ధర్మ సమ్మత మైన జీవనోపాధి = సౌభాగ్యానికి, సమృద్ధికి పునాది.

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
ధనం మనిషికి ఒక అవసరం. దాని కోసం ప్రతి మానవుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. ధనం సంపాదించటానికి ప్రపంచంలో ఎన్నో మార్గాలున్నాయి. అందులో కొన్ని అధర్మమైనవి, కొన్ని సక్రమమైనవైతే, కొన్ని అక్రమమైనవని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి మనిషి ధన సంపాదన కొరకై అవలంభిస్తున్న మార్గం ధర్మ సమ్మతమైనదా లేక అధర్మమైనదా? అని ఆలోచించాలి. ఎందుకంటె మనందరినీ సృష్టించిన దేవుడు అక్రమ మార్గాల్లో ధనం సంపాదించటాన్నినిషేధించాడు. ధర్మసమ్మతమైన మార్గాన్నే అవలంబించాలని ఆదేశించాడు.
ప్రతి మనిషి విస్వసించాల్సిన ఒక విషయం దైవ గ్రంధంలో వుంది.అదేమిటంటే మానవ సమాజానికి హాని కలిగించే పద్ధతులనే దేవుడు నిషేధించాడు, మంచి మార్గాలన్నిటినీ ధర్మసమ్మతం చేసాడు.దైవం నిషేధించిన మార్గంలో మనిషికి శ్రేయం, శుభం, రెండూ లేవు, దైవం ధర్మసమ్మతం చేసిన మార్గంలో మనిషికి శ్రేయం, శుభం, రెండూ కలుగుతాయి.–కానీ మానవులు ధనవంతులైపోవాలనే యాసలో పడి మంచి – చెడు, ధర్మం – అధర్మమన్న మాటే మరచి పోయారు. నిర్భయంగా అక్రమ మార్గాల్లో అమాయకులను దోచుకుని, విచ్చలవిడిగా అధర్మ సంపాదనను ఆరగిస్తున్నారు. వాస్తవానికి దైవం మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం అక్రమ మార్గాలను నిషేధించి, అధర్మానికి పాల్పడినవారికి కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు.
ఉదాహరణకు ఈ విధంగా ఆదేసించబడింది: ” మీలో మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా కబలించకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైన పద్దతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగాన్ని కాజేసేటందుకు అధికారులకు ముడుపులు చెల్లించకండి”. ( బఖరా:188 )
మహనీయ మొహమ్మద్ ( స ) ఇలా తెలియజేశారు: ” మీలోని ప్రతి ఒక్కరి – రక్తం ( ప్రాణం ), దానం మిరియు మానం ( కాజేయటం ) మరొకరిపై నిషేధించబడింది “.
ఓ సందర్భాన ప్రవక్త మహనీయులు ( స) ఇలా తెలియజేసారు: ” శరీరంలోని ఏ భాగమైతే అక్రమ సంపాదనతో పెరుగుతుందో అది నరకాగ్నికి అతి చేరువవుతుంది”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *