ఉమ్రా విధానం
ఉమ్రాని నెరవేర్చాలన్న సంకల్పంతో మస్జిదె హరామ్ చేరుకున్నప్పుడు కుడి కాలు పెడుతూ ఈ దుఆ పటిస్తూ మస్జిదె హరామ్ లో ప్రవేశించాలి . “బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి అల్లహుమ్మగ్ ఫిర్లి జునూబి వఫ్ తహలి అబువాబ రహమతిక్ “ అవూజు బిల్లాహిల్ అజీం వ బివజ్హిహిల్ కరీం వ బిసుల్తానిహిల్ ఖధీం మినష్షయితానిర్రజీం. కాబాపై దృష్టి పడగానే చేసే దుఆ స్వికరించబడుతుందని గుర్తుంచుకోండి .తరువాత తవాఫ్ (ప్రదక్షిన.)మొదలు పెట్టడానికి హజ్రే అస్వద్ (నల్లరాయి ) [...]
