అహంకార పరిణామం

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం.
ముందుగా అహంకారం అని దేనిని అంటారో తెలుసుకుందాం…. మహనీయ ముహమ్మద్ (స) అహంకారం గురించి వివరిస్తూ సత్యాన్ని తిరస్కరించటం సాటి మానవులను అల్పుల క్రింద జమ కట్టడమే అహంకారం అన్నారు .
అహంకారం కొందరిలో అసూయ వల్ల పుడితే మరికొందరిలో అధికారం, బలం వల్ల పుడుతుంది. లేదా జనంలో వారికి గల పలుకుబడి వల్ల పుడుతుంది. అలాగే ఎదుటి మనిషిని చిన్న చూపు చూసి ఇష్టానుసారం మాట్లాడటానికి అలవాటు పడ్డవారిలో కూడా అహంకారం వుంటుంది.
వాస్తవానికి మానవుడు జీవరాసులలో ఉత్తముడు అయి వుంది కూడా అతడు ఆహాకరానికి అర్హుడు కాడు. అనర్హుడు అయి కూడా ఎవరైనా అహంకారం ప్రదర్శిస్తే , అలాంటి వారి పై దేవుడు ఆగ్రహిస్తాడు . అహంకారానికి అలవాటు పడ్డవారిని దేవుడు ఎంత మాత్రం ఇష్టపడడు. సత్యాన్ని తిరస్కరించే ఆహంకారులను దేవుడు ఇహలోకంలోను పరలోకంలోనూ సిక్చిస్తాడు. అహంకారం వల్ల సత్యాన్ని తిరస్కరించేవారు లోకంలో చాలామంది పుట్టారు. కాని పుట్టగతులు లేకుండా పోయారు. ఉదాహరణకు కొన్ని సంఘటనలు..
1) – అధికార మదాన్ధతతో సత్యాన్ని తిరస్కరించేవారు ప్రవక్త ఇబ్రాహీం (స అ ) మరియు నమ్రూద్ రాజు యదార్థ గాధను చదివి గుణపాఠం నేర్చుకోవాలి .
ప్రవక్త ఇబ్రాహీం (స అ) సత్యాన్ని, దైవ ధర్మాన్ని ప్రజలకు తెలియజేస్తుండేవారు. ఆ దేశాన్ని నమ్రూద్ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతను తన అధికారం, బలం వల్ల అహంకారానికి లోనై నేనే దేవుడిని నన్ను పూజించండి అని ప్రజలను ఆదేశించాడు. కాని ఇబ్రాహీం (అ స) అందరికి దేవుడు ఒక్కడే అతను పైనున్నాడు అతను తప్ప ఎవరూ పూజకు అర్హులు కారు అనే సత్యాన్ని ప్రచారం చేసేవారు.
ప్రవక్త ఇబ్రాహీం గారి సందేశం రాజు గారికి తెలియజేయబడింది. రాజు ఆగ్రహించి ఇబ్రాహీం (అ స) గారిని తన సభలోకి పిలిపించి ఎవరు నీ దేవుడు ఏమిటి నీ దేవుని ఘనత అని నిలదీశాడు. ఇబ్రాహీం (అ స) గారు ప్రాణం పోసేవాడు, ప్రాణం తీసేవాడే నిజమైన దైవం అని చెప్పారు. దానికి రాజు ఓస్ ఇంతేనా ఈపని నేను చేయగలను అంటూ ఇద్దరు ఖైదీలను పిలిపించి ఒకడి తల తీఇంచేసాడు, మరోకడ్ని విడుదల చేసి వెళ్ళిపో మన్నాడు. తర్వాత ఇబ్రాహీం గారితో చూసావా నేనూ ఒకరి ప్రాణం తీయగలను, ఒకరికి ప్రాణం పోయగాలను, అని ఎద్దేవా చేసాడు. అప్పుడు ఇబ్రాహీం (అ స) గారు సరే గాని దేవుడు సూర్యుడిని తూర్పు దిక్కు నుంచి వుదఇంప జేస్తున్నాడు. నీవు సూర్యుడ్ని పడమర నుంచి ఉదయించే లా చేయి చూద్దాం అని సవాలు విసిరారు . రాజు గారికి ఇది సాధ్యం కాదు కాబట్టి సమాధానం ఏమి ఇవ్వలేక పోయాడు. రాజుగారి శక్తి ఏపాటిదో తెలిపాయింది. ఇబ్రాహీం (అ స) ద్వారా అతని ముందు సత్యం రుజువైంది. రాజు తన ఓటమిని అంగీకరించి సత్యాన్ని స్వీకరించి సన్మార్గంలో నడవాల్సింది పొఇ దానికి వ్యతిరేకంగా తన అధికార బలాన్ని ప్రయోగించాడు. ప్రవక్త ఇబ్రాహీం (అ స) గారిని అగ్నికి ఆహుతి చేయాలనీ ఆదేశించాడు.
ఆ విధంగా అధికారం నమ్రుడ్ రాజు లో అహంకారం పెంచింది . అతని ప్రవర్తనను పైనుంచి చూస్తున్న దేవుడు ఆగ్రహించాడు. దేవుడు తన సందేసహరుడైన ఇబ్రాహీం (అ స) గారిని అగ్ని నుండి కాపాడాడు. నమ్రుడ్ రాజుపైకి ఒక దోమను పంపించాడు. ఆ దోమ అతని ముక్కు (లేదా చెవి) ద్వారం గుండా అతని మెదడులోకి ప్రవేశించి కుట్టటం మొదలెట్టింది. రాజు నొప్పికి తట్టుకోలేక విలవిల్లాదిపోయాడు. నొప్పి విపరీతం అయ్యేసరికి పిచ్చివానిలా తన చెప్పుతో తలపైన కొట్టుకున్నాడు . దైవాదేసంతో అప్పుడు దోమ ఆగిపాయింది. రాజుకి కాసేపు ఉపసమనం కలిగింది. కాసేపటి తర్వాత దోమ మల్లి తన పనిని దైవాజ్నపై మొదలుపెట్టింది. రాజు చెప్పుతో మల్లి కొట్టుకుంటే కాసేపు ఆగి మల్లి తన పని ప్రారంభించేది. రాజు చివరకు ఇద్దరు మనుషులను పెట్టుకున్నాడు. వారిద్దరూ అతని తలపై దెబ్బలు కొట్టేవారు. ఇలా చెప్పు దెబ్బలు తిని తిని చివరకు అతని తల బద్దలై హీనమైన చావు చచ్చాడు. అహంకారానికి తగిన శాస్తి జరిగింది. —-( ఇంకా వుంది )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *