), బక్కని గాడిద పై మక్కా వచ్చింది. కాని తిరుగు ప్రయాణంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తన ఒడిలో తీసుకున్నాక, అదే గాడిద వేగంగా పరుగెత్తుతూ తోటి సవారీలను వెనుకేసి, తోటి ప్రయాణికులను కూడా ఆశ్చర్యం లో పడవేసింది. హలీమ ఉల్లేఖనం ప్రకారం, ఆమె వద్ద చాలా తక్కువ పాలుండేవి. ముందు నుండే ఆమె వద్ద ఉన్న స్వంత కొడుకు పాలు సరిపడక ఆకలితో ఎప్పుడూ ఏడ్చేవాడు. కాని ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె పాలు త్రాగడం మొదలు పెట్టిన వెంటనే ఆమె స్తనాలు పాలతో నిండిపోయాయి. బనూ సఅద్ అనే తన ప్రాంతంలో ఉన్న భూములు వర్షము లేక మాడిపోతున్న వేళ, శుభ బాలునికి పాలు పట్టే భాగ్యం పొందాక, అక్కడి భూములు పండాయి. పశువులు అధికమయ్యాయి. వారి స్థితిగతులు కలిమి నుండి లేమి, కష్టము నుండి సుఖములుగా మారాయి.
చూస్తూ చూస్తూ హలీమ రక్షణలో రెండు సంవత్సరాలు గడిచాయి. ఇతరులలో కానరాని అసాధారణ అలవాట్లు ఈ సుపుత్రునిలో చూస్తున్నందు వలన మరియు దూరదృష్టి అతనిలో ఏదో ఒక గొప్ప విషయాన్ని సూచిస్తున్నందు వలన, హలీమాకు మరి కొన్ని రోజులు ఈ బాలున్ని పోషించాలన్న తపన కలిగింది. (రెండు సంవత్సరాల్లో తిరిగి ఆమినకు అప్పజెప్పాలన్న మాటపై) హలీమ ఈ బాలుడ్ని తీసుకొని, అతని తల్లి, తాత దగ్గరికి మక్కా వచ్చింది. కాని అతని మూలంగా ఆమె స్థితిగతుల్లో ఏ మార్పు వచ్చిందో, ఏ శుభం చూసిందో అందుకని మరో రెండేళ్ళు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తన వద్దే ఉంచుకుంటా నని ప్రాధేయపడితే, దానికి ఆమిన ఒప్పుకుంది. అదే అనాథశిశువుడైన ముహమ్మదును మహా సంతోషం, మాహా భాగ్యంతో తీసుకొని హలీమా తమ బనీ సఅద్ ప్రాంతానికి తిరిగి వచ్చింది.
“షఖ్ఖె సద్ర్” (హృదయ పరిచ్ఛేదం)
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సుమారు 4 సంవత్సరాల వయస్సు. ఒక రోజు గుడారానికి కొంత దూరాన తమ పాల సంబంధ తమ్ముడు అగు హలీమ సఅదియా కొడుకుతో ఆడుకుంటున్నాడు. హలీమ కొడుకు పరుగెత్తుకుంటూ తల్లి వద్దకు వచ్చాడు. అతని ముఖముపై భయాందోళన చిహ్నాలు స్ఫష్టంగా ఉన్నాయి. “అమ్మా! తొందర వచ్చేసెయి, అదిగో ఖురైషి తమ్మున్ని చూడు, అని అనసాగాడు. హలీమ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వైపు పరుగులు తీస్తూ అతని గురించి ప్రశ్నించింది. దానికి తన కొడుకు “నేను తెల్లని బట్టల్లో ఇద్దరు వ్యక్తుల్ని చూశాను. వారు ముహమ్మద్ ని మా మధ్య నుండి పక్కకు తీసుకెళ్ళి, పడుకోబెట్టి, అతని ఎద చీల్చి…. అని అంటుండగా హలీమ సంఘటన స్థలానికి చేరుకుంది. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కదల కుండా నిలబడి ఉన్నాడు. రంగు పేలిపోయి ఉంది. ముఖ కవళికల్లో మార్పు వచ్చింది. హలీమా వ్యాకులతతో జరిగిందేమిటని అడిగింది. “నేను క్షేమంగనే ఉన్నాను” అని ముహమ్మద్ ఇలా చెప్పాడుః “తెల్లని దుస్తుల్లో ఇద్దరు మనుషులు వచ్చి నన్ను తీసుకెళ్ళి నా ఎదను చీల్చి, అందులో నుండి గుండెను తీసి, దానిలో ఉన్న ఒక నల్లటి రక్తపు ముద్దను తీసి పారేసి, చల్లని జమ్ జమ్ నీటితో గుండెను కడిగి యధా విధిగా దాని స్థానంలో పెట్టేసి కుట్లువేసి సరిచేసి వెళ్ళిపోయారు. వారు ఇక కనబడలేదు. హలీమా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తీసుకొని తన గుడారంలో వచ్చింది. మరుసటి రోజు తెల్లవారుజామున -ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను వెంటబెట్టుకొని మక్కా వచ్చేసింది. సమయం కాని సమయంలో వచ్చిన హలీమాను చూసి ఆమిన ఆశ్చర్యానికి గురైంది. ఆమెనే స్వయంగా ఎంతో బతిమిలాడి తీసుకెళ్ళింది కదా. అయితే ఇలా హఠాత్తుగా రావడానికి కారణం ఏమిటని ఆమిన అడిగింది. హలీమా హృదయ పరిచ్ఛేద విషయాన్ని వివరంగా చెప్పింది.
ఒకరోజు ఆమిన తన అనాథ సుపుత్రుడిని తీసుకొని, బనూ నజ్జార్లోని ఆయన మేనమామలను సందర్శించడానికి మదీనకు పయనమయ్యింది. కొద్ది రోజులు అక్కడ ఉండి, తిరిగి వస్తుండగా ‘అబ్వా’ అనే ప్రాంతంలో అసువులు బాసింది. అక్కడే అంతిమ క్రియలు జరిగాయి. ఇలా ఆరు సంవత్సరాల వయసులో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కన్నతల్లికీ వీడ్కోలు పలికారు.
ఆయన పోషణ, సంరక్షణ భారం తాత అబ్దుల్ ముత్తలిబ్ పై పడింది. ప్రేమతో ఆయన్ని చూసుకున్నారు. కంటి పాపలా ఆయన్ని కాసారు. ముహమ్మద్ ఎనిమిదవ ఏటలో తాత కూడా పరమపదించారు. అయితే పోతూ పోతూ తన తనయుడైన అబూతాలిబ్ కు ముహమ్మద్ సంరక్షణ భారం అప్పజెప్పి పోయాడు. అబూ తాలిబ్ అధిక సంతానం, తక్కువ సంపాదన గలవారైనప్పటికీ ముహమ్మద్ పోషణ బాధ్యత స్వీకరించారు. అతను, అతని భార్యలిద్దరూ తమ స్వంత సంతానంలాగా ఆయన్ని చూసుకునేవారు. ముహమ్మద్ కు కూడా పినతండ్రి అంటే ఎనలేని ప్రేమ. ఈ వాతవరణంలో ఆయన పెరుగుదల యొక్క తొలి దశ/ మెట్టు మొద- లయింది. నిజాయితీగా జీవించ గలిగారు. అందుకే సత్యత, విశ్వసనీయత ఆయనకు మారుపేరుగా నిలిచాయి. “అమీన్” (విశ్వసినీయుడు) వస్తున్నాడు లేదా “సాదిఖ్” (సత్యసంధుడు) వస్తున్నాడు అని అంటే అతను ముహమ్మదే అని అనుకునేవారు ప్రజలు

ఇస్లామీయచట్టం ఇస్లామీయ తర్కశాస్త్రం మధ్య గల భేదం

ఈ రెండింటి మధ్య కొద్దిగా భేదం గలదు. దానిని గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం.

ఇస్లామీయ ధర్మచట్టం(షరీఅహ్):- దైవవాణి అయిన దివ్యఖుర్ఆన్ మరియు చిట్టచివరి దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహుఅలైహివసల్లం) యొక్క ఆచరణలు మరియు సూచనలనే ఇస్లామీయ ధర్మచట్టం(షరీఅహ్) అంటారు. ఇది ఒక నిష్కల్మషమైన మరియు పవిత్రమైన అంశం.

ఇస్లామీయ తర్కశాస్త్రం(ఫిఖ్ హ్):- ఇస్లామీయ చట్టాన్ని లేక ధర్మశాసనాన్నిఅర్థం చేసుకుని, దానిని విపులీకరించడానికి ధర్మవేత్తలు పాటించిన పద్ధతినే ఇస్లామీయ తర్కశాస్త్రం (ఫిఖ్ హ్) అంటారు. కాబట్టి ఇస్లామీయ చట్టపు (షరీఅహ్) అంశాలను అర్ధం చేసుకోవడం, అవగాహన చేసుకోవడంలో ఒక ధర్మవేత్తకు మరొక ధర్మవేత్తకు మధ్య కొన్ని అభిప్రాయభేదాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాని ఏ ధర్మశాస్త్రవేత్తా ఖుర్ఆన్, సహీహదీథ్ లకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను ఎటువంటి పరిస్థితిలోనూ వ్యక్తం చెయ్యలేదు. సహీహదీథ్ ఆ సమయంలో వారికి చేరకపోవటం వలన వారి అభిప్రాయాలు ఆ సహీహదీథ్ కు భిన్నమై ఉండవచ్చు.

ఇస్లామీయ ధర్మచట్టం (ధర్మశాస్త్రం – షరీఅహ్) యొక్క మూలాధారాలు:- నాలుగు.
ఖుర్ఆన్ – ఆఖరి దివ్యగ్రంథం, దైవవాణి
సున్నహ్ – ప్రవక్త పాటించిన, ఆదేశించిన, అనుమతించినవి
ఇజ్ మాఁ – ఏకాభిప్రాయం
ఖియాస్ – పోలిక, సమతూకం

విషయాన్ని అర్థం చేసుకునే దిశలో వేర్వేరు అభిప్రాయాల ఆరంభం :-

అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు ఉత్పన్నమౌతుంటాయి. వీటి విషయంలో మూలగ్రంధాలైన ఖుర్ఆన్ మరియు హదీథ్ లలోని వివరణ, పరిష్కారం స్పష్టంగా అర్థంచేసుకోలేకపోవచ్చు. అంటే కొన్ని ప్రత్యేక సమస్యల యొక్క నిర్ధారణాధారాలు వాటిలో అర్థం కాకపోవచ్చు. లేదా ఏకాభిప్రాయం ఉన్నటు వంటి ఆధారమూ కనబడకపోవచ్చు. అటువంటప్పుడు దాని గురించి స్పష్టమైన తీర్పు, పరిష్కారం తెలుసకొనుటకు ఇజ్తిహాద్ (అంటే ఏదైనా సమస్యకు ధార్మిక పరిష్కారం ఏమిటో తెలుసుకొనుటకు చిత్తశుద్ధితో ఖుర్ఆన్, హదీథ్ మరియు ప్రవక్త సహచరుల ఆదేశాల్లో తీవ్రంగా గాలించుట మరియు ఆలోచించుట) తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంటుంది. ఇటువంటి సంఘటన స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత కాలమందు కూడా తలెత్తినది. ఖంధక్ యుద్ధం తర్వాత, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులకు ఇలా ఆజ్ఞాపించారు “మీలో ఏ ఒక్కరూ అస్ర్ నమాజు చదవకండి, కానీ బనూ ఖురైజా చేరాక” వెంటనే వాళ్ళందరూ బను ఖురైదా వైపునకు ప్రయాణం మొదలు పెట్టారు. బనుఖురైదా నివాసస్ధలం చేరకముందే అస్ర్ నమాజు సమయం దాటి పోతుందనేది స్పష్టమైపోయినది. దారిలోనే నమాజు పూర్తిచేయాలా లేక బనుఖురైదా నివాసస్ధలం చేరాలా అనే విషయం వారిని సందిగ్ధంలో పడవేసినది. అప్పుడు కొందరు అక్కడే నమజు పూర్తిచేశారు. అస్ర్ సమయం దాటిపోతుందన్న భయం చేత వీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాన్ని ఆలస్యం చేయకుండా త్వరగా నడవండి అనే ఆదేశంగా భావించారు.

మరి కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాక్యాలను యధాతధంగా గ్రహించి భావప్రమేయం లేకుండా ఏకధాటిగా ప్రయాణం చేసి, గమ్యస్ధానానికి చేరుకుని అసర్ నమాజు పూర్తిచేశారు. ఈ రెండువర్గాల భేదాభిప్రాయాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు తెలిసిన తర్వాత వారు ఎవరినీ దోషులనలేదు.

పైన వివరించినట్లుగా సహీహదీథ్ లన్నీ ఆధర్మవేత్తలకు చేరకపోవటమే వారి మధ్య కలిగిన అభిప్రాయభేదాలకు ప్రధాన కారణం. ఇంకా మూలగ్రంధాలను అర్ధం చేసుకోవడం, అవగాహన చేసుకోవడంలో తేడాలు కూడా అభిప్రాయభేదాలు లేవనెత్తే కారణాలలో ప్రధానమైనవి. అలాగే సహీహ్(సత్యమైన), హసన్ (ఉత్తమమైన), దయీఫ్(బలహీనమైన) మొదలగు హదీథ్ ల నిర్ధారణ క్రమాలను, భావాన్ని స్పష్టమైన పద్దతిలో గుర్తించక పోవడం కూడా అభిప్రాయభేదాలకు కారణమైనది.

ఫిఖ్ హ్(తర్క) శాస్త్ర అధ్యయన కేంద్రాల ఆవిర్భావం :-

ప్రారంభకాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరగణంలో అభిప్రాయభేదాల ప్రభావం ఎంత మాత్రమూ ఉండేదికాదు. కారణం – వారి మధ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఉండేవారు మరియు ప్రతి విషయాన్ని వారికి పునB విశదీకరిస్తూ కూలంకషంగా ఆజ్ఞలను వెలువరిస్తుండేవారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం వారి అనేక సహచరులు వేర్వేరు నగరాలలో, ప్రాంతాలలో వెళ్ళి స్థిరపడ్డారు. అక్కడ వారు, వారి వారి అభిప్రాయాలను ఖుర్ఆన్, హదీసుల ద్వారా వెలుబుచ్చుతూ వచ్చారు. కాని సహచరుల తర్వాత కాలంలోని వారు (ఎక్కడైతే సహీహదీథ్ అందలేదో అక్కడ) తమ అభిప్రాయాలు తెలిపి, ఆ అభిప్రాయాన్ని సహీ హదీథ్ తో సరిచూసుకోనంత వరకు తమ అభిపాయాలు ప్రామాణికమైనవి కాజాలవని ప్రకటించేవారు. కాని వారి తర్వాత కాలంలోని ప్రజలు, ఆ ధర్మవేత్తల అభిప్రాయాలకే అమితంగా విలువనిచ్చి, సహీహదీథ్ లపై నిజమైన శ్రద్ధ చూపలేదు. ఈ విధంగా ప్రసిద్ధి చెందిన నలుగురు (క్రింద తెలుపబడిన) ధర్మవేత్తల పేర్ల మీదుగా నాలుగు వర్గాలు ఆవిర్భవించాయి.

1)ఇమాం అబు హనీఫా (నోఁమాన్ బిన్ థాబిత్) రహిమహుల్లాహ్ 080హి – 150హి

2) ఇమాం మాలిక్ బిన్ అనస్ రహిమహుల్లాహ్ 093హి – 170హి

3) ఇమాం ముహమ్మద్ బిన్ ఇద్రీస్ అల్-షాఫఇ రహిమహుల్లాహ్ 150హి – 204హి

4) ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ 164హి – 241హి

పైన పేర్కొన్న ధర్మవేత్తలలో కొందరు ఒకరికొకరు గురుశిష్యులు, ఒకరితో ఇంకొకరు సంబంధం కల్గినవారు. ఇంకా వారందరూ ఒకరినొకరు అమితంగా ఆదరించుకునేవారు

గమనిక׃- ప్రతి ముస్లిం సహోదరుడు ఏదో ఒక వర్గాన్ని ప్రత్యేకించి అనుసరించవలసిన విధి లేదన్న విషయం గ్రహించాలి. ఇస్లాం మూలసిద్ధాంతాలలో ముస్లిం సమాజం వర్గాలుగా, కూటములుగా విభజింపబడటం పూర్తిగా నిషేధింపబడినది. అందుచే వాస్తవిక ధర్మశాస్త్రాలైన దివ్యఖుర్ఆన్ & సహీహదీథ్ లకు మనస్పూర్తిగా ప్రాముఖ్యత నిచ్చి, వాటి జ్ఞానాన్ని సంపాదించి, ఆచరించి, ఇతరులకు తెలియజేయటానికి శాయశక్తులా కృషి చెయ్యాలి. కేవలం దీని ద్వారా మాత్రమే బాధాకరమైన, కఠినమైన నరకశిక్ష నుండి తప్పించుకోగలరు.

ఇస్రా, మేరాజ్ (గగన ప్రయాణం

మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు ప్రయాణాన్ని “ఇస్రా” అని, అక్కడి నుండి గగన ప్రయాణాన్ని “మేరాజ్” అని అంటారు.)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెదనాన్న అబూ తాలిబ్ మరియు పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హాల మరణం, తాయిఫ్ నుండి తిరుగు ప్రయాణంలో జరిగిన సంఘటన, ఆ తరువాత ఖురైషుల హింసాదౌర్జన్యాల హెచ్చింపు ఇవన్నీ ఒకటెనుకొకటి సంభవించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అనేక రకాల బాధలు అనుభవిస్తున్న సందర్భంలో అల్లాహ్ వైపు నుండి ఆయన మనసుకు నెమ్మది, తృప్తి, శాంతి ప్రసాదించబడే రోజు ఆసన్నమయింది. ఆ రోజు రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రిస్తున్న వేళ జిబ్రీల్ అలైహిస్సలాం “బురాఖ్” తీసుకొని వచ్చారు. దాని పోలిక గుఱ్ఱం లాంటిది. దానికి రెండు రెక్కలు. మెరుపు లాంటి దాని వేగం. దానిపై ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను సవారి చేయించుకొని ఫాలస్తీనా దేశంలో బైతుల్ మఖ్దిస్ వెళ్ళారు. అక్కడి నుండి గగన ప్రయాణము చేసి పోషకుడైన అల్లాహ్ యొక్క చాలా నిదర్శనాలు చూశారు. అక్కడే ఐదు పూటల నమాజు విధి అయ్యింది. అదే రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశాంత హృదయంతో, దృఢ విశ్వాసంతో తిరిగి వచ్చారు. ఈ విషయాన్నే అల్లాహ్ ఇలా తెలిపాడుః
{కొన్ని నిదర్శనాలు చూపటానికి తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిదె హరాం నుండి మస్జిదె అఖ్సా వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. నిజానికి ఆయనే అన్నీ వినేవాడూ, అన్నీ చూసేవాడునూ}. (బనీ ఇస్రాయీల్ 17: 1).
ఉదయం కాబా వద్దకు వచ్చి, రాత్రి జరిగిన సంఘటన ప్రజల ముందు చెప్పగా అవిశ్వాసులు పరిహసించి, ఘోరంగా తిరస్కరించారు. కొందరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను లొంగదీయాలనే ఉద్దేశంతో బైతుల్ మఖ్దిస్ గురించి వర్ణించవలసినదిగా కోరారు. ప్రవక్త దానిలోని ఒక్కొక్క వస్తువును గురించి వివరించారు. ఇంతటి సూక్ష్మమైన వర్ణనతో ముష్రికులు తృప్తి చెందక మరో నిదర్శన అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నేను దారిలో ఒక బిడారాన్ని చూశాను. అది మక్కా వైపు వస్తుంద”ని చెప్పి, వారి ఒంటెల సంఖ్య, వారు ఇక్కడికి చేరుకునే సమయంతో సహా అన్ని వివరాలిచ్చారు. ప్రవక్త మాట / సూచన నూటికి నూరు పాల్లు నిజం అయింది. కాని అవిశ్వాసులు సత్యపరిచేకి బదులుగా, సత్యతిరస్కారం, తలబిరుసుతనంలోనే ఉండిపొయ్యారు.
ఇస్రా మరియు మేరాజ్ తరువాత రోజు జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త వద్దకు వచ్చి, ఐదు నమాజుల విధానం, వాటి సమయాలు తెలియజేశారు. అంతకు ముందు ఉదయం రెండు రకాతులు, సాయంకాలం రెండు రకాతుల నమాజు మాత్రమే ఉండినది.
ఖురైషుల పోరు రోజురోజుకు పెర్గుతూ పోతుంది. వారు సత్యం నుండి దూరమే అవుతున్నారు. ఆ సమయాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇతర ప్రాంతాల నుండి మక్కా వచ్చేవారికి ఇస్లాం ధర్మాన్ని తెలుపడంపై ఎక్కువ దృష్టి సారించారు. వారి నివాసాల్లో, వారు మజిలి చేసే చోట వారితో కలసి క్లుప్తంగా ఇస్లాం గురించి వివరించేవారు. ప్రవక్త పిన తండ్రి అబూ లహబ్ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వెంట తిరుగుతూ ఆయన గురించి, ఆయన ప్రచారం గురించి ప్రజల్ని బెదిరించేవాడు.
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీన నుండి వచ్చి మజిలి చేసిన కొందరితో కలిసి వారిని అల్లాహ్ వైపు పిలిచారు. వారు ఆయన మాటలను శ్రద్ధగా విని, ఆయన్ను విశ్వసించి, అనుసరిస్తామని వారు ఏకీభవించారు. అయితే ఒక ప్రవక్త రానున్నాడు, అతని ఆగమన కాలం సమీపించిందని వారు ఇంతకు ముందే యూదులతో వినేవారు. ఎప్పుడైతే ప్రవక్త వారికి ఇస్లాం బోధ చేశారో, యూదులు చెప్పే మాట గుర్తొచ్చి, ఆ ప్రవక్త ఈయనే అని తెలుసుకొని, ఈయన్ని విశ్వసించడంలో యూదులు మనకంటే ముందంజం వేయకూడదని వారు పరస్పరం అనుకొని తొందరగా విశ్వసించారు. వారు ఆరుగురు. ఆ తరువాత సంవత్సరం పన్నెండు మంది ప్రవక్తతో కలసి ఇస్లాం ధర్మ జ్ఞానం నేర్చుకున్నారు. వారు తిరిగి మదీన వెళ్ళేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్అబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు అన్హును వారితో పంపారు. అతను వారికి ఖుర్ఆన్ నేర్పాలని మరియు ఇస్లాం ధర్మాదేశాలు బోధించాలని. అతను అక్కడి సమాజంపై మంచి ప్రభావం వేయగలిగారు. అంటే మదీనవాసులు అతని ప్రచారం పట్ల ఆకర్శితులయ్యే విధంగా అతను అక్కడ ఉండి ఇస్లాం బోధించగలిగారు. ఒక సంవంత్సరం తర్వాత అతను మక్కా వచ్చేటప్పుడు తన వెంట 72 మంది పురుషులు, ఇద్దరు స్త్రీలు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిశారు. అల్లాహ్ ధర్మ సహాయానికి ఎల్లవేళల్లో సిద్ధమేనని వారు శపథం చేసి తిరిగి మదీన వెళ్ళిపోయారు.
నూతన ప్రచారం కేంద్రం
మదీన పట్టణం ఇస్లాం మరియు ముస్లింలకు మంచి ఆశ్రయం, శాంతి స్థానమైనది. అక్కడికి మక్కా పీడిత ముస్లిముల హిజ్రత్ (హిజ్రత్ అంటే వలసపోవుట. అంటే తన స్వగ్రామంలో ఇస్లాం ధర్మ ప్రకారం జీవితం గడపడం కష్టతరమైతే, దాన్ని వదిలి వేరే ప్రాంతానికి ప్రయాణమగుట) మొదలయ్యింది. ముస్లిములను హిజ్రత్ చేయనివ్వకూడదని ఖురైషు గట్టి పట్టు పట్టారు. హిజ్రత్ చేయబూనిన కొందరు ముస్లిములు నానా రకాల హింసా దౌర్జన్యాలకు గురయ్యారు. అందుకు ముస్లిములు రహస్యంగా హిజ్రత్ చేసేవారు. అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ప్రవక్తతో అనుమతి కోరినప్పుడల్లా “తొందరపడకు, బహుశా అల్లాహ్ నీకొక ప్రయాణమిత్రుడు నొసంగవచ్చును” అని చెప్పేవారు. చివరికి చాలా మంది ముస్లిములు హిజ్రత్ చేశారు.
ముస్లిములు ఈ విధంగా హిజ్రత్ చేసి, మదీనలో వెళ్ళి స్థానం ఏర్పరుచుకుంటున్న విషయాన్ని చూసి ఖురైషులకు పిచ్చెక్కి పోయింది. అంతే కాదు, ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం- ప్రతిష్ఠ, ఆయన ప్రచారం దినదినానికి వృద్ధి చెందుతున్నది చూసి వారు భయపడి పోయారు. అందుకని వారందరూ కలసి సమాలోచన చేసి ప్రవక్తను హతమార్చాలని ఏకీభవించారు. అబూ జహల్ ఇలా చెప్పాడుః మనం ప్రతి తెగ నుండి శక్తివంతుడైన ఒక యువకునికి కరవాలం ఇవ్వాలి. వారందరూ ముహమ్మదును ముట్టడించి, అందరు ఒకేసారి దాడి చేసి సంహరించాలి. అప్పుడు అతని హత్యానేరం అన్ని తెగలపై పడుతుంది. బనీ హాషిం అందరితో పగతీర్చుకొనుటకు సాహసించలేరు అని పథకం వేశారు. వారి ఈ పథకం, దురాలోచన గురించి అల్లాహ్ ప్రవక్తకు తెలియ జేశాడు. అల్లాహ్ అనుమతిని అనుసరించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ బక్ర్ రజియల్లాహు అన్హుతో హిజ్రత్ కొరకు సిద్ధమయ్యారు.
అలీ రజియల్లాహు అన్హును పిలిచి, ఈ రాత్రి నీవు నా పడకపై నిద్రించు, (నీకు ఏ నష్టమూ కలగదు). చూసే వారికి నేనే నిద్రిస్తున్నానన్న భ్రమ కలుగుతుంది అని చెప్పారు.
అవిశ్వాసులు తమ పథకం ప్రకారం, ప్రవక్త ఇంటిని చుట్టుముట్టారు. అలీ రజియల్లాహు అన్హును నిద్రిస్తున్నది చూసి ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం- అని భ్రమపడ్డారు. ఆయన బైటికి వచ్చిన వెంటనే ఒకే దాడిలో హత్య చేయాలని ఆయన రాక కొరకు ఎదిరి చూస్తున్నారు. వారు ముట్టడించి కాపుకాస్తున్న వేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధ్య నుండి వెళ్ళారు. వారి తలలపై మన్ను విసురుతూ అక్కడి నుండి వెళ్ళారు. అల్లాహ్ వారి చూపులను పట్టుకున్నాడు. ప్రవక్త వారి ముందు నుండి దాటింది వారు గ్రహించలేక పోయారు. అక్కడి నుండి ప్రవక్త అబూ బక్ర్ రజియల్లాహు అన్హు వద్దకెళ్ళి, ఇద్దరూ కలసి సుమారు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న సౌర్ గుహలో దాగి పోయారు. అటు ఖురైషు శక్తిశాలి యువకులు తెల్లారే వరకు నిరీక్షిస్తునే ఉండిపోయారు. తెల్లారిన తర్వాత ప్రవక్త పడక నుండి అలీ రజియల్లాహు అన్హు లేచి, వీరి చేతిలో చిక్కాడు. ప్రవక్త గురించి అడిగారు. అలీ రజియల్లాహు అన్హు ఏమీ చెప్ప లేదు. అతన్ని పట్టి లాగారు, కొట్టారు, కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు ఖురైషులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వెతకడానికి అన్ని దిక్కులా అన్వేషీలను పంపారు. ఆయన్ని జీవనిర్జీవ ఏ స్థితిలో పట్టు కొచ్చినా, అతనికి 100 ఒంటెల బహుమాణం అని ప్రకటించారు. కొందరు అన్వేషీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన మిత్రుడు ఉన్న గుహ వద్దకు చేరుకున్నారు. వారిలో ఏ ఒక్కడైనా వంగి తన పాదాల్ని చూసుకున్నా, వారిద్దర్ని చూసేవాడు. అందుకు అబూ బక్ర్ రజియల్లాహు అన్హు (ప్రవక్త పట్ల) కంగారు పడ్డారు. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా ధైర్యం చెప్పారుః “అబూ బక్ర్! ఏ ఇద్దరికి తోడుగా మూడోవాడు అల్లాహ్ ఉన్నాడో వారి గురించి నీకు రందేమిటి. దిగులు పడకు అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు”. వాస్తవంగా వారు ఆ ఇద్దరిని చూడలేదు కూడా. మూడు రోజుల వరకు అదే గుహలో ఉండి, మదీనాకు బయలుదేరారు. దూర ప్రయాణం, మండే ఎండలో ప్రయాణం సాగుతూ రెండవ రోజు సాయంకాలం ఒక గుడారం నుండి వెళ్ళుచుండగా అక్కడ ఉమ్మె మఅబద్ పేరుగల స్త్రీ ఉండెను. నీ వద్ద తిను త్రాగటకు ఏమై నా ఉందా అని ఆమెతో అడిగారు. నా వద్ద ఏమీ లేదు. ఆ మూలన బలహీన మేక ఉంది. మందతో పాటు నడవలేకపోతుంది. దానిలో పేరుకు మాత్రం పాలు కూడా లేవు అని చెప్పింది. పిదప ఆమె అనుమతి మేరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మేక వద్దకు వెళ్ళి దాని పొదుగును చెయితో తాకగానే అందులో పాలు వచ్చేశాయి. పెద్ద పాత్ర నిండ పాలు పితికారు. ఉమ్మె మఅబద్ మరీ ఆశ్చర్యంగా ఒక వైపు నిలుచుండి బిత్తర పోయింది. ఆ పాలు అందరూ కడుపు నిండా త్రాగారు. మరో సారి పాత్ర నిండా పితికి, ఉమ్మె మఅబద్ వద్ద వదిలి, ప్రయణమయ్యారు.
మదీనవాసులు ప్రతీ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎదిరి చూస్తూ మదీన బైటికి వచ్చేవారు. ప్రవక్త మదీన చేరుకునే రోజు సంతోషం తో, స్వాగతం పలుకుతూ వచ్చారు. మదీన ప్రవేశంలో ఉన్న ఖుబాలో మజిలి చేశారు. అక్కడ నాలుగు రోజులున్నారు. మస్జిదె ఖుబా పునాది పెట్టారు. ఇది ఇస్లాంలో మొట్టిమొదటి మస్జిద్. ఐదవ రోజు మదీన వైపు బయలుదేరారు. అన్సారులో అనేక మంది ప్రవక్త ఆతిథ్య భాగ్యం తనకే దక్కాలని చాలా ప్రయత్నం చేసేవారు. అందుకని ప్రవక్త ఒంటె కళ్ళాన్ని పట్టుకునేవారు. అయితే ప్రవక్త వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వద లండి! దానికి అల్లాహ్ ఆజ్ఞ అయిన చోటనే కూర్చుంటుంది అని చెప్పే వారు. అది అల్లాహ్ ఆజ్ఞ అయిన చోట కూర్చుంది. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దిగలేదు. మళ్ళీ లేచీ కొంత దూరం నడిచింది. తిరిగి వచ్చి మొదటి ప్రాంతంలోనే కూర్చుంది. అప్పుడు ప్రవక్త దిగారు. అదే ప్రస్తుతం మస్జిదె నబవి ఉన్న చోటు. ప్రవక్త అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లా హు అన్హు వద్ద ఆతిథ్యం స్వీకరించారు. అటు అలీ రజియల్లాహు అన్హు ప్రవక్త వెళ్ళాక మూడు రోజులు మక్కాలో ఉండి, ఆ మధ్యలో ప్రవక్త వద్ద ఉన్న అమానతులు హక్కుదారులకు చెల్లించి మదీనకూ బయలు దేరాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుబాలో ఉండగా అక్కడికి వచ్చి కలుసుకున్నాడు.

ఇస్లాం యొక్క ఐదవ కీలకభాగం – కాబా గృహం యొక్క హజ్ చేయడం ׃-

وَللهِ عَلَى النَّاسِ حِجُّ البَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا وَمَنْ كَفَرَ فَإِنَّ اللهَ غَنِيٌّ عَنِ العَالَمِينَ] {آل عمران:97}

ఆలే ఇమ్రాన్ 3׃97׃ “వ లిల్లాహి అలన్నాసి హిజ్జుల్ బైతి మనిస్ తతాఅ ఇలైహి సబీలా, వ మన్ కఫర ఫ ఇన్నల్లాహ గనియ్యున్ అనిల్ ఆలమీన్”
ప్రజలపై అల్లాహ్ కు ఉన్న హక్కు ఏమిటంటే, ఈ గృహానికి(కాబాగృహం) వెళ్లే శక్తి గలవారు దాని హజ్ (యాత్ర) చేయాలి. ఈ ఆజ్ఞను పాలించడానికి తిరస్కరించేవాడు అల్లాహ్ కు ప్రపంచ ప్రజల అవసరం ఎంతమాత్రం లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి

హజ్ లక్ష్యం ఏమిటి? – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథ్ యొక్క భావము ఏమనగా జమరాత్ పై రాళ్ళు విసరడం, సఫా-మర్వాల మధ్య పరుగెత్తడం (సఈ) ఇవన్నీ కేవలం అల్లాహ్ ను స్తుతిస్తూ, (అల్లాహ్) ఆదేశాలను పూర్తి చేయడం కొరకే.
హజ్ యొక్క ప్రాముఖ్యత ׃ బుఖారి మరియు ముస్లిం హదీసు
అన్ అబి హురైర రదిఅల్లాహు అన్హు అన్నన్నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల “మన్ హజ్జ, ఫలమ్ యర్ ఫుస్ వలమ్ యఫ్ సుఖ్, రజఅ కయౌమిన్ వలదత్ హు ఉమ్ముహు”
అనువాదం׃ అబి హురైర రదిఅల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు“ఎవరైతే హజ్ చేసి,హజ్ నందు భార్యతో సంభోగించడం, ఎవరితోనూ తగవులాడడం లాంటివి చేయకపోయినట్లైతే అతడు ఏవిధంగానైతే తల్లి గర్భం నుంచి పరిశుద్ధంగా పాపరహితంగా జన్మించెనో అలాగే హజ్ నుంచి మరలును”
బుఖారి మరియు ముస్లిం హదీథ్׃ అన్ అబి హురైర రదియల్లాహు అన్హు అన్నన్నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల “అల్ ఉమ్రతు ఇలల్ ఉమ్రతి కప్ఫారతున్ లిమా బైనహుమా వల్ హజ్జుల్ మబ్ రూరు లైసలహు జజాఉన్ ఇల్లల్ జన్నతు”
అనువాదం׃ అబి హురైర రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు “ఒక ఉమ్రా మరో ఉమ్రా వరకు జరుగునటువంటి పాపాలకు ప్రక్షాళన. మరియు అల్లాహ్ ప్రసన్నత నొందిన హజ్ కు ప్రతిఫలం స్వర్గం మాత్రమే.”

గమనిక׃ ఘోరపాపాలైన వ్యభిచారం, తల్లిదండ్రుల హక్కుల ఉల్లంఘన మొదలగు పాపాలు పశ్చాత్తాప హృదయంతో క్షమాపణ వేడుకుంటే మాత్రమే ప్రక్షాళన అగును.

హజ్ వలన కలిగే కొన్ని లాభాలు׃
1.అల్లాహ్ యొక్క ఆదేశపాలన జరుగుతుంది.
2.ఇస్లాం సమస్త విశ్వజన మతం అన్న విషయం విశదమవుతుంది.
3. ప్రళయదిన కలయిక తలంపుకు వస్తుంది

2) ఇస్లాం యొక్క రెండవ కీలకభాగం – సలాహ్(నమాజు)ను స్థాపించడం ׃-

ఇస్లాం యొక్క అత్యంత ముఖ్యమైన ఈ కీలకభాగం గురించి వివరంగా తెలుసుకుందాం

ఖుర్ఆన్ లో సలాహ్ (నమాజు) గురించి అల్లాహ్ ప్రకటించిన ఆజ్ఞను తెలుసుకుందాం׃

1. అన్ నిసా 4׃103 సమస్త విశ్వాసులను ఉద్దేశించి అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు
[..إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى المُؤْمِنِينَ كِتَابًا مَوْقُوتًا] {النساء:103}
“ఇన్నస్సలాత కానత్ అలల్ ముఅఁమినీన కితాబన్ మౌఖూతా” – నిశ్చయంగా నమాజు విశ్వాసులపై నిర్ణీత సమయాలలో విధిగాపాటించవలసిన ధర్మం

ఇక సలాహ్ (నమాజు) గురించి వివిధ ప్రవక్తలు చేసిన బోధనలు తెలుసుకుందాం.

2. దివ్యఖుర్ఆన్, ఇబ్రహీం 14׃40 – ఇబ్రహీం అలైహిస్సలామ్ యొక్క ప్రార్ధన
[رَبِّ اجْعَلْنِي مُقِيمَ الصَّلَاةِ وَ مِنْ ذُرِّيَّتِي..] إبراهيم : 40
“రబ్బిఅజ్ అల్ ని ముఖీమస్సలాతి వ మిన్ దుర్రియ్యతి” – “ప్రభూ! నన్ను నమాజు స్థాపించువానిగా చెయ్యి, నా సంతతిలో కూడా ఇలా చేసేవాళ్ళను లేపు”

3. దివ్యఖుర్ఆన్, తాహా 20׃14 మూసా అలైహిస్సలామ్ కు ఇవ్వబడిన ఆదేశం
[…وَ أَقِمِ الصَّلَاةَ لِذِكْرِي .. .] {طه:14}
“వఅఖిమిస్సలాత లిదిక్ రీ” – “నా జ్ఞాపకం కోసం నమాజు స్థాపించు”

4. దివ్యఖుర్ఆన్, మరియమ్ 19׃31 ఈసా అలైహిస్సలామ్ కు ఇవ్వబడిన ఆదేశం
[…‎وَأَوْصَانِي بِالصَّلَاةِ وَالزَّكَاةِ مَا دُمْتُ حَيًّا] {مريم:31}
“వ ఔసాని బిస్సలాతి వజ్జకాతి మా దుమ్తు హయ్యా” – “నా జీవితాంతం నమాజును, జకాతును పాటించు” అని అల్లాహ్ ఆజ్ఞాపించాడు.

5. దివ్యఖుర్ఆన్, అల్ అంకబూత్ 29׃45 ప్రపంచ ప్రజలందరి కోసం పంపబడిన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహిస్సలామ్ కు ఇవ్వబడిన ఆదేశం –
[اتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِنَ الكِتَابِ وَ أَقِمِ الصَّلَاةَ ..] {العنكبوت:45}
“ఉత్ లు మా ఊహియ ఇలైక మినల్ కితాబి వ అఖిమిస్సలాత్” – “వహీ ద్వారా నీ వద్దకు పంపబడిన గ్రంధాన్ని పారాయణం చెయ్యి, నమాజును స్థాపించు”

నమాజు యొక్క ప్రాముఖ్యత ׃

1. దివ్యఖుర్ఆన్ అల్ అంకబూత్ 29׃45
[….إِنَّ الصَّلَاةَ تَنْهَى عَنِ الفَحْشَاءِ وَالمُنْكَرِ وَلَذِكْرُ اللهِ أَكْبَرُ….] {العنكبوت:45}
“ఇన్నస్సలాత తన్ హా అనిల్ ఫహ్ షాఇ, వల్ మున్ కరి, వల దిక్రుల్లాహి అక్బర్” -“నిశ్చయంగా నమాజు అశ్లీల కార్యాల నుండి, చెడు పనుల నుండి నిరోధిస్తుంది. అల్లాహ్ సంస్మరణ దీనికంటే కూడా చాలా గొప్ప విషయం ”

2. దివ్యఖుర్ఆన్ అల్ మఆరిజ్ 70׃34-35
[وَ الَّذِينَ هُمْ عَلَى صَلَاتِهِمْ يُحَافِظُونَ .أُولَئِكَ فِي جَنَّاتٍ مُكْرَمُونَ] {المعارج: 34,35} ]
“వల్లదీన హుమ్ అలా సలాతిహిమ్ యుహాఫిజూన్ ఉలాఇక ఫీ జన్నాతిమ్-ముక్రమూన్” – “తమ నమాజులను కాపాడుకనేవారు-ఇలాంటివారు సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు”

1. బుఖారి మరియు ముస్లిం హదీథ్׃ “అన్ అనసిన్ రదియల్లాహు అన్హు ఖాల – ఫురిదత్ అలా రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం లైలత ఉస్రియ బిహీ అస్సలవాతు ఖంసీన, సుమ్మ నుఖిసత్ హత్తా జుఇలత్ ఖంసా, సుమ్మ నూదియ యా ముహమ్మద్ ఇన్నహూ లాయుబద్దలుల్ ఖౌలు లదయ్య, వ ఇన్నలక బి హాదిహిల్ ఖంసి – ఖంసీన్” – “అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు – ఏ రాత్రి నందు అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం కు మేరాజ్ పయనం ప్రాప్తమైనదో, ఆ రాత్రి ఆయనపై ప్రతిదినం యాభై పూటల నమాజు విధించబడినది. తరువాత తగ్గుతూ తగ్గుతూ చివరికి ఐదు పూటలైనది. అనంతరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను కేకవేస్తూ పెద్ద శబ్దంతో పిలిచి తెలపడమైనది – “ఓ ముహమ్మద్! నా వద్ద మాట మారదు. నిశ్చయంగా ఈ ఐదుపూటల నమాజుకై మీకు – యాభైపూటల నమాజుకు సమానమైన ప్రతిఫలం దొరుకుతుంది”
2. బుఖారి మరియు ముస్లిం హదీథ్׃ అన్ అబి హురైరత రదియల్లాహు అన్హు ఖాల సమిఁతు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహివసల్లం యఖూల్ “అర ఐతుమ్ లౌఅన్న నహరన్ బిబాబి అహదికుమ్ యగ్ తసిలు మిన్ హు కుల్లయౌమిన్ ఖమ్ స మర్రాతిన్ హల్ యబ్ ఖ మిన్ దరనిహి షయ్ఉన్? ఖాలూ – లాయబ్ ఖ మిన్ దరనిహి షయ్ఉన్, ఖాల – ఫదాలిక మసలుస్సలవాతిల్ ఖమ్ సి, యమ్ హుల్లాహు బిహిల్ ఖతాయా” – అబి హురైర రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – నేను ఒకనాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరిస్తుండగా విన్నాను “మీరు తెలుపండి! ఒకవేళ మీలోని ఎవరి వాకిటనుండి అయినా ఏదేని నది ప్రవహిస్తుందనుకోండి, మీరు అందులో ప్రతిరోజూ ఐదుపూటలా స్నానం చేస్తుంటే ఇక మీ శరీరం పై మైలు-మురికి మిగిలి ఉంటాయా?” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు ఎంత మాత్రం ఉండదని జవాబిచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా అన్నారు – “ఇదే ఉపమానం ఐదుపూటలా నమాజుదీను. అల్లాహ్ దీని ద్వారా తన దాసుని పాపాలను రూపుమాపును”
3. హదీథ్ ׃
عَنْ أبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ سَمِعْتُ رَسُولَ الله صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: إِنَّ أَوَّلَ مَا يُحَاسَبُ بِهِ الْعَبْدُ يَوْمَ الْقِيَامَةِ مِنْ عَمَلِهِ صَلَاتُهُ فَإِنْ صَلُحَتْ فَقَدْ أَفْلَحَ وَأَنْجَحَ وَإِنْ فَسَدَتْ فَقَدْ خَابَ وَخَسِرَ. {الترمذي 413}.

అన్ అబూ హురైర రజియల్లాహు అన్హు ఖాల సమిఅఁతు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ యఖూలుః “ఇన్న అవ్వల మా యుహాసబు బిహిల్ అబ్దు యౌమల్ ఖియామతి మిన్ అమలిహీ సలాతుహూ, ఫఇన్ సలుహత్ ఫఖద్ అఫ్లహ వ అంజహ వఇన్ ఫసదత్ ఫఖద్ ఖాబ వ ఖసిర” – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మానవునితో అతని ఆచరణల్లో మొదటి లెక్క, తీర్పు అతని నమాజు గురించి ఉండును. అది బాగుంటే అతడు పాస్ అయి విజయం పొందినట్లే. అది పాడుంటే అతడు నష్టపోయి, మునిగినట్లే”.

1. హదీథ్ ׃ అన్ అబ్దిల్లాహ్ ఇబ్నె ఖుర్ తిన్ రదియల్లాహు అన్హు ఖాల “ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం-అవ్వులు మా యుహాసబు అలైహిల్ అబ్దు యౌమల్ ఖియామతిస్సలాత, ఫఇన్ సలహత్, సలహత్ సాయిర అమలిహి వ ఇన్ ఫసదత్ ఫసద సాయిరు అమలిహి” తబ్రాని – అబ్దుల్లాహ్ ఇబ్నె ఖుర్ తిన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు “ప్రళయదినం నాడు అన్నింటికంటే ముందు దాసునితో తన నమాజును గురించి ప్రశ్నించబడును. ఒకవేళ తన నమాజు సరిగా ఉంటే మిగిలిన అన్ని కార్యాలు సరిగా ఉంటాయి. ఒకవేళ నమాజు విషయంలో కొరత, అసంపూర్ణతలు చోటు చేసుకున్నట్లయితే మిగిలిన అన్ని కార్యాలందునూ కొరత, అసంపూర్ణతలు ఉంటాయి”

7. హదీథ్ ׃
عَنْ بُرَيْدَةَ قَالَ: قَالَ رَسُولُ الله ^: (الْعَهْدُ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمْ الصَّلَاةُ فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ) . {الترمذي 2621 النسائي 459 ابن ماجة 1079}
అన్ బురైదతహ్ రదియల్లాహు అన్హు ఖాల, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం “అల్ అహ్ దుల్లదీ బైననా వ బైనహు ముస్సలాతు,ఫమన్ తరకహా ఫఖద్ కఫర” – బురైదతహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు “మన మధ్య మరియు అవిశ్వాసుల మధ్య గల వ్యత్యాసం నమాజుయే, అంటే ఎవరైతే దాన్ని పూర్తిగా నిర్వర్తించరో వారు తిరస్కారి అగును”

ఇస్లాం యొక్క 4వ కీలకభాగం – శియామ్ – రమదాన్ మాసపు ఉపవాసాలు ׃

ఇలా ఆదేశిస్తున్నారు׃ ఖుర్ఆన్ నందు అల్లాహ్
[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ] {البقرة:183}

అల్ బఖర 2׃183 “యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబ అలైకుముస్సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుమ్ ల అల్లకుమ్ తత్తఖూన్”
“ఓ విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడినది. ఏవిధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించేవారికి కూడా విధించబడినదో. దీనివలన మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది”

ఉపవాసం నిర్వచనం ׃ “ఉపవాసం ఓ ఆరాధన. ఫజ్ర్ (ప్రాత׃కాలం) నుండి మగ్రిబ్ (సూర్యాస్తమయం) వరకు అన్నపానీయాల నుండీ, ఉపవాసమును భంగపరచు ప్రతి విషయమూ, పనులనుండీ మానవుడు దూరముండడమే ఉపవాసం.”

ఉపవాస ప్రాముఖ్యత ׃ బుఖారి మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు –
“అన్ అబిహురైర రదియల్లాహు అన్హు అన్నన్నబియ్య సల్లల్లాహు అలైహివసల్లం ఖాల׃ ఖాలల్లాహు అజ్జవజల్ల – కుల్లు అమలిబ్ని ఆదమ లహు ఇల్లా అస్సియాము, ఫఇన్నహు లి వ అనా అజ్ జీ బిహీ వస్సియాము జున్నతున్, ఫఇదా కాన యౌము సౌమి అహదికుమ్ ఫలా యర్ ఫుస్ యౌమఇదిఁవ్వలా యస్ ఖబ్. ఫఇన్ సాబ్బహు అహదున్, ఔ ఖాతలహు – ఫల్ యఖూల్ ఇన్నిమ్రఉన్ సాయిమున్. వల్లదీ నఫ్సు ముహమ్మదిన్ బియదిహి లఖలూఫు ఫమిస్సాఇమి అత్యబు ఇందల్లాహి యౌమల్ ఖియామతి మిర్రీహిల్ మిస్కి వ లిస్సాఇమి ఫర్హతాని యఫ్ రహు హుమా ఇదా అఫ్ తర ఫరిహ లిఫిత్ రిహి వ ఇదా లఖియ రబ్బహు ఫరిహ బి సౌమిహి”

అబూహురైర రదిఅల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం ఇలా తెలిపారు, అల్లాహ్ అజ్జవ జల్ సూచిస్తున్నారు – “మానవుని ప్రతికార్యం తనకై కాగా ఉపవాసం నా కొరకు కాబట్టి దాని ప్రతిఫలం నేనే ఇస్తాను” వాస్తవానికి ఈ ఉపవాసం ఒక ఢాలు మరియు కవచమూను. కాబట్టి మీలోనుంచి ఏదినమున ఎవరైతే ఉపవాసంతో ఉంటారో వారు ఉపవాసాన్ని భంగం చేయునట్టి ఏ దుర్చేష్టనూ చేయరాదు. అంటే భార్యతో రసక్రియలలో పాల్గనడం, ఎవరితోనైనా దుర్భాషలాడడం చేయరాదు. ఒకవేళ ఎవరైనా వారితో దర్భాషలాడినా, వాదులాడినా, ఉపవాసి ఆ వాదులాడు, దర్భాషలాడు వానితో నేను ఉపవాసిని అనాలి. మరలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు – “ఎవరిచేతిలోనైతే ముహమ్మద్ ప్రాణాలు ఉన్నాయో ఆయన సాక్షిగా – ఉపవాసి నోటివాసన అల్లాహ్ వద్ద ప్రళయ దినాన ముష్క్ (కస్తూరి), అంబర్ ల పరిమళాలకంటే ఎన్నో రెట్లు ఉత్తమమైనదీ మరియు శ్రేష్ఠమైనదీను కానుంది”. ఉపవాసి కొరకు రెండు సందర్భాలు అత్యంత సంతోష కరమైనవి, వాటియందు అతను అమితమైన సంతోషాన్ని పొందుతాడు. వాటిలో మొదటిది – ఉపవాస విరమణా సమయం (ఇఫ్తార్ సమయం)లో ఇఫ్తార్ చేస్తున్నందుకు, రెండవది – తన ప్రభువైన అల్లాహ్ ను కలుసుకునే సమయం. ఆ సమయమునందు తను తన ఉపవాసం మూలంగా అమితమైన సంతోషాన్ని పొందుతాడు.

ఉపవాసం వలన లాభాలు ׃

ఉపవాసం వలన లాభాలు కోకొల్లలు, క్రింద పేర్కొన్న రెండు వాటిలో ముఖ్యమైనవి.

1. మనపై విధిగా గల అల్లాహ్ ఆదేశపాలన జరుగుతుంది.
2. ఈ ఉపవాసంతో విశ్వాసులలో భక్తీశ్రద్ధలు పెరిగి, అల్లాహ్ అనుక్షణం వారిని గమనిస్తున్నాడు అనే భావం పెరిగి, మరింత దృఢమౌతుంది. కాబట్టి అల్లాహ్ ఆదేశానుసారం ఆరాధన నందు సమయం గడిపి , ఆయన నివారించిన వాటినుండి ఉపవాసి దూరంగా ఉంటాడు. అల్లాహ్ ఓర్పు, అంకిత భావనలను ఎరిగినవాడు.

ఉపవాసాన్ని భంగ పరచు విషయాలు׃

ఈ క్రింద తెలిపిన విషయాలు ఉపవాసాన్ని భంగ పరుచును.
1. తినడం, త్రాగడం, పొగత్రాగడం మొదలగునవి.
2. తిను, త్రాగు పదార్దాల కోవకు చెందిన వాటి వినియోగం
3. ఇష్టపూర్వకంగా కావాలని వాంతి చేసుకోవటం
4. ఎక్కవ మోతాదులో రక్తం ఎక్కించడం
5. పురుటి ముట్టు, బహిష్టుల కారణంగా
6. హస్తప్రయోగం లేదా ఏదేని ఇతర విధానం ద్వారా వీర్యం స్కలింపజేసిన (ఉపవాసంలో ఉన్నా, లేకపోయినా ఇటువంటి పనులు పూర్తిగా నిషేధింపబడినవి)
7. భార్యతో రతిక్రియ జరపటం

ఫిత్ ర దానం׃

1. ఆ యా ప్రాంతాలలోని ప్రధాన ఆహారధాన్యంనుంచి ఒక సాఅ దానం చెయ్యాలి.
(ఒక సాఅ అంటే నాలుగుదోశెడులు) ఉదా׃ గోధములు, బియ్యము మొ,,
2. ఈ ఫిత్ ర దానం ప్రతి ముస్లిం పేద-నిరుపేదలకు ఇవ్వాలి.
3. పండుగ రోజుకు ఒకటి లేక రెండుదినాల ముందు నుండి పండుగ నమాజు ప్రారంభమయ్యే లోపల దీనిని పంచిపెట్టాలి.

ఇస్లాం యొక్క మూడవ కీలక భాగం – జకాహ్

ఇది ధనికుల నుండి వసూలు చేసి పేదలకు ఇవ్వబడే ఆర్థిక హక్కు. ఇస్లాంలో నమాజు తర్వాత దీనికే అత్యధిక ప్రాధాన్యం ఉంది. నిర్ణీత సంపద కలిగిన ప్రతి ముస్లిం తన సంపద నుంచి సంవత్సరానికి రెండున్నర శాతం చొప్పున ధనం తీసి నిరుపేదలు, ధర్మసంస్థాపనా కార్యకలాపాల కోసం విధిగా వినియోగించాలి.
[وَ أَقِيمُوا الصَّلَاةَ وَآَتُوا الزَّكَاةَ وَ أَطِيعُوا الرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ] {النور56: 24}
అన్నూర్ 24׃56 “వ అఖీముస్సలాత వ ఆతూజ్జకాత వ అతీఉర్రసూల ల అల్లకుమ్ తుర్హమూన్”
“నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి, సందేశహరునికి విధేయులుగా ఉండండి – అప్పుడే మీరు కరుణించబడతారు”
జకాహ్ నిర్వచనం׃ నిర్ణీత కాలమందు, నిర్ణీత వర్గం వారికి, నిర్ణీత నియమాలకు అనుగుణంగా సంపదనుండి చేయు ఓ విద్యుక్త దానం (త్యాగం).

జకాహ్ చెల్లించడంలో గల లాభాలు ׃
1. అల్లాహ్ ఆదేశపాలన – ప్రతి కోణం నుంచి ప్రతిస్ఫుటింపజేయాలి.
2. పేదల-నిరుపేదల ఉద్ధారణ జరుగుతుంది.
3. దీనిలో మానవుడు, దయా, కరుణ, కనికరం వంటి ఉదారగుణాలను పెంపొందించుకుని, పిసినిగొట్టు వంటి హీనగుణం నుంచి బయటపడతాడు.
జకాహ్ విధిగా గల సంపద ( సొమ్ము) మరియు దాని రకాలు ׃
1. బంగారము, వెండి, నగదు – పూర్తి సంవత్సరకాలం మోతాదుకు మించి నిల్వ ఉన్న ఎడల – ప్రతి సంవత్సరం
2. వర్తక-వాణిజ్య వస్తువులు – ప్రతి సంవత్సరం
3. పశు సంపద – మోతాదుకు మించి ఉన్న పశువులు – ప్రతి సంవత్సరం
4. వ్యవసాయ ఉత్పాదనలు-భూమి నుండి పండించే అన్నిరకాల పంటలు-ప్రతి పంటకు

జకాహ్ పొందు హక్కుదారులు ׃
[ إِنَّمَا الصَّدَقَاتُ لِلْفُقَرَاءِ وَالمَسَاكِينِ وَالعَامِلِينَ عَلَيْهَا وَالمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَ فِي الرِّقَابِ وَ الغَارِمِينَ وَ فِي سَبِيلِ اللهِ وَ اِبْنِ السَّبِيلِ فَرِيضَةً مِنَ اللهِ وَ اللهُ عَلِيمٌ حَكِيمٌ ] {التوبة:60}60 అత్తౌబ ׃ 9

“ఇన్న మస్సదఖాతు లిల్ ఫుఖరాఇ, వల్ మసాకీని, వల్ ఆమిలీన అలైహా వల్ ము అల్లఫతి ఖులూబుహుం వ ఫిర్రిఖాబి వల్ గారిమీన వ ఫీ సబీలిల్లాహి వబ్నిస్సబీలి. ఫరీదతమ్ మినల్లాహి వల్లాహు అలీమున్ హకీం….. ”

“ఈ జకాతు నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అక్కరలు తీరని వారికి, జకాతు వ్యవహారాలకై నియుక్తులైన వారికి, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవడం అవసరమో వారికి, ఇంకా బానిసల విముక్తికీ, రుణగ్రస్తుల సహాయానికీ, అల్లాహ్ మార్గంలోనూ, బాటసారుల (ఆతిథ్యానికీ వినియోగించడం) కొరకు, ఇది అల్లాహ్ తరపు నుండి విధించబడిన ఒకవిధి. అల్లాహ్ అన్నీ తెలిసినవాడూ, వివేకవంతుడూను”

ఇస్లాం పదం యొక్క నిర్వచనం ׃-

ఆజ్ఞల తనకు తాను స్వయంగా ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ కు సమర్పించుకొనుటయే ఇస్లాం. అంటే అల్లాహ్ యొక్క ప్రకారం శాంతియుతంగా జీవిస్తూ, ఆయనకు విధేయుడిగా ఉండటం. ఇంకో మాటలో విధేయతాపరత్యమునే “ఇస్లాం” అని అంటారు. అల్లాహ్ యొక్క ఆదేశాలను సంపూర్ణంగా శిరసావహించడం మరియు వాటిని అత్యంత సాదరంగా, సమర్ధవంతంగా ఆచరించడం.

ఇస్లాం యొక్క కీలకభాగాలు – ఐదు׃
1. అష్షహాదహ్׃ “షహాదతు అఁల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్” “ఆరాధ్యుడు ఎవడూ లేడు ఒక్క అల్లాహ్ తప్ప మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని సాక్ష్యమివ్వడం
2. ఇఖాముస్సలాహ్׃ నమాజు స్థాపించడం
3. ఈత ఉజ్జకాహ్׃ జకాత్ చెల్లించడం
4. సౌము షహ్ రి రమదాన్׃ రమదాన్ మాసపు ఉపవాసములుండడం
5. హజ్జు బైతిల్లాహిల్ హరామ్׃ కాబా గృహం యొక్క హజ్ చేయడం.

రెండవ కీలకభాగమైన నమాజ్ గురించి ఇప్పుడు వివరంగా నేర్చుకుంటాము. మిగిలిన నాలుగు కీలకభాగాల నిర్వచనం మాత్రమే ఈ స్థాయిలో చదువుకుంటాము. అయితే వచ్చే స్థాయిలలో ఒక్కొక్క దాని గురించి పూర్తిగా, వివరంగా చదవుకుందాము.
1) ఇస్లాం యొక్క తొలి కీలక భాగం – అష్షహాద ׃-

[وَمَا خَلَقْتُ الجِنَّ وَالإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] {الذاريات56 :51}
జారియాత్ 51׃56 – “వమా ఖలఖ్ తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లాలి యఁబుదూన్”
“నేను జిన్నాతులనూ మరియు మానవులనూ నా ఆరాధనకు తప్ప మరి దేనికొరకూ సృష్టించలేదు”

[قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَ مَحْيَايَ وَ مَمَاتِي للهِ رَبِّ العَالَمِينَ] {الأنعام 6:162}
అల్ అన్ఆమ్ 162:6 “ఖుల్ ఇన్న సలాతీ, వ నుసుకీ, వ మహ్యాయ, వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్” – (ఓ ప్రవక్తా!) ప్రకటించు “నా నమాజు, నా సకల ఉపాసనారీతులు, నా జీవనం, నామరణం సమస్తమూ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే”

ఆరాధన యొక్క నిర్వచనం ׃ “బహిర్గతమైనదైనా లేక అంతర్గతమైనదైనా అల్లాహ్ కు ప్రీతి ప్రదమైనట్టి ప్రతి పలుకూ, పనీ ఆరాధన అనబడును”

అష్షహాద ׃ సాక్ష్యమిచ్చుట – అష్షహాద అంటే “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్” అని సాక్ష్యమివ్వటం
“అష్ హదు = నేను సాక్ష్యమిస్తున్నాను, అన్ లా ఇలాహ = (వాస్తవమైన) ఆరాధ్యుడు ఎవడూ లేడు, ఇల్లల్లాహు = కేవలం ఒక్క అల్లాహ్ తప్ప, వ = మరియు, అష్ హదు అన్న = నేను సాక్ష్యమిస్తున్నాను, ముహమ్మదుర్రసూలల్లాహ్ = ముహమ్మద్ (సల్లల్లాహుఅలైహివసల్లం) అల్లాహ్ యొక్క సందేశహరుడు
{ప్రపంచంలో ఏ ప్రాంతంవారైనా, పెద్దచిన్న తేడా లేకుండా, స్త్రీపురుష భేదం లేకుండా, బీదగొప్ప తారతమ్యం లేకుండా, ఏ మతం,కులం లేక జాతివారైనా సరే “వాస్తవమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు ఒక్క అల్లాహ్ తప్ప మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని సాక్ష్యమిచ్చినట్లైతే అతడు ఇస్లాం ధర్మం స్వీకరించినట్లు (అంటే సర్వలోక సృష్టికర్తైన అల్లాహ్ కు స్వయంగా సమర్పించుకున్నట్లు) గా పరిగణింపబడును. ఎవరైతే ఇస్లాం స్లీకరించారో వారిని ముస్లిం అంటారు. (ముస్లిం అనే అరబీ భాష పదానికి అర్థం (అల్లాహ్ కు) సమర్పించుకున్నవాడు}

1. ఇస్లాం ధర్మజ్ఞాన ప్రాముఖ్యత : –

1. ఖుర్ఆన్ ద్వారా ఇస్లాం ధర్మజ్ఞాన ప్రాముఖ్యత నిరూపణ –

[ ……..يَرْفَعِ اللهُ الَّذِينَ آَمَنُوا مِنْكُمْ وَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ………. ] {المجادلة58 :11}
“యర్ ఫఇల్లాహు అల్లదీన ఆమనూ మిన్కుమ్ వల్లదీన ఊతుల్ ఇల్మ దరజాత్”

అల్ ముజాదలహ్ 58׃11 – “మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానము ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు”
)وَ قُـل رّبّ زِدْنِي عِلْمـاً ( (طه 114)
తాహా 20׃114 “వ ఖుర్ ర్రబ్బి జిద్ నీ ఇల్ మా”
అనువాదం ׃ మరియు ఇలా ప్రార్ధించు “మా ప్రభూ! నాలో జ్ఞానాన్ని పెంపొందించు”

2. హదీథ్ ద్వారా ఇస్లాం ధర్మజ్ఞాన ప్రాముఖ్యత నిరూపణ –

مَنْ سَلَكَ طَرِيقًا يَلْتَمِسُ فِـيـهِ عِلْمـًا سَهَّلَ اللهُ لَهُ بِهِ طَرِيقًا إِلَى الْجَنَّةِ
అబూహురైరా(రదియల్లాహుఅన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త(సల్లల్లాహుఅలైహివసల్లం) ఇలా ప్రకటించారు “ఎవరైతే జ్ఞానాన్ని అభ్యసించే మార్గాన్ని అనుసరిస్తారో, వారి కోసం అల్లాహ్ స్వర్గమార్గాన్ని సులభతరం చేస్తాడు” ముస్లిం, తిర్మిదీ హదీథ్ గ్రంథాలు

ఫిఖ్ హ్ (తర్కం) యొక్క భాషా నిర్వచనం -”ఏ విషయంలోనైనా లోతుగా దృష్టిసారించడాన్ని మరియు దాని లోతుపాతుల్ని గ్రహించడాన్ని ఫిఖ్ హ్ (తర్కం)” అంటారు.

ఫిఖ్ హ్ (తర్కం) యొక్క పారిభాషికార్ధం – “మానవజీవితంలో తప్పక ఆచరించవలసిన ఇస్లామీయ ఆదేశాలను స్పష్టమైన ఆధారాల ఆధారంగా తెలుసుకోవడం”

ఫిఖ్ హ్ (తర్కం) రెండు అంశాలపై ఆధారపడి ఉంది –
1) ప్రతి ముస్లింకు అల్లాహ్ తో గల సంబంధం (అహ్కాముల్ ఇబాదాత్)-ఒక ముస్లింకు తన సృష్టికర్తతో గల సంబంధాలు అంటే అన్ని రకాల ఆరాధనలు మరియు వాటి ఆదేశాలు తెలుసుకోవటం.
2) ప్రతి ముస్లింకు తన సమాజంతో గల సంబంధం (అహ్కాముల్ ముఆమలాత్) – ఒక ముస్లింకు తన సమాజంతో గల సంబంధాలు అంటే సమాజంలో ఎదురయ్యే ప్రతి విషయం మరియు వాటి ఆదేశాలు. (ఇచ్చిపుచ్చుకోవడం. వర్తకవాణిజ్యాలు మొదలైనవి)

పైన పేర్కొన్న విషయాలను బట్టి, విశదంగా తెలిసింది ఏమనగా ఏ విధంగానైతే ఫిఖ్ హ్ ఆత్మ నిబంధనయో (ఆత్మీయసంబంధమైన నియమావళియో అంటే దాసుని బంధం తన సర్వేశ్వరునితో ఉండడం), అదే విధంగా పౌరనిబంధన కూడా (అంటే ఒక వ్యక్తి వ్యవహారం మరొకనితో ఏ విధంగా ఉండాలి) కాబట్టి ఇస్లామీయ ధర్మచట్టం (షరీఅహ్) మొత్తం సామాజిక, ఆధ్యాత్మిక విషయాలలో అత్యుత్తమ నియమావళిని తెలియజేయటానికే వచ్చిందనేది స్పష్టమౌతున్నది.

ఇస్లామీయచట్టం (షరీఅహ్) & ఇస్లామీయ తర్కశాస్త్రం (ఫిఖ్ హ్) మధ్య గల భేదం:
ఈ రెండింటి మధ్య కొద్దిగా భేదం గలదు. దానిని గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం.

ఇస్లామీయ ధర్మచట్టం(షరీఅహ్):- దైవవాణి అయిన దివ్యఖుర్ఆన్ మరియు చిట్టచివరి దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహుఅలైహివసల్లం) యొక్క ఆచరణలు మరియు సూచనలనే ఇస్లామీయ ధర్మచట్టం(షరీఅహ్) అంటారు. ఇది ఒక నిష్కల్మషమైన మరియు పవిత్రమైన అంశం.

ఇస్లామీయ తర్కశాస్త్రం(ఫిఖ్ హ్):- ఇస్లామీయ చట్టాన్ని లేక ధర్మశాసనాన్నిఅర్థం చేసుకుని, దానిని విపులీకరించడానికి ధర్మవేత్తలు పాటించిన పద్ధతినే ఇస్లామీయ తర్కశాస్త్రం (ఫిఖ్ హ్) అంటారు. కాబట్టి ఇస్లామీయ చట్టపు (షరీఅహ్) అంశాలను అర్ధం చేసుకోవడం, అవగాహన చేసుకోవడంలో ఒక ధర్మవేత్తకు మరొక ధర్మవేత్తకు మధ్య కొన్ని అభిప్రాయభేదాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాని ఏ ధర్మశాస్త్రవేత్తా ఖుర్ఆన్, సహీహదీథ్ లకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను ఎటువంటి పరిస్థితిలోనూ వ్యక్తం చెయ్యలేదు. సహీహదీథ్ ఆ సమయంలో వారికి చేరకపోవటం వలన వారి అభిప్రాయాలు ఆ సహీహదీథ్ కు భిన్నమై ఉండవచ్చు.

ఇస్లామీయ ధర్మచట్టం (ధర్మశాస్త్రం – షరీఅహ్) యొక్క మూలాధారాలు:- నాలుగు.
ఖుర్ఆన్ – ఆఖరి దివ్యగ్రంథం, దైవవాణి
సున్నహ్ – ప్రవక్త పాటించిన, ఆదేశించిన, అనుమతించినవి
ఇజ్ మాఁ – ఏకాభిప్రాయం
ఖియాస్ – పోలిక, సమతూకం

విషయాన్ని అర్థం చేసుకునే దిశలో వేర్వేరు అభిప్రాయాల ఆరంభం :-

అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు ఉత్పన్నమౌతుంటాయి. వీటి విషయంలో మూలగ్రంధాలైన ఖుర్ఆన్ మరియు హదీథ్ లలోని వివరణ, పరిష్కారం స్పష్టంగా అర్థంచేసుకోలేకపోవచ్చు. అంటే కొన్ని ప్రత్యేక సమస్యల యొక్క నిర్ధారణాధారాలు వాటిలో అర్థం కాకపోవచ్చు. లేదా ఏకాభిప్రాయం ఉన్నటు వంటి ఆధారమూ కనబడకపోవచ్చు. అటువంటప్పుడు దాని గురించి స్పష్టమైన తీర్పు, పరిష్కారం తెలుసకొనుటకు ఇజ్తిహాద్ (అంటే ఏదైనా సమస్యకు ధార్మిక పరిష్కారం ఏమిటో తెలుసుకొనుటకు చిత్తశుద్ధితో ఖుర్ఆన్, హదీథ్ మరియు ప్రవక్త సహచరుల ఆదేశాల్లో తీవ్రంగా గాలించుట మరియు ఆలోచించుట) తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంటుంది. ఇటువంటి సంఘటన స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత కాలమందు కూడా తలెత్తినది. ఖంధక్ యుద్ధం తర్వాత, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులకు ఇలా ఆజ్ఞాపించారు “మీలో ఏ ఒక్కరూ అస్ర్ నమాజు చదవకండి, కానీ బనూ ఖురైజా చేరాక” వెంటనే వాళ్ళందరూ బను ఖురైదా వైపునకు ప్రయాణం మొదలు పెట్టారు. బనుఖురైదా నివాసస్ధలం చేరకముందే అస్ర్ నమాజు సమయం దాటి పోతుందనేది స్పష్టమైపోయినది. దారిలోనే నమాజు పూర్తిచేయాలా లేక బనుఖురైదా నివాసస్ధలం చేరాలా అనే విషయం వారిని సందిగ్ధంలో పడవేసినది. అప్పుడు కొందరు అక్కడే నమజు పూర్తిచేశారు. అస్ర్ సమయం దాటిపోతుందన్న భయం చేత వీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాన్ని ఆలస్యం చేయకుండా త్వరగా నడవండి అనే ఆదేశంగా భావించారు.

మరి కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాక్యాలను యధాతధంగా గ్రహించి భావప్రమేయం లేకుండా ఏకధాటిగా ప్రయాణం చేసి, గమ్యస్ధానానికి చేరుకుని అసర్ నమాజు పూర్తిచేశారు. ఈ రెండువర్గాల భేదాభిప్రాయాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు తెలిసిన తర్వాత వారు ఎవరినీ దోషులనలేదు.

పైన వివరించినట్లుగా సహీహదీథ్ లన్నీ ఆధర్మవేత్తలకు చేరకపోవటమే వారి మధ్య కలిగిన అభిప్రాయభేదాలకు ప్రధాన కారణం. ఇంకా మూలగ్రంధాలను అర్ధం చేసుకోవడం, అవగాహన చేసుకోవడంలో తేడాలు కూడా అభిప్రాయభేదాలు లేవనెత్తే కారణాలలో ప్రధానమైనవి. అలాగే సహీహ్(సత్యమైన), హసన్ (ఉత్తమమైన), దయీఫ్(బలహీనమైన) మొదలగు హదీథ్ ల నిర్ధారణ క్రమాలను, భావాన్ని స్పష్టమైన పద్దతిలో గుర్తించక పోవడం కూడా అభిప్రాయభేదాలకు కారణమైనది.

ఫిఖ్ హ్(తర్క) శాస్త్ర అధ్యయన కేంద్రాల ఆవిర్భావం :-

ప్రారంభకాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరగణంలో అభిప్రాయభేదాల ప్రభావం ఎంత మాత్రమూ ఉండేదికాదు. కారణం – వారి మధ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఉండేవారు మరియు ప్రతి విషయాన్ని వారికి పునB విశదీకరిస్తూ కూలంకషంగా ఆజ్ఞలను వెలువరిస్తుండేవారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణానంతరం వారి అనేక సహచరులు వేర్వేరు నగరాలలో, ప్రాంతాలలో వెళ్ళి స్థిరపడ్డారు. అక్కడ వారు, వారి వారి అభిప్రాయాలను ఖుర్ఆన్, హదీసుల ద్వారా వెలుబుచ్చుతూ వచ్చారు. కాని సహచరుల తర్వాత కాలంలోని వారు (ఎక్కడైతే సహీహదీథ్ అందలేదో అక్కడ) తమ అభిప్రాయాలు తెలిపి, ఆ అభిప్రాయాన్ని సహీ హదీథ్ తో సరిచూసుకోనంత వరకు తమ అభిపాయాలు ప్రామాణికమైనవి కాజాలవని ప్రకటించేవారు. కాని వారి తర్వాత కాలంలోని ప్రజలు, ఆ ధర్మవేత్తల అభిప్రాయాలకే అమితంగా విలువనిచ్చి, సహీహదీథ్ లపై నిజమైన శ్రద్ధ చూపలేదు. ఈ విధంగా ప్రసిద్ధి చెందిన నలుగురు (క్రింద తెలుపబడిన) ధర్మవేత్తల పేర్ల మీదుగా నాలుగు వర్గాలు ఆవిర్భవించాయి.

1)ఇమాం అబు హనీఫా (నోఁమాన్ బిన్ థాబిత్) రహిమహుల్లాహ్ 080హి – 150హి

2) ఇమాం మాలిక్ బిన్ అనస్ రహిమహుల్లాహ్ 093హి – 170హి

3) ఇమాం ముహమ్మద్ బిన్ ఇద్రీస్ అల్-షాఫఇ రహిమహుల్లాహ్ 150హి – 204హి

4) ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ 164హి – 241హి

పైన పేర్కొన్న ధర్మవేత్తలలో కొందరు ఒకరికొకరు గురుశిష్యులు, ఒకరితో ఇంకొకరు సంబంధం కల్గినవారు. ఇంకా వారందరూ ఒకరినొకరు అమితంగా ఆదరించుకునేవారు

గమనిక׃- ప్రతి ముస్లిం సహోదరుడు ఏదో ఒక వర్గాన్ని ప్రత్యేకించి అనుసరించవలసిన విధి లేదన్న విషయం గ్రహించాలి. ఇస్లాం మూలసిద్ధాంతాలలో ముస్లిం సమాజం వర్గాలుగా, కూటములుగా విభజింపబడటం పూర్తిగా నిషేధింపబడినది. అందుచే వాస్తవిక ధర్మశాస్త్రాలైన దివ్యఖుర్ఆన్ & సహీహదీథ్ లకు మనస్పూర్తిగా ప్రాముఖ్యత నిచ్చి, వాటి జ్ఞానాన్ని సంపాదించి, ఆచరించి, ఇతరులకు తెలియజేయటానికి శాయశక్తులా కృషి చెయ్యాలి. కేవలం దీని ద్వారా మాత్రమే బాధాకరమైన, కఠినమైన నరకశిక్ష నుండి తప్పించుకోగలరు.

ఇస్లాం యొక్క మూలస్థంభాలు

అల్లాహ్ యొక్క అంతిమ సందేశహరుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు%
“ఇస్లాం ఐదు విషయాలపై ఆధారపడి ఉన్నది% వాస్తవానికి అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడు ఇంకెవ్వరూ లేరని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యం పలకటం, నమాజు స్థాపించటం, జకాత్ (విధిదానం) చెల్లించటం, హజ్ చేయటం మరియు రమదాన్ నెల ఉపవాసాలు ఉండటం” కాబట్టి, ఇస్లాం యొక్క మూలస్థంభాలు ఐదు. అవి%
1. వాస్తవానికి ‘అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడు ఇంకెవ్వరూ లేరని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు’ అని సాక్ష్యం పలకటం.
2. ఐదుపూటల తప్పనిసరి నమాజులు స్థాపించటం.
3. జకాత్ (విధిదానం) ఇవ్వటం.
4. హజ్ చేయటం.
5. రమదాన్ నెల ఉపవాసాలు పాటించడం.
మొదటి మూలస్థంభం (1st Pillar) : సాక్ష్యప్రకటన
అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధ్యులు (ఆరాధింపబడే అర్హతలు గలవారు) లేరనీ మరియు నిస్సందేహంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడనీ సాక్ష్యమివ్వటం.
ఇస్లాం ధర్మం యొక్క మూలాధారం – లా ఇలాహ ఇల్లల్లాహ్. ఇస్లాం ధర్మం మూలస్థంభాలలోని మొట్టమొదటి మూలస్థంభమిది. ఇది విశ్వాసపు (ఈమాన్) శాఖలన్నింటిలో అత్యుత్తమమైన శాఖ. అల్లాహ్ తన సందేశహరులందరికీ ఈ పవిత్ర వచనాన్నే బోధించమని పంపినాడు. వారందరిలో అంతిమంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపబడినారు. లా ఇలాహ్ ఇల్లల్లాహ్ యొక్క సరైన అర్థము ఏమిటంటే ‘వాస్తవానికి అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడెవ్వరూ లేరు’. దీనిలో రెండు భాగాలున్నాయి:
1. నిరాకరణం: ‘లా ఇలాహ’ – ఈ పదం ఇతర దేవుళ్ళందరినీ, ఆరాధ్యులనందరినీ తిరస్కరించమని ప్రకటిస్తున్నది.
2. స్వీకరణం: ‘ఇల్లల్లాహ్’ – ఈ పదం ‘ఎటువంటి సాటీ లేని మరియు భాగస్వామ్యమూ లేని అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకూ అర్హుడు మరియు యోగ్యుడు’ అని ప్రకటిస్తున్నది. కాబట్టి కేవలం అల్లాహ్ మాత్రమే ఏకైక ఆరాధ్యుడు. ఇంకా ప్రతి ఆరాధనా కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకింపబడినది గాని వేరొకరికి కాదు. కాబట్టి సజ్దా, ప్రార్థన, పశుబలి మరియు మొక్కుబడులు మొదలైనవన్నీ అల్లాహ్ కు కాకుండా ఇంకొకరికి అర్పించడమనేది అనుమతింపబడలేదు. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే ఈ పవిత్ర వచనం ప్రకారం మూడు రకాల ప్రజలు ఉన్నారు.
3. సాక్ష్యప్రకటనను పూర్తిగా అర్థం చేసుకుని, దాని షరతులను అనుసరించే జీవితం గడపటాన్ని మనస్పూర్తిగా స్వీకరించి, సంపూర్ణ విశ్వాసంతో ఈ పవిత్ర వచనాల్ని పలికేవారు – వీరే నిజమైన ముస్లింలు.
4. దీనిని సంపూర్ణంగా విశ్వసించక జీవితం గడిపేవారు – వీరే కపట ముస్లింలు.
5. దీనిని తిరస్కరించి, దీనికి వ్యతిరేకంగా మరియు విరుద్ధంగా జీవితం గడిపేవారు – వీరే సత్యతిరస్కారులు (కాఫిర్లు) మరియు బహుదైవారాధకులు (ముష్రికులు).
సాక్ష్యప్రకటన రెండవ భాగం ‘ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్, అల్లాహ్ యొక్క దాసుడని, అంతిమ సందేశహరుడని, ఆయన ప్రపంచ ప్రజలందరి వైపునకు మరియు విశ్వాసులందరి వైపునకు సత్యసందేశంతో పంపబడినారని’ మనస్పూర్తిగా విశ్వసించమని ప్రకటిస్తున్నది. ఆయన ఆదేశాలను అనుసరించటం మనకు అనివార్యమై ఉన్నది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:
وَمَا آَتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانْتَهُوا (7) …
“ప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికి పోకండి.” (సూరతుల్ హష్ర్ 59:7)
రెండవ మూలస్థంభం (2nd Pillar) : నమాజ్
ఇస్లాం ధర్మం యొక్క మూలస్థంభాలలో రెండవ మూలస్థంభం ‘నమాజ్’. స్పృహలో ఉన్న, యోగ్యుడైన ప్రతి ముస్లిం దీనిని తప్పని సరిగా చేయవలసి ఉన్నది. దీనిని వదిలి వేసిన వారు ఇస్లామీయ పండితుల ఏకాభిప్రాయం ప్రకారం సత్యతిరస్కారులుగా (కాఫిర్లుగా) పరిగణింపబడుదురు. తీర్పుదినాన మొట్టమొదట నమాజు గురించే ప్రశ్నింప బడును.
కాబట్టి ప్రతి ముస్లిం ఐదు పూటల నమాజులను తప్పనిసరిగా పూర్తిచేయవలెను – పురుషులు మస్జిదులలో సామూహికంగా, మహిళలు తమ తమ ఇళ్ళలో.
ఐదు పూటలా తప్పనిసరిగా చేయవలసిన ఫర్జ్ నమాజుల రకాతులు:
ఉదయం (ఫజ్ర్): రెండు రకాతులు
దొహర్: నాలుగు రకాతులు
అసర్: నాలుగు రకాతులు
మగ్రిబ్ : మూడు రకాతులు
ఇషా: నాలుగు రకాతులు.
నమాజు పద్ధతి, దానికి ముందు పాటిచవలసిన శుచీశుభ్రతల గురించి రాబోయే అధ్యాయంలో వివరించ బోతున్నాము.
మూడవ మూలస్థంభం (3rd Pillar) : జకాత్ దానం
జకాత్ (విధిదానం) – ఇస్లాం ధర్మం యొక్క మూడవ మూలస్థంభం. ఎవరైనా ముస్లిం ఆర్థికంగా నిర్ణీత స్థాయికి చేరుకుని ఒక సంవత్సర కాలం పూర్తి చేసినట్లయితే, అతనిపై జకాత్ దానం అనివార్యమై పోతుంది. అర్హతకు చేరుకున్న ముస్లింలు జకాత్ దానం తప్పనిసరిగా ఇవ్వవలసి ఉందనే అల్లాహ్ ఆదేశాన్ని నిరాకరించితే, వారు సత్యతిరస్కారులు (కాఫిర్లు) అయిపోతారు మరియు ఇస్లాం నుండి బహిష్కరింపబడిన వారైపోతారు.
జకాత్ దానం తప్పని సరిగా చెల్లించవలసిన సంపద:
బంగారం, వెండి, వ్యాపార సామగ్రి, పశుసంపద, భూమిలో పండే ధాన్యం, గోధుమలు, పళ్ళుఫలాలు మొదలైన పంటలు, భూమిలో లభించే గనులు, నిధినిక్షేపాలపై జకాత్ పన్ను అనివార్యమై ఉన్నది. బంగారం మరియు వెండి ఒక నిర్ణీత తూకానికి (నిసాబ్ కు) చేరుకున్న తరువాతనే వాటిపై జకాత్ తప్పనిసరి అవుతుంది. అంటే బంగారం కనీస బరువు 85 గ్రాములు మరియు వెండి కనీస బరువు 595 గ్రాములు. ఎవరి వద్దనైనా ఈ కనీస బరువున్న బంగారం గానీ లేదా వెండి గానీ లేదా ఇతర సంపదలు గానీ ఒక పూర్తి సంవత్సర కాలం పాటు నిలువ ఉన్నట్లయితే, వారు నిర్ణీత జకాత్ ధనం దానం చేయవలసి ఉంటుంది.
అలాగే అతని వద్ద నిర్ణీత నిసాబ్ స్థాయిని దాటి, సంవత్సర కాలం పాటు క్యాష్ రూపంలో (85 గ్రాముల బంగారపు విలువ కంటే ఎక్కువ) ధనం నిలువ ఉంటే, దానిపై కూడా అతను జకాత్ తప్పనిసరిగా చెల్లించవలసి ఉన్నది. ప్రతిముస్లిం తన వద్ద నిర్ణీత మోతాదుకు చేరి, పూర్తి సంవత్సరకాలం పాటు నిలవున్న బంగారం, వెండి మరియు ధనంపై 2.5% జకాత్ చెల్లించటం తప్పని సరి.
నాలుగవ మూలస్థంభం (4th Pillar): రమదాన్ ఉపవాసాలు
ఫజర్ వేళ ప్రారంభం కాక మునుపు నుండి సూర్యాస్తమయం అయ్యే వరకు, ఆహారపానీయాల నుండి, దంపతుల రతిసంభోగం నుండి మరియు ఉపవాసాన్ని భంగపరచే ప్రతి ఒక్క చర్య నుండి దూరంగా ఉండటాన్నే ఉపవాసం అంటారు. రమదాన్ ఉపవాసాలు తప్పని సరిగా పాటించవలసియున్నది. క్రింది మూడు షరతులు వర్తించే ప్రతి ముస్లిం రమదాన్ నెల ఉపవాసాలు తప్పనిసరిగా ఉండవలసియున్నది.
రమదాన్ మాసపు ఉపవాసాలు తప్పనిసరి చేసే షరతులు:
1. ముస్లిం అయి ఉండాలి.
2. బుద్ధిగలవాడై ఉండవలెను – మతిస్థిమితం తప్పినవాడు కాకూడదు.
3. ఆరోగ్యవంతుడై ఉండవలెను – వ్యాధిగ్రస్థుడు కాకూడదు.
4. స్థిరనివాసితుడై ఉండవలెను – ప్రయాణికుడు కారాదు.
5. ఉపవాసం ఉండగలిగే శక్తిసామర్ధ్యాలు కలిగిన వాడై ఉండవలెను.
6. ఋతుస్రావం మరియు పురుటిస్రావములలో లేని పరిశుద్ధ స్త్రీలు.
ఐదవ మూలస్థంభం (5th Pillar) : హజ్ యాత్ర.
హజ్ ఆదేశం మరియు దాని ఔన్నత్యం.
తగిన ఆర్థిక స్తోమత మరియు శక్తిసామర్థ్యాలు కలిగిన ప్రతి ముస్లిం స్త్రీపురుషులు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పని సరిగా హజ్ చేయవలెను. ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాలలో ఇది చివరిది. హజ్ యాత్ర అల్లాహ్ కు అతిదగ్గరగా చేర్చే ఆచరణలలోని ఒక ప్రత్యేక ఆచరణ. అల్లాహ్ యొక్క అంతిమ సందేశహరుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు:
“ఎవరైతే హజ్ దినాలలో ఎలాంటి చెడు పనీ చేయకుండా, భార్యతో కలవకుండా హజ్ పూర్తిచేసారో, అటువంటి వారు అప్పుడే తన తల్లి నుండి జన్మించిన శిశువు మాదిరి (పాపరహితంగా) స్వచ్ఛంగా మరలుతారు.” బుఖారీ హదీథు గ్రంథం.
హజ్ షరతులు:
క్రింది షరతుల కారణంగా మానవుడిపై హజ్ తప్పనిసరి అవుతుంది.
1. ఇస్లాం
2. యుక్తవయస్సు
3. మతిస్థిమితం కలిగి ఉండవలెను.
4. తగిన శక్తిసామర్థ్యాలు మరియు హజ్ ప్రయాణ ఖర్చులు భరించే శక్తి కలిగి ఉండవలెను. అంతేకాక తనపై ఆధారపడిన వారి ఖర్చులు హజ్ ప్రయాణానికి ముందుగానే వారికి ఇవ్వగలిగే స్థితిలో ఉండవలెను. శక్తిసామర్థ్యాల విషయంలో ప్రయాణమార్గం శాంతియుతంగా ఉండటం మరియు ఆరోగ్యం కూడా ఉన్నాయి. కాబట్టి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి హజ్ యాత్ర చేయకూడదు. అలాగే తనతో మహ్రమ్ (భర్త లేదా పెళ్ళికి శాశ్వతంగా నిషేధింపబడిన వ్యక్తి) తోడుగా లేని స్త్రీ కూడా హజ్ యాత్రలో పాల్గొనకూడదు.

విశ్వాసం (ఈమాన్) యొక్క మూలస్థంభాలు

భాషాపరంగా ఈమాన్ అంటే సత్యమని నమ్మటం, పూర్తిగా విశ్వసించటం. ఇస్లామీయ పరిభాషలో ఈమాన్ అంటే అల్లాహ్ సందేశాల్ని, ఆయన ఆదేశించిన ఆరాధనలను మనస్ఫూర్తిగా సత్యమని నమ్మటం, నాలుక ద్వారా వాటిని ధృవీకరించటం మరియు అవయవాల ద్వారా వాటిని ఆచరించటం.
ఖుర్ఆన్ మరియు హదీథులలో తెలుపబడిన ఇస్లామీయ మూలాధారాల్ని (అఖీదహ్ ను) అనుసరించి ఈమాన్ మూలస్థంభాలు (pillars) ఆరు. ఈ మొత్తం ఆరింటినీ విశ్వసించటం తప్పని సరి. వీటిలో ఏ ఒక్క దానిని విశ్వసించక పోయినా, ఈమాన్ అంతమై పోయినట్లే. ‘విశ్వాసం యొక్క ఈ ఆరు మూలస్థంభాలు’ ఏవిటంటే –
1. అల్లాహ్ పై విశ్వాసం
2. మలాయికలపై (దైవదూతలపై) విశ్వాసం
3. దివ్యగ్రంథాలపై విశ్వాసం
4. సందేశహరులపై విశ్వాసం
5. అంతిమదినం పై విశ్వాసం
6. అల్ ఖదర్ (పూర్వనిర్దిష్ట విధివ్రాత)పై విశ్వాసం.
1. అల్లాహ్ పై విశ్వాసం:
అంటే వాస్తవానికి ‘కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధ్యుడు, అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ ఆ యోగ్యత లేదు’ అని మనస్పూర్తిగా నమ్మటం. ఎందుకంటే మానవులను సృష్టించేదీ, వారిని పోషించేదీ, వారిపై దయ చూపేదీ, ప్రతి విషయంలో వారికి మార్గదర్శకత్వం వహించేదీ ఆయనే. ఇంకా వారి ఆంతరంగిక మరియు బహిర్గత విషయాలు ఎరిగినవాడూ, వారి ఆచరణల లెక్కలు తీసుకునేవాడూ ఆయనే. పాపాత్ములను వారి చెడు పనుల కారణంగా శిక్షిస్తాడు మరియు పుణ్యాత్ములను వారి మంచి పనుల కారణంగా సత్కరిస్తాడు. సృష్టించగలిగే సామర్ధ్యం ఆయనకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. అంతేకాక ఆయన తప్ప ఇంకో యజమాని లేడు. మానవులు ఇహపరలోకాలలో సాఫల్యం పొందటం కొరకు అవసరమైన మార్గదర్శకత్వం చేసినాడు. దీని కొరకు అనేక మంది ప్రవక్తలను మరియు అనేక దివ్యగ్రంథాలను వివిధ కాలాలలో, వివిధ ప్రాంతాలలో పంపినాడు.
అంతేకాక ఇస్లాం ధర్మం యొక్క ఏ మూలస్థంభాలనైతే ఆయన తన దాసులకు తెలిపినాడో, వాటిని తప్పనిసరిగా వారు విశ్వసించ వలెను. ఉదాహరణకు నమాజు, ఉపవాసం, హజ్ మరియు జకాత్ విధిదానం. అంతేకాక ఇస్లామీయ ధర్మశాసనం (షరిఅహ్) లోని ఇతర విషయాలను కూడా విశ్వసించవలెను. ప్రార్థనలు, దుఆలు, ఆశించటం, ఖుర్బానీ మరియు మన్నతులు/మొక్కుబడులు కోరటం వంటి అన్ని రకాల ఆరాధనలను కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించ వలసియున్నది. ఆరాధనల అసలు వాస్తవికత ఇదే.
ఇంకా అల్లాహ్ పై విశ్వాసం చూపటంలో ఖుర్ఆన్ మరియు హదీథులలో తెలుపబడిన అల్లాహ్ శుభనామాలు, దివ్యగుణాలను విశ్వసించటం కూడా ఉన్నది. దానితో పాటు వాటి యోగ్యతలకు అనుగుణంగా వాటి ఔన్నత్యాన్ని స్వీకరించవలసి యున్నది మరియు వాటికి ప్రత్యేకస్థానం ఇవ్వవలసియున్నది. అంతేకాక ఆ శుభనామాలు మరియు దివ్యగుణాలను సృష్టితాలకు అస్సలు ఆపాదించకూడదు.
అల్లాహ్ యొక్క నిదర్శనాలు స్వయంగా మనలో మరియు ఈ సమస్త సృష్టి యొక్క ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నాయి. ఆయన యొక్క మహోన్నత్వాన్ని మరియు అత్యున్నతమైన వివేకాన్ని గుర్తించటం కొరకు తమ జ్ఞానాన్నీ మరియు తెలివితేటలనూ వినియోగించమని ఖుర్ఆన్ లో అనేక చోట్ల అల్లాహ్ ఆదేశించినాడు.
తౌహీద్ భాగాలు:
తౌహీద్ అంటే ఏకత్వం. ఇది మూడు భాగాలుగా విభజింపబడినది:
1. తౌహీదె రుబూబియత్ (అల్లాహ్ యే ఏకైక సార్వభౌముడు)
2. తౌహీదె ఉలూహియత్ (అల్లాహ్ యే ఏకైక ఆరాధ్యుడు)
3. తౌహీదె అస్మావస్సిఫాత్ (శుభనామాలు-దివ్యగుణాలన్నీ కేవలం అల్లాహ్ కే చెందును)
1. తౌహీదె రుబూబియత్ (అల్లాహ్ యే ఏకైకసార్వభౌముడు ప్రభువు): అల్లాహ్ యే సృష్టిలోని ప్రతి దానినీ సృష్టించేవాడూ, పోషించే వాడూ, పరిపాలించేవాడూ, ప్రాణం పోసేవాడూ, ప్రాణం తీసేవాడూ ఆయనే. ఆయన సార్వభౌమత్వానికి సంబంధించి విశ్వసించ వలసిన విషయాలన్నీ ఈ భాగంలోనికి వస్తాయి.
2. తౌహీదె ఉలూహియత్ (అల్లాహ్ యే ఏకైక ఆరాధ్యుడు): ‘సకల ఆరాధనలకు కేవలం అల్లాహ్ మాత్రమే అర్హుడు’ అని విశ్వసించి, ఆచరించ వలసిన విషయాలు ఈ భాగంలోనికి వస్తాయి. కాబట్టి అన్నిరకాల ఆరాధనలను అల్లాహ్ కు మాత్రమే సమర్పించు కోవలెను. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. ఇక్కడ ఆరాధనలంటే – ప్రార్థించటం, భయపడటం, నమ్మటం … మొదలైనవన్నీ. కాబట్టి మనం కేవలం ఆయన్నే ప్రార్థించవలెను, భయపడవలెను, నమ్మవలెను, సహాయం అర్థించవలెను, శరణు వేడుకోవలెను. దీనిని బోధించటానికే ప్రవక్తలు, సందేశహరులు వచ్చారు. దీని గురించి అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రకటిస్తున్నాడు –
وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اُعْبُدُوا اللهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ …… (36)

“మరియు వాస్తవానికి మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను ‘మీరు కేవలం అల్లాహ్ నే ఆరాధించండి మరియు మిథ్యాదైవాల (తాగూతుల) ఆరాధనలను త్యజించండి’ అనే సందేశంతో పంపాము.” (ఖుర్ఆన్ 16:36)
తాగూతులంటే అల్లాహ్ కాకుండా, ఆరాధింపబడే మిగిలినవన్నీ. అల్లాహ్ యే ఏకైక ఆరాధ్యుడనే తౌహీద్ యొక్క ఈ భాగాన్నే నూతన మరియు ప్రాచీన అవిశ్వాసులు అంటే సత్యతిరస్కారులందరూ తిరస్కరించారు. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు –
أَجَعَلَ الآَلِهَةَ إِلَهًا وَاحِدًا إِنَّ هَذَا لَشَيْءٌ عُجَابٌ (5)

“ఏమిటీ! ఇతను (ప్రవక్త) దైవాలందరినీ ఒకే దైవంగా చేసాడా? నిశ్చయంగా ఇది ఎంతో విచిత్రమైన విషయం!” (ఖుర్ఆన్ 38:5)
3. తౌహీదె అస్మావస్సిఫాత్: అల్లాహ్ యొక్క శుభనామాలన్నింటినీ మరియు దివ్యగుణాలన్నింటినీ ఖుర్ఆన్ మరియు హదీథులలో ఉన్నట్లుగా ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా విశ్వసించటం. ఉదాహరణకు అల్లాహ్ యొక్క పేర్లు అల్ హయ్య్ మరియు అల్ ఖయ్యూమ్ – మన బాధ్యత ఏమిటంటే అల్లాహ్ శుభనామాలలో హయ్యు అనేది కూడా ఒకటని నమ్మవలెను. అంతేకాక ఆ శుభనామం యొక్క విశిష్ఠతను కూడా మనం తప్పకుండా నమ్మవలెను. అంటే అల్లాహ్ ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాడు మరియు ఆయనకు మరణం అస్సలు లేదు.
2. మలాయికలపై (దైవదూతలపై) విశ్వాసం:
‘మలాయికలపై విశ్వాసం’ అంటే ‘దైవదూతల ఉనికిని మనస్పూర్తిగా విశ్వసించటం’అని అర్థం. అల్లాహ్ సృష్టించిన ప్రాణులలో కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించే, ఎల్లప్పుడూ ఆయననే కొనియాడుతూ ఉండే మరియు ‘అల్లాహ్ ఆజ్ఞాపించే ఏ పనినీ అస్సలు తిరస్కరించని, అల్లాహ్ యొక్క ప్రతి ఆదేశాన్ని తూ.చ. తప్పక పాటించే’ ప్రత్యేక సృష్టియే మలాయికలు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ యే దైవదూతల పేర్లు మనకు తెలిపారో, వారందరినీ మనం తప్పక విశ్వసించవలసి ఉన్నది. ఉదాహరణకు జిబ్రయీలు మరియు మీకాయీలు మొదలైన దైవదూతల పేర్లు. ఇదేవిధంగా వారి ప్రాకృతిక విశేషణాలను కూడా విశ్వసించటం అనివార్యమై ఉన్నది. అల్లాహ్ వాటిని కాంతితో సృష్టించాడని, వాటికి అనేక రెక్కలుంటాయని, ఆ రెక్కల సంఖ్య వేర్వేరుగా ఉంటుందని తెలియ జేయబడిన వాస్తవాల విషయాలను మనం విశ్వసించవలెను. ఇదే విధంగా ఖుర్ఆన్ మరియు హదీథులలో వారి ఏయే పనుల గురించి చర్చించబడినదో, దానిని విశ్వసించవలెను. ఉదాహరణకు – అలసట ఎరుగకుండా, రాత్రీపగలు వారు అల్లాహ్ నే ఆరాధిస్తూ, స్మరిస్తూ, ధ్యానిస్తూ ఉండటం మొదలైనవి. అలాగే వేర్వేరు దైవదూతలు వేర్వేరు పనులలో నిమగ్నమై ఉన్నారని విశ్వసించవలెను. ఉదాహరణకు –
 అర్ష్(అల్లాహ్ సింహాసనం) పైకెత్తి పట్టుకునుండే దైవదూతల పని.
 వహీ (దైవవాణి – అల్లాహ్ యొక్క దివ్యసందేశాం) అందజేసే పని కేటాయించబడిన జిబ్రయీలు దైవదూత.
 వర్షం కురిపించే పని కేటాయించబడిన మీకాయీలు దైవదూత.
 ప్రళయదినాన శంఖం ఊదే పని కేటాయించబడిన దైవదూతలు.
 నరకపు ద్వారపాలకుల పని కేటాయించబడిన దైవదూతలు.
 స్వర్గపు ద్వారపాలకుల పని కేటాయించబడిన దైవదూతలు.
3. దివ్యగ్రంథాలపై విశ్వాసం:
‘దివ్యగ్రంథాలపై విశ్వాసం’ అంటే ‘అల్లాహ్ తన ప్రవక్తలు మరియు రసూల్ ల (సందేశహరుల) పై వహీ (దైవవాణి) రూపంలో జిబ్రయీలు అలైహిస్సలాం ద్వారా తన దివ్యసందేశాలను అవతరింప జేసేవాడ’ని మనస్పూర్తిగా విశ్వసించటం. వారు ఆ దివ్యసందేశాలను ప్రజలకు అందజేసేవారు. అవి ఒక్కోసారి ఒకే శాసనం గానూ, ఒక్కోసారి అనేక శాసనాలుగానూ జమ చేయబడేవి. వాటికి అల్ కితాబ్ లేదా సుహూఫ్ అనే పేరు ఇవ్వటం జరిగేది. అల్లాహ్ యొక్క దివ్యగ్రంథాలు వివిధ ప్రాంతాలలో మరియు విభిన్న భాషలలో అవతరించినవి. ప్రతి సమాజం పై వారి వారి దివ్యగ్రంథాల్ని వారి వారి భాషలలోనే అవతరింపజేయటం జరిగినది. వాటిలో ఆ సమాజ ప్రజల కొరకు హితబోధలూ మరియు సాఫల్యవంతమైన, తేజోవంతమైన జీవితం గడపడానికి దారిచూపే మార్గదర్శకత్వాలూ ఉండేవి. అల్లాహ్ యొక్క ఏకత్వం (తౌహీద్) వైపు ఆహ్వానించటానికే మరియు ఏకదైవారాధనా సందేశాన్ని అంటే కేవలం అల్లాహ్ నే ఆరాధించ మనే సందేశాన్ని అందజేయడానికే ఈ దివ్యగ్రంథాలన్నీ అవతరించినవి. పుణ్యకార్యాలు చేయమని మరియు పాపకార్యాల నుండి దూరంగా ఉండమని కూడా ఆజ్ఞాపించేవి. అయితే అంతిమ దివ్యగ్రంథమైన ఖుర్ఆన్ తప్ప మిగిలిన దివ్యగ్రంథాన్నీ కాలక్రమంలో కలుషితం చేయబడినాయి. దీనికి కారణం ఖుర్ఆన్ యొక్క సంరక్షణ బాధ్యత స్వయంగా అల్లాహ్ తీసుకోవటం మరియు ఇది కాలానికతీతంగా, ప్రాంతాలకతీతంగా అంతిమదినం వరకు జన్మించే ప్రతి మానవుడి కొరకు పంపబడిన అంతిమసందేశం కావటం. దీని వలన చివరి వరకు ఎలాంటి కలుషితానికీ, కల్పితాలకూ గురికాకుండా ఇది స్వచ్ఛమైన రూపంలో ఉండి, మానవులందరికీ సరైన మార్గం చూపుతూ ఉంటుంది. ఈ క్రింది వాటి ఆచరణల ద్వారా దివ్యగ్రంథాలపై మన విశ్వాసం బహిర్గతమవుతుంది%
1. అల్లాహ్ తన ప్రవక్తలపై దివ్యగ్రంథాలను అవతరించాడనే విషయాన్ని, వారిపై అల్లాహ్ తరఫు నుండి దివ్యగ్రంథాల అవతరణ ముమ్మాటికీ సత్యమనీ మరియు న్యాయబద్ధమనీ సామూహికంగా నమ్మటం.
2. ఏ దివ్యగ్రంథాల పేర్లయితే అల్లాహ్ తెలిపినాడో, వాటిని విశ్వసించటం. ఉదాహరణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించబడిన ఖుర్ఆన్ గ్రంథంపై, ప్రవక్త మూసా అలైహిస్సలాం పై అవతరించబడిన తౌరాత్ గ్రంథం పై, ప్రవక్త ఈసా అలైహిస్సలాం పై అవతరించబడిన ఇంజీల్ గ్రంథంపై, ప్రవక్త దావూద్ అలైహిస్సలాం పై అవతరించబడిన జబూర్ గ్రంథంపై, అలాగే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం పై అవతరించబడిన సహీఫాలపై. అంతేకాక వీటన్నింటిలోనూ ఖుర్ఆన్ గ్రంథం ఎంతో ఉత్తమమైన గ్రంథమనీ మరియు పూర్వ గ్రంథాలన్నింటిపై సాక్ష్యంగా అల్లాహ్ పంపిన అంతిమ గ్రంథమనీ నమ్మటం. ఇంకా దీని ఆదేశాలను పాటించటం మరియు దీనిని ఒక సత్యమైన గ్రంథంగా స్వీకరించటం అనేది మానవులందరిపై అనివార్యమై ఉన్నది. ఖుర్ఆన్ తెలిపినట్లుగా తౌరాత్ మరియు ఇంజీలు మొదలైన దివ్యగ్రంథాలు కాలక్రమంలో అనేక మార్పులు – చేర్పులకు గురైనవనే సత్యాన్ని గుర్తించటం.
3. ఖుర్ఆన్ లో ధ్రవీకరింపబడిన ఆ ప్రాచీన దివ్యగ్రంథాలలోని ప్రతి విషయాన్నీ సత్యంగా నమ్మటం.

4. సందేశహరులపై విశ్వాసం:
అల్లాహ్ యొక్క సందేశహరులందరినీ సామూహికంగా విశ్వసించటం తప్పని సరి. నరకం గురించి హెచ్చరించడానికి మరియు స్వర్గం గురించి సంతోషవార్తలు తెలియజేయడానికి అల్లాహ్ తన దాసుల వద్దకు నిస్సందేహంగా తన సందేశహరులను పంపాడని మనం నమ్మవలెను. ఎలాంటి సాటీ లేని ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించమని వారు ప్రజలను పిలిచేవారని నమ్మవలెను. ఇంకా ఆ సందేశహరులందరి లోనూ చిట్టచివరిగా పంపబడిన అత్యుత్తమ సందేశహరుడే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని కూడా విశ్వసించవలెను. ఎలాగైతే సందేశహరులందరినీ అంటే ముహమ్మద్, నూహ్, ఇబ్రాహీం, మూసా మరియు ఈసా అలైహిస్సలాం మొదలైన వారిని విశ్వసించటం అనివార్యమో, అలాగే అల్లాహ్ పంపిన ప్రవక్తలందరినీ సామూహికంగా విశ్వసించటం కూడా అనివార్యమే. అంతేకాక ప్రవక్తలందరూ అల్లాహ్ తరఫు నుండే పంపబడినారనేది కూడా నూటికి నూరుపాళ్ళు సత్యమని విశ్వసించవలసియున్నది. కాబట్టి అల్లాహ్ పంపిన ఏ ఒక్క సందేశహరుడిని గాని లేదా ఏ ఒక్క ప్రవక్తను గాని ఎవరైనా తిరస్కరిస్తే, వారు మొత్తం సందేశహరులందరినీ మరియు ప్రవక్తలందరినీ తిరస్కరించినట్లే.
5. అంతిమదినం పై విశ్వాసం:
అంతిమదినంపై విశ్వాసం అంటే మరణించిన తరువాత మరల లేపబడతారని మరియు ప్రతి ఒక్కరి పాపపుణ్యాల లెక్క తీసుకోబడుతుందని విశ్వసించటం. ఆ తరువాత పాపులు కఠినంగా శిక్షించబడుదురు మరియు పుణ్యమానవులు సత్కరించబడుదురు. ‘అంతిమదినంపై విశ్వాసం చూపటంలో’ అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు – ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన మరణానంతర సంఘటనలన్నింటినీ విశ్వసించటం కూడా ఉన్నది. ఉదాహరణకు – సమాధి పరీక్షలు, దానిలోని శిక్షలు – పురస్కారాలు మొదలైనవి. వాటితో పాటు అంతిమదినపు కఠిన స్థితిగతులన్నింటినీ మరియు ప్రతి స్వర్గవాసీ తమ తమ కర్మల ఆధారంగా దాటవలసి యున్న పుల్ సిరాత్ అనే వంతెన గురించిన విషయాలన్నింటినీ విశ్వసించటం. ఇంకా పాపపుణ్యాలను కొలిచే తూకాన్నీ మరియు దాని కొలతలనూ తప్పనిసరిగా విశ్వసించ వలసియున్నది. దానితో పాటు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రజల గురించి సిఫారసు చేస్తారని, ఇక ఎప్పుడూ దప్పిక కలగని విధంగా దాహాన్ని తీర్చే పవిత్ర నీరు గల హౌజె కౌసర్ అనే సరస్సు వద్దకు ఆయన వస్తారని, పవిత్రులైన విశ్వాసులకు అల్లాహ్ యొక్క దర్శనం కలుగుతుందని, స్వర్గం మరియు దాని శుభాలను, అలాగే నరకం మరియు దాని కఠిన శిక్షలనూ నమ్మటం.
6. అల్ ఖదర్ (పూర్వనిర్దిష్ట విధివ్రాత) పై విశ్వాసం:
తక్దీర్ మరియు విధివ్రాత పై విశ్వాసం అంటే మనకు జరిగే మంచి-చెడులు, లాభనష్టాలు, సుఖదు:ఖాలు మొదలైనవన్నీ అల్లాహ్ ఇష్టానుసారమే జరుగును మరియు అల్లాహ్ యొక్క అనుజ్ఞ లేకుండా ఏదీ జరుగదు అని విశ్వసించటం. ఈ భూలోకం యొక్క, అందులోని ప్రతి విషయం యొక్క మరియు మున్ముందు జన్మించబోయే ప్రతీదాని యొక్క భాగ్యాన్ని వాటి సృష్టికి పూర్వమే అల్లాహ్ వ్రాసేసినాడు. అయినప్పటికీ, అల్లాహ్ తన దాసులను కొన్నింటిని చేయమని, మరికొన్నింటికి దూరంగా ఉండమని ఆదేశించినాడు. ఇంకా వారికి తమ తమ పనులను తమ ఇష్టానుసారం చేసుకునే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను ఇచ్చినప్పటికీ, వారి కర్మల లెక్క త్వరలోనే తీసుకోబోతున్నానని అల్లాహ్ ప్రకటించినాడు. (మరియు ఇస్లాంలో ఆరాధనకు అర్థం ఇదే) మరియు అల్లాహ్ యే తన దాసుల కార్యాలను సృష్టించువాడు మరియు దాసులు ఆ కార్యాలను ఆచరించువారు. మరియు తన దాసుల మంచి చెడ్డల గురించి వారి పుట్టుకకు ముందే అల్లాహ్ కు తెలుసును. అలాగే స్వర్గనరకాలలో ఎవరెవరు చేరబోతున్నారనే విషయం కూడా అల్లాహ్ ఎరుగును. ప్రతి ఒక్కరికీ వారి వారి కర్మల ననుసరించి కఠినశిక్షలు లేదా స్వర్గసుఖాలు ప్రసాదించబడును. ఈ విషయాలన్నీ అల్లాహ్ యొక్క గ్రంథంలో భద్రంగా నమోదు చేయబడి ఉన్నాయి.
విధివ్రాతను విశ్వసించటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తమకు శుభమైన దానినే అల్లాహ్ తమ భాగ్యంలో వ్రాసిఉంటాడనే నమ్మకం వలన విశ్వాసి సదా ప్రశన్నంగా ఉంటాడు. అలాగే భాగ్యాన్ని విశ్వసించటం ద్వారా విశ్వాసిలో ధైర్యసాహసాలు కలుగుతాయి. ఫలితంగా అతనిలోని మృత్యుభయం తొలిగిపోతుంది. ఎందుకంటే నిర్ణీత సమయం కంటే ముందు తనకు చావు రాదనే విషయాన్ని అతను గ్రహిస్తాడు. తనకు జరిగిన మంచి – చెడులు ఎలాగూ జరగవలసి ఉన్నవేనని, అలాగే తనకు లభించని విషయాలు తన భాగ్యంలో లేకపోవటం వలననే లభించలేదని తనకు తానుగా సమాధాన పరచుకుంటాడు. ప్రపంచ ప్రజలందరూ ఏకమై తనకు ఏదైనా లాభం కలిగించాలని ప్రయత్నించినా లేక ఏదైనా నష్టం కలిగించాలని ప్రయత్నించినా, వారు తనకు ఏ విధమైన లాభాన్నీ లేదా నష్టాన్నీ కలిగించలేరనే విశ్వాసం అతనిలో బలపడుతుంది. ‘అవును, ఏదైతే అల్లాహ్ తన భాగ్యంలో వ్రాసిపెట్టినాడో, అంతకు మించి ఎవరేమీ చేయలేరు’ అని అతను దృఢంగా నమ్ముతాడు.