Category Archives: Uncategorized

ధర్మ సమ్మత మైన జీవనోపాధి = సౌభాగ్యానికి, సమృద్ధికి పునాది.

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
ధనం మనిషికి ఒక అవసరం. దాని కోసం ప్రతి మానవుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. ధనం సంపాదించటానికి ప్రపంచంలో ఎన్నో మార్గాలున్నాయి. అందులో కొన్ని అధర్మమైనవి, కొన్ని సక్రమమైనవైతే, కొన్ని అక్రమమైనవని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి మనిషి ధన సంపాదన కొరకై అవలంభిస్తున్న మార్గం ధర్మ సమ్మతమైనదా లేక అధర్మమైనదా? అని ఆలోచించాలి. ఎందుకంటె మనందరినీ సృష్టించిన దేవుడు అక్రమ మార్గాల్లో ధనం సంపాదించటాన్నినిషేధించాడు. ధర్మసమ్మతమైన మార్గాన్నే అవలంబించాలని ఆదేశించాడు.
ప్రతి మనిషి విస్వసించాల్సిన ఒక విషయం దైవ గ్రంధంలో వుంది.అదేమిటంటే మానవ సమాజానికి హాని కలిగించే పద్ధతులనే దేవుడు నిషేధించాడు, మంచి మార్గాలన్నిటినీ ధర్మసమ్మతం చేసాడు.దైవం నిషేధించిన మార్గంలో మనిషికి శ్రేయం, శుభం, రెండూ లేవు, దైవం ధర్మసమ్మతం చేసిన మార్గంలో మనిషికి శ్రేయం, శుభం, రెండూ కలుగుతాయి.–కానీ మానవులు ధనవంతులైపోవాలనే యాసలో పడి మంచి – చెడు, ధర్మం – అధర్మమన్న మాటే మరచి పోయారు. నిర్భయంగా అక్రమ మార్గాల్లో అమాయకులను దోచుకుని, విచ్చలవిడిగా అధర్మ సంపాదనను ఆరగిస్తున్నారు. వాస్తవానికి దైవం మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం అక్రమ మార్గాలను నిషేధించి, అధర్మానికి పాల్పడినవారికి కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు.
ఉదాహరణకు ఈ విధంగా ఆదేసించబడింది: ” మీలో మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా కబలించకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైన పద్దతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగాన్ని కాజేసేటందుకు అధికారులకు ముడుపులు చెల్లించకండి”. ( బఖరా:188 )
మహనీయ మొహమ్మద్ ( స ) ఇలా తెలియజేశారు: ” మీలోని ప్రతి ఒక్కరి – రక్తం ( ప్రాణం ), దానం మిరియు మానం ( కాజేయటం ) మరొకరిపై నిషేధించబడింది “.
ఓ సందర్భాన ప్రవక్త మహనీయులు ( స) ఇలా తెలియజేసారు: ” శరీరంలోని ఏ భాగమైతే అక్రమ సంపాదనతో పెరుగుతుందో అది నరకాగ్నికి అతి చేరువవుతుంది”.

అహంకార పరిణామం

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం.
ముందుగా అహంకారం అని దేనిని అంటారో తెలుసుకుందాం…. మహనీయ ముహమ్మద్ (స) అహంకారం గురించి వివరిస్తూ సత్యాన్ని తిరస్కరించటం సాటి మానవులను అల్పుల క్రింద జమ కట్టడమే అహంకారం అన్నారు .
అహంకారం కొందరిలో అసూయ వల్ల పుడితే మరికొందరిలో అధికారం, బలం వల్ల పుడుతుంది. లేదా జనంలో వారికి గల పలుకుబడి వల్ల పుడుతుంది. అలాగే ఎదుటి మనిషిని చిన్న చూపు చూసి ఇష్టానుసారం మాట్లాడటానికి అలవాటు పడ్డవారిలో కూడా అహంకారం వుంటుంది.
వాస్తవానికి మానవుడు జీవరాసులలో ఉత్తముడు అయి వుంది కూడా అతడు ఆహాకరానికి అర్హుడు కాడు. అనర్హుడు అయి కూడా ఎవరైనా అహంకారం ప్రదర్శిస్తే , అలాంటి వారి పై దేవుడు ఆగ్రహిస్తాడు . అహంకారానికి అలవాటు పడ్డవారిని దేవుడు ఎంత మాత్రం ఇష్టపడడు. సత్యాన్ని తిరస్కరించే ఆహంకారులను దేవుడు ఇహలోకంలోను పరలోకంలోనూ సిక్చిస్తాడు. అహంకారం వల్ల సత్యాన్ని తిరస్కరించేవారు లోకంలో చాలామంది పుట్టారు. కాని పుట్టగతులు లేకుండా పోయారు. ఉదాహరణకు కొన్ని సంఘటనలు..
1) – అధికార మదాన్ధతతో సత్యాన్ని తిరస్కరించేవారు ప్రవక్త ఇబ్రాహీం (స అ ) మరియు నమ్రూద్ రాజు యదార్థ గాధను చదివి గుణపాఠం నేర్చుకోవాలి .
ప్రవక్త ఇబ్రాహీం (స అ) సత్యాన్ని, దైవ ధర్మాన్ని ప్రజలకు తెలియజేస్తుండేవారు. ఆ దేశాన్ని నమ్రూద్ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతను తన అధికారం, బలం వల్ల అహంకారానికి లోనై నేనే దేవుడిని నన్ను పూజించండి అని ప్రజలను ఆదేశించాడు. కాని ఇబ్రాహీం (అ స) అందరికి దేవుడు ఒక్కడే అతను పైనున్నాడు అతను తప్ప ఎవరూ పూజకు అర్హులు కారు అనే సత్యాన్ని ప్రచారం చేసేవారు.
ప్రవక్త ఇబ్రాహీం గారి సందేశం రాజు గారికి తెలియజేయబడింది. రాజు ఆగ్రహించి ఇబ్రాహీం (అ స) గారిని తన సభలోకి పిలిపించి ఎవరు నీ దేవుడు ఏమిటి నీ దేవుని ఘనత అని నిలదీశాడు. ఇబ్రాహీం (అ స) గారు ప్రాణం పోసేవాడు, ప్రాణం తీసేవాడే నిజమైన దైవం అని చెప్పారు. దానికి రాజు ఓస్ ఇంతేనా ఈపని నేను చేయగలను అంటూ ఇద్దరు ఖైదీలను పిలిపించి ఒకడి తల తీఇంచేసాడు, మరోకడ్ని విడుదల చేసి వెళ్ళిపో మన్నాడు. తర్వాత ఇబ్రాహీం గారితో చూసావా నేనూ ఒకరి ప్రాణం తీయగలను, ఒకరికి ప్రాణం పోయగాలను, అని ఎద్దేవా చేసాడు. అప్పుడు ఇబ్రాహీం (అ స) గారు సరే గాని దేవుడు సూర్యుడిని తూర్పు దిక్కు నుంచి వుదఇంప జేస్తున్నాడు. నీవు సూర్యుడ్ని పడమర నుంచి ఉదయించే లా చేయి చూద్దాం అని సవాలు విసిరారు . రాజు గారికి ఇది సాధ్యం కాదు కాబట్టి సమాధానం ఏమి ఇవ్వలేక పోయాడు. రాజుగారి శక్తి ఏపాటిదో తెలిపాయింది. ఇబ్రాహీం (అ స) ద్వారా అతని ముందు సత్యం రుజువైంది. రాజు తన ఓటమిని అంగీకరించి సత్యాన్ని స్వీకరించి సన్మార్గంలో నడవాల్సింది పొఇ దానికి వ్యతిరేకంగా తన అధికార బలాన్ని ప్రయోగించాడు. ప్రవక్త ఇబ్రాహీం (అ స) గారిని అగ్నికి ఆహుతి చేయాలనీ ఆదేశించాడు.
ఆ విధంగా అధికారం నమ్రుడ్ రాజు లో అహంకారం పెంచింది . అతని ప్రవర్తనను పైనుంచి చూస్తున్న దేవుడు ఆగ్రహించాడు. దేవుడు తన సందేసహరుడైన ఇబ్రాహీం (అ స) గారిని అగ్ని నుండి కాపాడాడు. నమ్రుడ్ రాజుపైకి ఒక దోమను పంపించాడు. ఆ దోమ అతని ముక్కు (లేదా చెవి) ద్వారం గుండా అతని మెదడులోకి ప్రవేశించి కుట్టటం మొదలెట్టింది. రాజు నొప్పికి తట్టుకోలేక విలవిల్లాదిపోయాడు. నొప్పి విపరీతం అయ్యేసరికి పిచ్చివానిలా తన చెప్పుతో తలపైన కొట్టుకున్నాడు . దైవాదేసంతో అప్పుడు దోమ ఆగిపాయింది. రాజుకి కాసేపు ఉపసమనం కలిగింది. కాసేపటి తర్వాత దోమ మల్లి తన పనిని దైవాజ్నపై మొదలుపెట్టింది. రాజు చెప్పుతో మల్లి కొట్టుకుంటే కాసేపు ఆగి మల్లి తన పని ప్రారంభించేది. రాజు చివరకు ఇద్దరు మనుషులను పెట్టుకున్నాడు. వారిద్దరూ అతని తలపై దెబ్బలు కొట్టేవారు. ఇలా చెప్పు దెబ్బలు తిని తిని చివరకు అతని తల బద్దలై హీనమైన చావు చచ్చాడు. అహంకారానికి తగిన శాస్తి జరిగింది. —-( ఇంకా వుంది )

ముహమ్మద్ (స) ఆదర్శం

కొందరు తత్వవేత్తలు, ఇస్లాం స్టడీ చేసిన పాశ్చాత్య నిపుణులు (Orientalist) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇచ్చిన స్టేట్ మెంట్స్ క్రింద తెలుపుతున్నాము.
జార్జ్ బర్నార్డ్ షా (George Bernard Shaw. జననం 26/7/1856. మరణం 2/11/1950. జన్మ స్థలం Ireland.)తన రచన “ముహమ్మద్”లో (బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని కాల్చేసింది) ఇలా వ్రాశాడుః “ఈ నాటి సమాజానికి ముహమ్మద్ లాంటి మేధావి అవసరం చాలా ఉంది. ఈ ప్రవక్త, ఈయన ఎల్లప్పుడూ తన ధర్మాన్ని గౌరవ స్థానంలో ఉంచాడు. ఆయన తీసుకొచ్చిన ధర్మం ఇతర నాగరికతలను అంతమొందించేంత శక్తి గలది. శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండునది. నా జాతి వాళ్ళల్లో చాలా మంది స్పష్టమైన నిదర్శనంతో ఈ ధర్మంలో ప్రవేశిస్తున్నది నేను చూస్తున్నాను. సమీపం లోనే ఈ ధర్మం యూరపు ఖండంలో విశాలమైన చోటు చేసుకుంటుంది”.
ఇంకా ఇలా వ్రాశాడుః “అజ్ఞానం, దానిపై పక్షపాతం వల్ల మధ్య శతాబ్థి (Middle Ages) లోని క్రైస్తవ మత పెద్దలు ముహమ్మద్ తీసుకొచ్చిన ధర్మాన్ని అంధవికారంగా చిత్రీకరించి, అది క్రైస్తవ మతానికి శత్రువు అని ప్రచారం చేశారు. కాని నేను ఈ వ్యక్తి (ముహమ్మద్) గురించి చదివాను. అతను వర్ణాతీతమైన, అపరూపమైన వ్యక్తి. ఆయన క్రైస్తవ మతానికి శత్రువు ఎంత మాత్రం కారు. ఆయన్ను మానవ జాతి సంరక్షకుడని పిలవడం తప్పనిసరి. నా దృష్టిలో ఆయన గనక నేటి ప్రపంచ పగ్గాలు తన చేతిలో తీసుకుంటే మన సమస్యల పరిష్కార భాగ్యం ఆయనకు లభిస్తుంది. నిజమైన శాంతి, సుఖాలు ప్రాప్తమవుతాయి. అవి పొందడానికే మానవులు పరితపిస్తున్నారు.

మన భారతదేశ ప్రఖ్యాత తత్వవేత్త రామక్రిష్ణారావు ఇలా చెప్పాడుః “అరబ్ ద్వీపంలో ముహమ్మద్ ప్రకాశమయినప్పుడు అది ఓ ఎడారి ప్రాంతం. అప్పటి ప్రపంచ దేశాల్లో నామమాత్రం గుర్తింపు లేని ప్రాంతం అది. కాని ముహమ్మద్ తన గొప్ప ఆత్మ ద్వారా క్రొత్త యుగాన్ని, నూతన జీవితాన్ని, కొత్త సంస్కృతి, సభ్యతను ఏర్పరిచారు. మరియు కొత్త రాజ్యాన్ని నిర్మించారు. అది మొరాకో నుండి ఇండియా ద్వీపకల్పం వరకు విస్తరించింది. అంతే కాదు ఆయన ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ ఖండాల్లోని జీవనశైలి, విచారణా విధానాల్లో గొప్ప మార్పు తేగలిగాడు.
కెనడాకు చెందిన ఓరియంటలిస్ట్ జ్వీమర్ (S.M. Zweimer) ఇలా వ్రాశాడుః “నిశ్చయంగా ముహమ్మద్ ధార్మిక నాయకుల్లో అతి గొప్పవారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన శక్తివంతుడైన సంస్కరణకర్త, అనర్గళ వాగ్ధాటి, ధైర్యంగల అతిసాహసి, సువిచారం చేయు గొప్ప మేధావి అని అనడమే సమంజసం. ఈ సద్గుణాలకు విరుద్ధమైన విషయాలు ఆయనకు అంకితం చేయుట ఎంత మాత్రం తగదు, యోగ్యం కాదు. ఆయన తీసుకొచ్చిన ఈ ఖుర్ఆను మరియు ఆయన చరిత్ర ఇవి రెండూ ఆయన సద్గుణాలకు సాక్ష్యం చెబుతున్నాయి.
సర్ విలియమ్ యోయిర్ (Sir William Muir) ఇలా చెప్పాడుః “ముహమ్మద్ -ముస్లిముల ప్రవక్త- చిన్నప్పటి నుండే అమీన్ అన్న బిరుదు పొందారు. ఆయన ఉత్తమ నడవడిక, మంచి ప్రవర్తనను బట్టి ఆయన నగరవాసులందరూ ఏకంగా ఇచ్చిన బిరుదు ఇది. ఏదీ ఎట్లయినా, ముహమ్మదు వర్ణాతీతమైన శిఖరానికి ఎదిగి యున్నారు. ఏ వ్యక్తి ఆయన గురించి వర్ణించగలడు. ఆయన్ను ఎరగనివాడే ఆయన గౌరవస్థానాన్ని ఎరగడు. ఆయన గురించి ఎక్కువగా తెలిసినవాడు ఆయన గొప్ప చరిత్రను నిశితంగా పరిశీలించినవాడు. ఈ చరిత్రనే ముహమ్మదును ప్రవక్తల్లో మొదటి స్థానంలో మరియు విశ్వమేధావుల్లో ఉన్నతునిగా చేసింది.
ఇంకా ఇలా అన్నాడుః “ముహమ్మద్ తన స్పష్టమైన మాట, సులభ మైన ధర్మం ద్వారా సుప్రసిద్ధులయ్యారు. మేధావుల మేధను దిగ్ర్భమలో పడవేసిన పనులు ఆయన పూర్తి చేశారు. అతి తక్కువ వ్యవధిలో అందరినీ జాగరూక పరచిన, అప్రమత్తం చేసిన, నశించిపోయిన సద్గుణాల్లో జీవం పోసిన, గౌరవ మర్యాదల ప్రతిష్ఠను చాటి చెప్పిన ఇస్లాం యొక్క ప్రవక్త ముహమ్మద్ లాంటి సంస్కరణకర్త చరిత్రలో ఎవ్వరూ మనకు కనబడరు.
గొప్ప నవలారచయిత, తత్వవేత్త రష్యాకు చెందిన లియో టాల్స్ టాయ్ (Leo Tolstoy Nikolayevich. జననం 9/9/1828 మరణం 20/11/1910 జన్మ స్థలం Tula Oblast, Russia. ప్రపంచపు గొప్ప నవలా రచయితల్లో ఒకడితను. తత్వవేత్త కూడా) ఇలా చెప్పాడుః “ముహమ్మద్ విఖ్యాతి, కీర్తి గౌరవానికి ఇది ఒక్క విషయం సరిపోతుందిః ఆయన అతి నీచమైన, రక్తపాతాలు సృష్టించే జాతిని, సమా జాన్ని దుర్గుణాల రాక్షసి పంజాల నుండి విడిపించారు. వారి ముందు అభివృద్ధి, పురోగతి మార్గాలు తెరిచారు. ముహమ్మద్ ధర్మశాస్త్రం కొంత కాలంలో విశ్వమంతటిపై రాజ్యమేలుతుంది. ఎందుకనగా ఆ ధర్మానికి బుద్ధిజ్ఞానాలతో మరియు మేధ వివేకాలతో పొందిక, సామరస్యం ఉంది.
ఆస్ట్రియా దేశస్తుడైన షుబ్రుక్ చెప్పాడుః ముహమ్మద్ లాంటి వ్యక్తి వైపు తనకు తాను అంకితం చేసుకోవడంలో మానవజాతి గర్వపడు తుంది. ఎందుకనగా ఆయన చదువరులు కానప్పటికీ కొద్ది శతాబ్ధాల క్రితం ఒక చట్టం తేగలిగారు. మనం ఐరోపాకు చెందిన వాళ్ళం గనక దాని శిఖరానికి చేరుకున్నామంటే మహా అదృష్టవంతులమవుతాము.