రమజాన్ శుభాలు ( రచన – మౌలానా‍‍‍ ముహమ్మద్ తఖీయుద్దీన్, బిఎ) అనువాదం – ముహమ్మద్ అజీజుర్రహ్మాన్, బిఎ

దివ్య ఖుర్ఆన్ అవతరించిన నెల రమజాన్ నెల. ఇది ఎంతో శుభ ప్రదమైన నెల. ఈ నెలలో తన దాసుల ఆరాధనలకు ఎన్నో రెట్లు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు విశ్వా ప్రభువు. విశ్వాసులైన దాసులందరిపై అల్లాహ్, ఈ మాసంలో ఉపవాసాలను విధిగా నిర్ణయించాడు. ఈ నెలలో ఫిత్రా దానాలు యివ్వాలని, థరావీహ్ నమాజ్ పాటించాలని ఆదేశించ బడింది. వెయ్యి రాత్రుల కంటే శ్రేస్టమైన ఒక రాత్రి – లైలతుల్ ఖాదర్ – ఈ మాసంలోనే ఉంది. సృష్టికర్త సాన్నిధ్యాన్ని పొందడానికి, ఆయన ప్రసన్నతను

చూరగొనడానికి ఉద్దేశించ బడిన ‘ఏతెకాఫ్’ (మునవ్రతం) కూడా రమజాన్లోనే ఉంది. కనుక ఇది నిస్సందేహంగా అపారమైన వరాలను పొందే నెల అని చెప్పవచ్చు.

రోజా

రోజా (ఉపవాసం) అంటే అసలు ఆపటం, ఆగి ఉండడం, అదుపు చేసుకోవటం, కట్టుబడి ఉమ్డడం అనే అర్థాలు వస్తాయి. అయితే ఇస్లామీయ పరిభాషలో రోజా (ఉపవాసం) అంటే, ఒక నిర్ణీత కాలం గడిచిపోయే వరకు అన్నపానీయాలను త్యజిమ్చటం, లైంగిక వాంఛలను అదుపులో ఉంచుకోవటం అని భావం. ‘రోజా’నే

రోజానే సౌమ్ అనీ, సియాం అని కూడా అంటారు. రోజేదార్ (ఉపవాసి)ని ‘సాయిమ్’ గా వ్యవహరిస్తారు.

రోజా-ఆదేశాలు, శుభాలు

౧) దివ్య ఖుర్ఆన్లో ఉంది.

يا أيها الذين آمنو كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون .

”విశ్వసించిన ఓ ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించ బడిండి. ఇదే విధంగా యిది మీకు పూర్వం ప్రవక్తల్ని అనుసరించే వారికి కూడా విదిమ్చాబదిమ్ది. దీని వాళ్ళ మీలో భయ భక్తులు జనించే అవకాశం ఉంది”.

شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس و باييينآتين من الهدى و الفرقان. فمن شهد منكم الشهر فليصمه.

౨) పవిత్ర ఖుర్ఆన్ అవతరించిన నెల రమజాన్ నెల. మానవులమ్దరికిఏ (ఆ గ్రంథం) మార్గదర్శకం. రుజుమార్గం చూపే సత్యాసత్యాలను వేరు పరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కాబట్టి ఇకప రమజాన్ నేలను ఎవరు చూస్తారో, వారు ఆ నేలంతా విధిగా ఉపవాసం పాటిం౩) ఒక హదీసు ఇలా ఉంది.

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వఅ సల్లం) ఉపదేశిమ్చారని హజ్రత్ అబూహురైరా (ర.అ) ఉల్లేఖిమ్చారు. “మీపై ఒక శుభప్రదమైన నెల అవతరి౦చ నున్నది. దాని ఉపవాసాలను అల్లాహ్ మీపై విధిగా చేశాడు. ఈ నెలలో స్వర్గ ద్వారాలు తెరచి వేయబడతాయి. నరక ద్వారాలు మూసివేయబడతాయి. శైతాన్లు బంధించ బడతారు. వేయి నెలల కంటే శ్రేష్ఠమైన రేయి ఒకటి ఈ నెలలో౪) మరో హదీసులో ఉంది –

హజ్రత్ అబూ హురైరా (ర.అ) ఉల్లేఖించారు. మహనీయ ముహమ్మద్ ప్రవచించారు. “అల్లాహ్ సెలవిచ్చాడు: ఆద౦ సంతతికి చెందిన ఆచరణలన్నీ వారి స్వయానికి చెందినవి. ఒక్క ఉపవాసం మినహా! ఎమ్డుకంటే అది (ఉపవాసం) నాది. దాని ప్రతిఫలం స్వయంగా నేను (నా దాసునికి) యిస్తాను.”

ఉపవాసం ద్వారా అల్లాహ్ తో మనిషికి ఒక విధమైన సంబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే అల్లాహ్ అన్న పానీయాలకు,లయింగిక కోర్కెలకు అతీతంగా ఉంటాడు. అందుచేతనే ఉపవాసిని అల్లాహ్ ఎంతో ఇష్ట పడతాడు. ౫) రోజా ‘డాలు’ వంటిది. కాబట్టి మీలో ఎవరయినా ఉపవాసం ఉంటే వారు దుర్భాషలాడరాడు. గలాటా చెయ్యరాదు. అజ్ఞానంతో కూడిన మాటలు అనరాదు. ఎవరయినా తమను తిడితే లేక పోట్లాటకు దిగితే, తాము ఉపవాసం పాటిస్తున్నామని వారితో రెండు సార్లు చెప్పి వేయాలి. మహా ప్రవక్త (స అ సం) ప్రాణం ఎవరి చేతుల్లోనయితే ఉందో ఆయన సాక్షి! రోజేదార్ (ఉపవాసి)నోటి నుండి వచ్చే వాసన ప్రళయ దినాన దైవ సమక్షంలో ‘ముష్క్’ సువాసన కంటే కూడా ఎక్కువగా సువాసన కలిగి ఉంటుంది.

స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఒక ద్వారం పేరు ‘రయ్యాన్’ . ఆ ద్వారం కేవలం ఉపవాసి కొరకే కేటాయించ బడి౦ది.

౭) ‘ఎప్పటి వరకయితే ప్రజలు ఇఫ్తార్ (ఉపవాస విరమణ) చేయటంలో త్వరపడతారో మరియు ‘సహరీ’ భుజించట౦లో నింపాదిగా వ్యవహరిస్తారో

క్రైస్తవులు ‘ఇఫ్తార్’లో ఆలస్యం చేసి ‘సహ్రీ’లో తొందర పడేవారు. అందువాళ్ళ వారు ధర్మానికి దూరం అయిపోయారు’ అని మహాప్రవక్త (సఅసం) బోధించారు.

ఉపవాసం – రకాలు

ఉపవాసం (రోజా) పెద్ద వారయినా ప్రతీ ముస్లిం స్త్రీ పురుషునిపై విధిగా నిర్ణయించ బడింది. ఉషోదయానికి పూర్వం నుండి సూర్యాస్తమయం వరకు దైవం కోసం అన్న పానీయాలను విడనాడటాన్ని, లయింగిక కోర్కెలను అదుపు చేసుకోవటాన్ని రోజా (ఉపవాసం) అంటారు.

ఇస్లామీయ ధర్మంలో రోజా ౮ రకాలు: ౧) ఫర్జే ముయ్యన్ ౨) ఫర్జే గిర్ ముఅయ్యన్ ౩) వాజిబే ముయ్యన్ ౪) వాజిబే గిర్ ముయ్యన్ ౫) సున్నత్ ౬) నఫిల్

౭)మ్క్రోహ్ ౮)హరం.

1) ఏడాదిలో ఒక నెల రోజుల పాటు, అంటే, రమజాన్ నెల అంటా ఉండే ఉపవాసాలు ”ఫర్జే ముయ్యన్’ అనబ్డతాయి.

2) ఏదైనా కారణం వల్ల గానీ లేక అకారణం వల్లగానీ రమజాన్ నెలలో విడిచి పెట్టేసిన ఉపవాసాలను, ఆ తరువాత పాటించటాన్ని’ ఫర్జే గయిర్ ముఅయ్యన్’

అంటారు.

3) ఏదైనా ప్రత్యేక రోజున లేక ఫలానా తారీకున ఉపవాసం పాటిస్తానని మనసులో సంకల్పించుకుని ఆ రోజున ఉపవాసం పాటి౦చటాన్ని

నే ఉంది. ఎవరైతే దాని శుభాలను కోల్పోయాడో అతను వాస్తవానికి ఎంతో దౌర్భాగ్యుడు.”

చాలి.”

‘వాజిబే ముఅయ్యన్’ అంటారు. ఉదాహరణకు ఎవరైనా, తాము పరీక్షలో పాసైతే రజబ్ నెల మొదటి తేదీన దైవం కోసం ఉపవాసం పాటిస్తానని నిశ్చయించుకుని, ఆ తేదిన ఉపవాసం పాటించటం అన్నమాట.

4) పరిహారం (కఫ్ఫారా) చెల్లించే నిశ్చయంతో పాటించే ఉపవాసాన్ని ‘వాజిబే గయిర్ ముఅయ్యన్’ అంటారు. దీని కోసం ఫలానా తేదీ లేక ఫలానా రోజు అని నిరధారించనవసరం లేదు. ఉదాహరణకు, ఎవరైనా, తాను మొదటి తరగతిలో ప్యాసయ్తే దైవం కోసం ౩ రోజులు ఉపవాసం పాటిస్తానని సంకల్పించుకోవడం.

5) మహా ప్రవక్త (ససం) ఏఏ రోజుల్లోనయ్తే (రమజాన్ నేలను మినహాయించి) ఉపవాసాలు ఉన్నట్లు నిర్దారితమౌతుందో మరియు ఫలానా రోజు ఉపవాసం ఉండమని ప్రవక్త (సఅసం) బోధించినట్లు ఆధార్ముందో ఆయా రోజాలను పాటి౦చటాన్ని సున్నత్ రోజాలు అనంటారు. ఉదాహరణకు ముహర్రం నెల 9,10 తేదీలు, హిజ్రీ నెలలోని 13, 14, 15 తేదీలు. ఇవన్నీ ‘సున్నతే గయిర్ ముఅక్కిద’ అనబడతాయి.

6) ఫర్జ్, వాజిబ్, సున్నత్లు మినహా మిగిలిన ఉపవాసాలు అదనపు ఉపవాసాలుగా పరిగనించ బడతాయి. ఈ ‘రోజా’లను పాటించటం వలన పుణ్యం ప్రాప్తమవుతుంది. ఉదాహరణకు, షవ్వాల్ మాసం లోని ఆరు రోజులు, ప్రతీ సోమవారం, గురువారం ఇవన్నీ నఫిల్ రోజాలు అనబడతాయి.

7) కొన్ని రోజాలు (ఉపవాసాలు) మక్రోహ్ చేయబడ్డాయి. (మక్రూహ్ అంటే దైవానికి అయిష్టమయినవి) కేవలం ముహర్రం పదవ తేదీనాడు, కేవలం ముహర్రం తొమ్మిదవ తేదీనాడు ఉపవాసం ఉండటం మక్రూహ్, ఉంటె ముహర్రం నెల తొమ్మిదవ మరియు పడవ తేదీలు – రెండు రోజులు – ఉపవాసం ఉండాలి. భర్త అనుమతి లేకుండా భార్య నఫిల్ రోజాలు ఉండటం కూడా అవా౦ఛనీయమే.

8. కొన్ని ప్రత్యేకమయిన దినాలలో పాటించే ఉపవాసాలు ముస్లిములందరికీ హరామ్ చేయబడ్డాయి (నిషేధించబడ్డాయి). ఈదుల్ ఫితర్, ఈదుల్ అజ్హా (బక్రీద్)

పండుగ తరువాత వరుసగా మూడు రోజాలు మొత్తం ఈ అయిదు రోజులు కూడా ఉపవాసం పాటించకూడదు.

రోజా : ఫర్జ్

రోజా (ఉపవాసం) ప్రతీ ముస్లిం స్త్రీ పురుషులపై, ప్రాజ్ఞ వయస్సు వచ్చిన వారిపై, ఆరోగ్యవంతులపై తప్పనిసరి చేయబడింది. ఈ రోజాలను తిరస్కరించిన వాడు ‘కాఫిర్'(దైవ దిక్కారి) అవుతాడు. ఎ కారణమూ లేకుండా రమజాన్ ఉపవాసాలను వదలివేసినవాడు ఘోర అపరాధానికి గురవుతాడు.

ప్రాజ్ఞ వయస్సుకు చేరుకొని పిల్లలపై ఉపవాసం తప్పనిసరి (విధి) కాదు. అయితే ఉపవాసం ఉండేందుకు చిన్న నాటి నుండే అలవాటు చేసుకోవటంలో తప్పులేదు. పిల్లవాడికి 7 సంవత్సరాలు నిండితే నమాజ్ కోసం ఆగ్నాపించామనీ, 10 ఏండ్లు నిండిన మీదట కూడా పిల్లోడు నమాజ్ చేయకపోతే దండించాలని హదీసుల ద్వారా తెలుస్తోంది. చిన్న పిల్లల్లో ఎన్ని ఉపవాసాలు పాటించ గల శక్తి ఉంటుందో అన్ని ఉపవాసాలు పాటించటం ఉత్తమం.

రోజా నుండి మినహాయింపు ఎవరికీ?

ఈ క్రింద పేర్కొనబడిన వారికి ఉపవాసం నుండి మినహాయింపు లేక రాయితీ ఉంది:

1 ) చిన్న పిల్లలు, బాటసారులు, అయితే ప్రయాణం వాళ్ళ తమకు ఎలాంటి కష్టం, బాధ ఉండదు అని ప్రయాణీకులు తలపోసినప్పుడు ఉపవాసం ఉండటమే ఉత్తమం. అయితే వదలి వేయబడిన ఉపవాసాలను వారు రమజాన్ నెల అనంతరం పూర్తి చేసుకోవాలి.

2 )  ఉపవాసం ఉండటానికి వీలుపడనంతగా వ్యాధి గ్రస్తులైనప్పుడు, ఉపవాసం పాటించటం వలన మరింత వ్యాధి తీవ్రమవుతుందన్న భయం ఉన్నప్పుడు. ఆరోగ్యం చేకూరిన తరువాత వీరు వదలి వేయబడిన ఉపవాసాలను పూర్తి చేసుకోవాలి.

3) వృద్ధాప్యం మరీ ఎక్కువయినప్పుడు, అయితే ఇలాంటివారు స్తోమత ఉంటె ‘ఫిదియా’ ఇవ్వాలి. అంటే, ఉదయం, సాయంత్రం ఒక బీదవానికి కడుపునిండా అన్నం పెట్టాలి.

4 ) గర్భవతులకు ఉపవాసం నుండి మినహాయింపు ఉంది. ఉపవాసం ఉండటం మూలాన తనకు ప్రమాదం ఉందని ఆ గర్భవతి తలపోసినప్పుడు ఉపవాసం వదలివేయవచ్చు.

5 ) బాలింతలు-ఉపవాసం పాటించటం వలన తనకు, తన పసికందుకు నష్టం వాటిల్లుతుందని భావించినపుడు, అయితే రమజాన్ తర్వాత ఆమె ఆయా ఉపవాసాలను ఖాజా చేసుకోవాలి.

6 ) తాము ఇక ఉపవాసాన్ని కొనసాగిస్తే ఆకలి దప్పులకు తాళలేక చనిపోతాం అన్న సందేహం వచ్చేసినప్పుడు.

7 ) మతి స్థిమితం లేనప్పుడు.

8 ) ఋతుస్రావం (హిజ్), పురిటి రక్త స్రావం (నిఫాజ్)కు లోనయి వున్నా స్త్రీలు ఉపవాసం పాటించరాదు.

ఉపవాస సంకల్పం

ఉపవాసం కోసం సంకల్పం చేసుకోవటం అవసరం. సంకల్పం చేసుకోకుండా వేకువ జాము మొదలుకుని సూర్యాస్తమయం వరకు ఆకలి దప్పులతో బాధపడినంత మాత్రాన ఉపవాస వ్రతం పూర్తి కానేకానేరాడు. రాత్రి గాని, ఉషోదయానికి ముందుగాని సంకల్పం చేసుకోవాలి. ఒక వేళ మరచిపోతే ఉదయం 11 గంటల్లోపు తప్పకుండా సంకల్పం చేసుకోవచ్చు.

సంకల్పం అంటే మనసులో తలచుకోవటమే. నోటితో పలకాలన్న నిబంధన ఏదీ లేదు. ఒక వేళ నోటితో పలికితే అది తప్పు కూడా కాదు.

ఇఫ్తార్:దుఆ

”అల్లాహుమ్మ లాక సుమతు వ అలయిక తవ్వక్కల్తు వ అల రిజ్ఖిక అఫ్తర్తు”

”(ఓ అల్లా హ్! నేను నీ కోసం ఉపవాసం పాటించాను. నిన్నే నమ్ముకున్నాను. నీవిచ్చిన ఆహారంతోనే ఇఫ్తార్ చేస్తున్నాను

రోజా : పుణ్యప్రదమయిన అంశాలు

ఉపవాసాలు ఈ క్రింది విషయాలను పాటించడం వలన పుణ్య ఫలం అధికంగా ప్రాప్తమౌతుంది:

1 ) ఉపవాసులు ‘సహ్రీ’ భుజించటం అవసరం. అంటే తెల్లవారు జామున ఏదన్నా తినాలి, త్రాగాలి; ఆకలి లేకపోతే కొద్దిగానయినా తినాలి, త్రాగాలి.

2 ) ఉపవాసం పాతిన్చాబోతున్నానని రాత్రి నుండే సంకల్పం చేసుకోవటం మంచిది.

3 ) సహ్రీ చేయటంలో నింపాదిగా వ్యవహరించాలి. ఆఖరి క్షణం వరకు సహ్రీ భుజించాలి. అయితే ఉషోదయానికి పూర్వమే సహ్రీ ముగించాలి.

4 ) ఇఫ్తార్ చేయటంలో (ఉపవాసం విరమించాతంలో) త్వరపడాలి. అంటే సూర్యాస్తమయం జరిగిన తర్వాత ఆలస్యం చేయరాదు.

5 ) ఉపవాసి చాడీలు, అబద్ధాలు చెప్పకుండా జాగ్రత్త పడాలి, బూతుమాటలకు, చెడు చేష్టలకు దూరంగా ఉండాలి.

6 ) దానధర్మాలు విస్తృతంగా చేయాలి. రోజేదార్లు దివ్య ఖుర్ఆన్ను వీలయినంత ఎక్కువగా పారాయణం చేయాలనీ, దైవాన్ని సాధ్యమయినంత అధికంగా స్మరించాలని, దరూద్ పంపుతూ ఉండాలనీ, హదీసుల ద్వారా రూఢీ అవుతోంది.

7 ) ఖర్జూరంతో ఇఫ్తార్ చేయటం, ఖర్జూరం లేని పక్షంలో మంచి నీళ్ళతో ఇఫ్తార్ చేయటం పుణ్యప్రదం.

ఉపవాసంలో మక్రూహ్లు (అవాంఛనీయమైన అంశాలు)

ఉపవాసం పాటించే వారు కొన్ని విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. వీటికి వారు దూరంగా ఉండలేకపోతే రోజా (ఉపవాసం) మక్రూహ్ అవుతుంది. అంటే; పుణ్య ఫలం కొంత తగ్గిపోతుంది. అవి ఏమంటే;

1 ) ఏదయినా నోటిలో వేసుకుని నమలటం.

2 ) ఏదయినా వస్తువు రుచి చూడటం (అయితే ఒక వేళ భర్త కోపిష్టి అయినపుడు, తాను వండిన కూరలో ఉప్పు లేదన్న సాకుతో హిమ్సిస్తాడన్న భయం ఉన్నప్పుడు, నాలుక కొనతో కూర రుచి చూడటానికి భార్యకు అనుమతి ఉంది).

3 ) మల మూత్ర విసర్జన సమయంలో కాళ్ళను మరీ ఎక్కువగా చాపి కూర్చోవటం.

4 ) వుజూ చేసేటప్పుడు – ముఖ్యంగా పుక్కిలిన్చేతప్పుడు, ముక్కులో నీటిని పీల్చేటప్పుడు మితిమీరి వ్యవహరిం చటం.

5 ) నోటిలో ఒకేసారి ఎక్కువ లాలాజలాన్ని (ఉమ్మిని) సమీకరించి మ్రింగివేయటం.

6 ) చాడీలు చెప్పటం, అబద్ధాలు పలకటం, తిట్టడం మొదలగు చేష్టల వలన.

7) ఉపవాసం వలన బాధ కలిగిందన్న భావాన్ని ప్రదర్శించటం.

8 ) స్నానం (గుసుల్) చేయవలసిన అనివార్య పరిస్థితి గనక ఏర్పడితే, తెల్లవారాక చేద్దామని ఉద్దేశ్యపూర్వకంగా ఆలస్యం చేయటం.

9 ) ఉపవాసం ఉంది బొగ్గుతోనూ, పండ్లపోదితోనూ పళ్ళు తోముకోవటం. మొదలగునవి.

ఎట్టి పరిస్థితుల్లో రోజా మక్రూహ్ కాదు?

క్రింద పేర్కొనబడిన పనుల వలన రోజేదార్ (ఉపవాసి) ‘రోజా’ కు ఎలాంటి దోషం గాని, లోపం గాని రాదు. ‘రోజా’ భంగం అయ్యే ప్రశ్నే తలెత్తలేదు, అవి ఏమిటంటే;

1 ) సుర్మా (ఇది కంటి చలువ కోసం పూసుకునే ఒక ప్రత్యేకమయిన పొడి) పూసుకోవటం వలన.

2 ) వంటిపై నూనె రాసి తోముకోవటం వలన.

3 ) చల్లదనం కోసం స్నానం చేయటం వలన, తలపై నీళ్ళు పోసుకోవటం వలన,

4 ) మిస్వాక్ చేయటం వలన.

5 ) సుగంధ ద్రవ్యాలు పూసుకోవటం లేక వాసన చూడటం వలన.

6 ) మరచిపోయి పొరబాటున ఏదన్నా తినటం, త్రాగటం వలన.

7 ) మన ప్రమేయం లేకుండా-దానంతట అదే వాంతి అయిపోవటం వలన.

8 ) నోటిలోని ఉమ్మి గొంతులోకి దిగిపోవటం వలన.

9 ) దోమ గాని, ఈగ గాని యాద్రుచ్చికంగా గొంతులోకి వెళ్ళిపోవటం వలన.

10 ) ఉపవాసం ఉన్నప్పుడు, భార్యను ముద్దు పెట్టుకునేందుకు కూడా అనుమతి ఉంది. అయితే కోర్కెలు, భావోద్రేకాలను రేచ్చాగోత్తరాదన్నది షరతు.

హజ్రత్ అబూ హురైరా (ర.అ) ఉల్లేఖించిన హదీసు ఒకటి ఇలా ఉంది.

ఒకసారి ఒక వ్యక్తి మహా ప్రవక్త (స.అసం) సన్నిధికి వచ్చి, ఉపవాస స్థితిలో భార్యను ముద్దు పెట్టుకోవచ్చా? అనడిగాడు. అందుకు ప్రవక్త(ససం), ఆ వ్యక్తి కోసం అనుమతి యిచ్చారు. మరో వ్యక్తి కూడా వచ్చి అదే సందేహం లేవనెత్తాడు. అయితే ప్రవక్త (సఅసం) అతన్ని వారించారు. ప్రవక్త ఎవరికయితే అనుమతి ఇచ్చారో ఆ వ్యక్తి ముసలివాడు. రెండో వ్యక్తి పడుచువాడు.

11 ) ఉపవాస స్థితిలో వైద్య అవసరాల్ దృష్ట్యా శరీరం నుండి రక్తం తీయటానికి కూడా అనుమతి ఉంది.

12 ) పగటి పూట, ఎలాంటి ఉద్రేకం లేకుండానే వీర్య స్థలం జరిగితే ఉప్వాసానికి ఎలాంటి ప్రమాదం లేదు.

ఉపవాసం భంగమయ్యే పరిస్థితులు

తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే తప్ప ఉపవాసాన్ని భంగపరచటం మహా పాపం. ఉపవాసం భంగమయ్యే పరిస్థితులు రెండు:

(అ) కొన్ని పరిస్థితులో భంగమయిన ఉపవాసానికి బదులుగా మరో ఉపవాసం ఉంటే (అంటే, ఖజా రోజాను పాటిస్తే) సరిపోతుంది.

(ఆ) కొన్ని పరిస్తితులోనయితే, ఉపవాసాన్ని భంగపరచినందుకుగాను ఆ ఉపవాసాన్ని పూర్తి చేసుకోవటంతో పాటు కఫ్ఫార (పరిహారం) కూడా చెల్లించవలసి ఉంటుంది. పరిహారంగా రెండు నెలల పాటు నిరంతరాయంగా ఉపవాసం పాటించాలి. నిరంతరాయంగా రెండు నెలలపాటు ఉపవాసం పాటించే శక్తి లేకపోతే 60 మంది బీద వారికి రెండు పూటలు కడుపు నిండా అన్నం పెట్టాలి. లేక ఒక బానిసకు విముక్తి నొసగాలి.

ఖజా మరియు మూల్యం చెల్లించవలసిన పరిస్థితులు:

1. ఉపవాసం ఉండీ ఉద్దేశ్యపూర్వకంగా ఆహారం లేక మరేదయినా రుచికరమైన పదార్ధం సేవించటం వలన.

2 . తెలిసి సంభోగం చేయటం వలన.

పై రెండు పరిస్థితుల్లో కూడా ఖజా రోజా పాటి౦చట౦తో పాటు, పరిహారం కూడా చెల్లించాల్సిందే.

1. సంభోగం: ఎవరైతే ఉపవాసం ఉండి-సంభోగం చెయ్యటం వలన ఉపవాసం భంగమవుతుందని తెలిసి కూడా ఆ పని చేస్తారో వారి ఉపవాసం భంగమైపోతుంది. మరి

వారు ఆ ఉపవాసాన్ని పూర్తి చేసుకోవతంతోపాటు పరిహారం కూడా చెల్లి౦చవలసిందే.

హజ్రత్ అబూహురైరా (ర.అ) ఉల్లేఖించారు. ఒకసారి ఒకతను మహాప్రవక్త (స అ సం) సన్నిధికి వచ్చి “ఓ దైవ ప్రవక్తా! నేను నాశానమైపోయాను.”

అన్నాడు. ప్రవక్త(స అ సం) అడిగారు – ” ఏమిటి? నువ్వెలా నాశనం అయ్యావు? దానికి ఆ వ్యక్తి, “నేను రమజాన్ లో (ఉపవాసం ఉండి) నా భార్యతో సంభోగించాను.

ప్రవక్త (స అ సం) అడిగారు – “నువ్వు ఒక బానిసకు స్వాతంత్ర్యం యివ్వగలవా?”

“లేదు”

“పోనీ, నువ్వు రెండు మాసాల పాటు ఎడతెగకుండా ఉపవాసం పాతిన్చాగాలవా?

“లేదు”

“నువ్వు 60 మంది నిరుపేదలకు అన్నం పెట్టగలవా?”

“అదీ నా వల్ల కాదు”.

అన్నిటికీ “లేదు” అని సమాధానం యిచ్చిన ఆ వ్యక్తి మహా ప్రవక్త(స అ సం) దగ్గరే కాస్సేపు కూర్చున్నాడు. అంతలో మహా ప్రవక్త(స అ సం) వద్దకు ఒక చేత వచ్చింది. అందులో కొన్ని ఖర్జూరపు పండ్లు ఉన్నాయి. మహా ప్రవక్త ఆ వ్యక్తితో “చూడు! ఖర్జూరపు పండ్లు దానం చెయ్యి” అని సలహా ఇచ్చారు. దానిపై

ఆ వ్యక్తి ఇలా అన్నాడు, ”నా కంటే కూడా ఎక్కువ లేమికి గురయిన వారికి దానం చెయ్యమంటారా? మదీనాలో మమ్ము మించిన అగత్య పరుల ఇల్లు మరేదీలేదు.”  ఈ జవాబు విని మహా ప్రవక్త (సఅసం) పెద్దగా నవ్వేశారు. తరువాత ఆయన (సఅసం) అన్నారు వెళ్ళు, నీ ఇంటి వారికి ఇవి తినిపించు.” (బుఖారీ, ముస్లిం, అబూదావూద్, తిర్మిజి. నిసాయి, ఇబ్ను మాజా)
2 . వాంతి: ఎవరైనా ఉపవాసం ఉంది ఉద్దేశ్య పూర్వకంగా (బలవంతం మీద) వంటి చేసుకుంటే అతని ఉపవాస వ్రతం భంగమైపోతుంది.
అయితే అతను పరిహారం చెల్లించనవసరం లేదు. భంగమైన ఉపవాసాన్ని తర్వాత పూర్తి చేసుకుంటే సరిపోతుంది.

అలా కాకుండా ఎవరికైనా యాదృచ్చికంగా వాంతి అయిపోతే ఉపవాసం భంగం కాదు. అయితే ఆ వాన్తిని గనక మ్రింగితే ఉపవాసం భంగమైనట్లే.

3 . తెలిసే తినటం: ఉపవాసంలో – తెలిసి కూడా అన్న పానీయాలను సేవిస్తే ఉపవాసం భంగమయిపోతుంది. దీనికి ఖాజా మరియు కఫ్ఫార(పరిహారం) రెండూ చెల్లించాల్సిందే.

రోజేదార్ మరచిపోయి ఏదైనా తినటం, త్రాగటం వలన ఉపవాసం భంగం కాదు. ఒకవేళ అది తక్కువ పరిమాణంలో ఉన్నా సరే, ఎక్కువ షరిమానంలో ఉన్నా సరే.

హజ్రత్ అబూ హురైరా (ర.అ) ఉల్లేఖించారు- ఒక వ్యక్తి మహనీయ ముహమ్మద్ (స అ సం) దగ్గరికి వచ్చి “నేను ఉపవాస స్థితిలో మరచిపోయి అన్న పానీయాలు సేవించాను” అన్నాడు. దానికి ఆయన (స అ సం) ఇలా అన్నారు: “నిన్ను అల్లాహ్ తినిపించాడు, త్రాపించాడు.” (బుఖారీ, ముస్లిం, తిర్మిజి, నిసాయి)

4 . వేలకు ముందు ఇఫ్తార్ చేయటం: ఎవరైనా, ఇంకా తెల్లవారలేదనుకుని ‘సహ్రీ’ భుజిస్తూ కూర్చుంటే, తెల్లవారిపోయిందని తరువాత వారికి బోధపడితే – ఆ ఉపవాసం భంగమయినట్లే లెక్క. అదే విధంగా, సూర్యాస్తమయం అయిన్దనుకుని “ఇఫ్తార్” చేసిన తరువాత సూర్యాస్తమయం ఇంకా కాలేదని తెలిస్తే ఆ రోజా భంగమయినట్లే. ఈ రెండు రకాల (భంగామయిన) ఉపవాసాలను తరువాత పూర్తి చేసుకోవలసి ఉంటుంది.

5 . రుతుస్రావం, పురిటి రక్త స్రావం: ఏ స్త్రీ అయినా, తాను ఉపవాస వ్రతం పాటిస్తుండగా పగటిపూట ఏ వేళయినా సరే బహిష్టు అవుతే ఆ క్షణమే ఆమె ఉపవాసం భంగమైపోతుంది. అయితే ఆ ఉపవాసాలను ఆమె రమజాన్ అనంతరం పూర్తి చేసుకోవాలి. పురిటి రక్త స్రావం జరిగే స్త్రీ కూడా ఉపవాసం ఉండజాలదు.

6 . సంకల్పాన్ని విరమించుకోవటం: సంకల్ప పూర్వకంగా ఉపవాసం పాటిస్తూ, మధ్యలో సంకల్పాన్ని ఉపసంహరించుకుంటే ఆ రోజు ఉపవాసం భంగమయిపోతుంది. ఆ

ఉపవాసాన్ని తరువాత పూర్తి చేసుకోవటం ఆ వ్యక్తి బాధ్యత. ఎందుకంటే ఉపవాసానికి సంకల్పం ప్రధానం. ఎప్పుడైతే సంకల్పం లేదో అప్పుడు ఉపవాసం కూడా లేదన్నమాట.

7 . ఏదైనా మ్రింగటం: నోటిద్వారా ఏదైనా వస్తువు లేక ఏదైనా పదార్ధం, (అది ఆహారమైనా మరేదయినా) గొంతులోకి దిగిపోతే కూడా ఉపవాసం భంగమయిపోతుంది. దీనికి పరిహారం చెల్లి౦చనక్కరలేదు. కేవలం ఖజా చేసుకుంటే చాలు.

తరావీహ్ నమాజ్

శుభాల సరోవరమయిన రమజాన్ నెలలో వీలయినంత అధికంగా దైవధ్యానం చేయమనీ, దివ్య ఖుర్ఆన్ను కనీసం ఒకసారయినా పూర్తిగా పారాయణం చేయమని మహాప్రవక్త (సఅసం) బోధించారు. ముఖ్యంగా రామజన్లో- రాత్రిపూట దైవారాధనలో గడపటం పుణ్య ప్రదమని హదీసుల ద్వారా రూఢీ అవుతోంది.

అందుకే రమజాన్ నెలలో ముస్లిం స్త్రీ పురుషులకోసం తరావీహ్ నమాజ్ “సున్నతే ముఅక్కిద” గా ఖరారు చేయబడింది. తరావీహ్ నమాజ్ వేళ ఇషా నమాజ్ తర్వాత ప్రారంభమయి సహ్రీ వేళ వరకూ ఉంటుంది.

తరావీహ్ నమాజ్ని వ్యక్తిగతంగా కూడా చేయవచ్చు సామూహికంగా కూడా చేయవచ్చు. సామూహికంగా తరావీహ్ నమాజ్ సలపటం ఉత్తమం.

తరావీహ్ నమాజ్ యొక్క జామాఅత్ పురుషులకోసం “సున్నతే కిఫాయ” అవుతుంది. వ్యక్తిగతంగా కూడా తరావీహ్ నమాజ్ చేయవచ్చు గాని సామూహికంగా చేయటం వలన చేకూరే ప్రయోజనాలు వ్యక్తిగతంగా చేయటంలో చేకూరవు.

స్త్రీలు కూడా తరావీహ్ నమాజ్ సామూహింకంగా చదువవచ్చు. స్త్రీలకు స్త్రీ నాయకత్వం (ఇమామత్) వహించవచ్చు. అయితే పురుషుల జామాఅత్లో మాదిరిగా

“స్త్రీ ఇమామ్” ముందు వరసలో కాకుండా స్త్రీల వరుసలోనే నిలబడి ఉండాలి. ” ఫర్జ్”, “వితర్” నమాజ్లలో స్త్రీలు స్త్రీలకు నాయకత్వం వహించలేరు. పురుషులు కూడా స్త్రీల సామూహిక నమాజ్కి నాయకత్వం వహించవచ్చు. అయితే ఇమామత్ వహించేవారి భార్యగాని, సోదరిగాని, తల్లిగాని ఆ స్త్రీలలో ఉండాలన్నది నిబంధన.

తరావవీహ్’తరావవీహ్’ అనేది అసలు ‘రాహత్’ నుండి వచ్చింది. రాహత్ అంటే విశ్రాంతి అని అర్థం, అంటే, విశ్రాంతి తీసుకుని మరీ చేయవలసిన నమాజ్ అని భావం.

తరావవీహ్ నమాజ్ని రెండేసి రకాతుల చొప్పున విడదీసి చేయమని దైవ ప్రవక్త ఉపదేశించారు. (బుఖారీ, ముస్లిం)

మహా ప్రవక్త (స అ సం) సహచరులు కూడా రెండేసి రకాతుల చొప్పున తరావీహ్ చదివేవారు. ప్రతి నాలుగు రకాతుల తరువాత విశ్రాంతి తీసుకునేవారు. కాస్సేపు తరువాత మళ్ళీ నమాజ్ చేసేవారు. విశ్రాంతి సమయంలో ‘తస్బీహ్’ చేయవచ్చు, దుఆ చేయవచ్చు. తస్బీహ్ సామూహికంగా బిగ్గరగా పఠి౦చటం ‘మక్రూ’

తారావీహ్ లో ఒకసారి పూర్తి ఖుర్ఆన్ పఠి౦చటం సున్నత్. ఒక వేల హాఫిజె ఖుర్ఆన్ (ఖుర్ఆన్ సంస్మర్త) అందుబాటులో లేకపోతే అలం తర సూరా నుండి చిన్న సూరాలే పఠి౦చవచ్చు.

తారావీహ్ ఆజ్ఞ

౧) హజ్రత్ ఆయిషా (ర అ) ఉల్లేఖించారు:”మహా ప్రవక్త (సఅసం) రామజాన్లో ఇషా నమాజ్ తర్వాత తారావీహ్ నమాజ్ చేస్తే చాలా మంది అనుచరులు ఆయనతో కలిసి నమాజ్ సలిపారు. రెండో రాత్రి ఆయన (సఅసం) నమాజ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది ఆయన్ని అనుసరించారు. మూడో రోజు, నాల్గో రోజు రాత్రులలో కూడా సహచరులు విపరీతంగా గుమికూడారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రవక్త (సఅసం) ఇంటి నుండి బయటికి రాలేదు. తెల్లవారిన తర్వాత ఆయన (సఅసం) అన్నారు: ‘రాత్రి ప్రజలు యిక్కడ గుమికూడి ఉండటాన్ని నేను చూశాను. అయితే ఈ నమాజ్ మీపై ఎక్కడ ఫర్జ్గా (విధిగా, తప్పని సరిగా) నిర్ణయించ బడుతుందోనన్న శంక నన్ను బయటకు రాకుండా చేసింది.’

(బుఖారీ, ముస్లిం, అబూదావూద్, నిసాయి, ఇబ్నేమాజ)

) హజ్రత్ అర్ఫజ్ (ర అ) ఇలా అంటున్నారు

‘హజ్రత్ alee (ర అ) రమజాన్ రాత్రుల్లో నమాజ్ చేయమని ఆదేశించేవారు. పురుషుల కోసం వేరుగా, స్త్రీలకి వేరుగా ఇమామ్ నాయకులను నిర్దారించేవారు. నేను స్త్రీల సామూహిక నమాజుకు నాయకత్వం వహించేవాడిని

తరావీహ్ ప్రాధాన్యత

రమజాన్ నెలలో తరావీహ్ నమాజ్ చేయటం, దైవారాధనలో ఎక్కువ సేపు గడపద్తం శుభప్రదం. రమజాన్ రాత్రుల్లో నమాజ్ సలపమని మహా ప్రవక్త (స అ సం) తన అనుచరులకు ప్రబోధించేవారు. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆంక్షలు మాత్రం లేవు. ఎవరైతే నిష్కల్మషమైన విశ్వాసంతో, దైవ ప్రసన్నతా లక్ష్యంతో రమజాన్ రాత్రుల్లో దైవారాధనలో గడిపారో వారి గత అపరాధాలు, జరగబోయే అపరాధాలు క్షమిన్చాబదతాయని మహా ప్రవక్త (సఅసం) ప్రవచించారు.

సమయం

తరావీహ్ నమాజ్ వేళ రాత్రి ఇషా నమాజ్ నుండి ప్రారంభమయి సహ్రీ వేళ వరకూ ఉంటుంది. అయితే రాత్రి పొద్దుపోయాక తరావీహ్ నమాజ్ సలపటం ఉత్తమం.

తరావీహ్ నమాజ్ పూర్తయిన తరువాత ‘విత్ర్’ నమాజ్ చేయడం మంచిది. అలా కాకుండా ఎవరైనా ఇషా నమాజుతో పాటు విత్ర్ నమాజ్ కూడా చేసేసి, జాము రాత్రిన తరావీహ్ చేసిన పక్షంలో, ఆటను మరోసారి విత్ర్ నమాజ్ చేయనవసరం లేదు. ఎందుకంటే ఒక రాత్రిలో విత్ర్ నమాజ్ ఒకేసారి చేయబడుతుంది.

తరావీహ్ ఎన్ని రాకతులు?

తరావీహ్ రకాత్ల సంఖ్య ఎంత? అన్న విషయంపై రెండు రకాల ఉల్లేఖనాలు ఉన్నాయి. దేవుని అంతిమ ప్రవక్త (స అ సం) తరావీహ్ నమాజ్ 8 రకాతులే చదివినట్టు ఆధారాలున్నాయి. అయితే హజ్రత్ ఉమర్ మరియు ఇతర సహచరుల ద్వారా 20 రకాతులు అని కూడా తెలుస్తోంది

ఈ విషయంలో విభేదాలకు, ఘర్షణలకు తావులేదు.

తరావీహ్ నమాజ్ని వ్యక్తిగతంగా కూడా చేయవచ్చు. సామూహికంగా కూడా చేయవచ్చు. అయితే సామూహికంగా మస్జిద్లో ఈ నమాజ్ చేయటం ఉత్తమం.

తప్పనిసరి పరిస్థితుల్లో తరావీహ్ కూర్చుని కూడా చేయవచ్చు. అనివార్య కారణాల వల్ల ఇమామ్ కూర్చుని కూడా తరావీహ్ నమాజ్ చేయించవచ్చు.

మహా ప్రవక్త (స అ సం) పరమపదించిన తర్వాత ప్రజలు మస్జిద్లలోనూ, ఇండ్లలోనూ, వ్యక్తిగతంగానూ సామూహికంగానూ – రకరకాలుగా తరావీహ్ నమాజ్ చేసేవారు. ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర అ) తన హయాములో, ముస్లిములన్దరినే మస్జిదులో సమీకరించి తరావీహ్ నమాజ్ని సామూహికంగా చేయించారు.

ఎవరైనా మాస్జిద్కు ఆలస్యంగా వస్తే వారు – ముందు ఫర్జ్ నమాజ్ చేశాకనే తరావీహ్ నమాజ్లో పాల్గొనాలి. వదలివేయబడిన తరావీహ్ నమాజ్ని ఆఖరిలో గాని, వీలుంటే మధ్యలో గాని పూర్తి చేసుకోవాలి.

తరావీహ్ ఖిరాత్

తరావీహ్ నమాజ్లో ఖిరాత్ గురించి, అంటే: ఒక్కో రకాతులో ఖుర్ఆన్ లోని ఎంత భాగం లేక ఎన్ని ఆయతులు పఠి౦చాలి? అనే విషయమయి ఖచ్చి

తమయిన ఆధారాలు లేవు. అయితే ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర అ) కాలంలో – తరావీహ్ నమాజ్లో – ఇమాములు వందేసి ఆయతులు పఠి౦చేవారని ఒక ఉల్లేఖనం ఉంది.

ఆఖరికి ముఖ్తదీలు ఊత కర్రల సహాయంతో నమాజ్లో నిలబడి ఉండేవారని, ఫజ్ర్ నమాజ్కు ముందు వరకూ తరావీహ్ నమాజ్ కొనసాగుతూ ఉండేదని తెలుస్తోంది.

అయితే ఎక్కువ సేపు చదవటం అన్నది ఆయా ప్రజల సౌలభ్యాలు, వారి ఓపికపై ఆధార పది ఉంటుంది.

ఖుర్ఆన్ పారాయణానికి వేతనం ఇవ్వరాదు

అజాన్ పిలుపు యిచ్చే వారికి, ఫర్జ్ నమాజ్లకు ఇమామత్ చేసే వారికి, ఖుర్ఆన్ను బోధించేవారికి వేతనం యివ్వటం సమంజసం మరియు సమ్మతమే. ఎందుకంటే వీరికి గనక జీతం యివ్వకపోతే ఈ వ్యవస్థే నడవదు.

అయితే తరావీహ్ నమాజ్ స్థాయి వీటిలో సరిపడదు. కాబట్టి తరావీహ్ నమాజ్ చదివించే వారికి జీతం యివ్వటం ‘హరాం’ అని ముస్లిం ధర్మవేత్తలంటారు. వేతనం నిర్ధారించటం అన్నది తరువాతి సంగతి, కనీసం ఆ మేరకు సంకల్పం చేసుకోవడానికి కూడా వీలు లేదు. అయితే ఖుర్ఆన్ సంస్కర్త నిరుపేద వాడయిన పక్షంలో ప్రజలు ఆయనకు ఏదయినా బహుమతి ఇవ్వదలిస్తే అది వేరే విషయం.

హెచ్చరిక

ఒకే రాత్రిలో లేక మూడు రాత్రుల్లో ఖుర్ఆన్ మొత్తం – తరావీహ్ లో – పూర్తి చేయాలన్న ఆచారం ఈ మధ్య సర్వసాధారణమవుతూ ఉంది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. దివ్య ఖుర్ఆన్ను ఆగి ఆగి – అర్థమయ్యే రీతిలో పారాయణం చేయాలని అజ్ఞాపించబడింది. ఖుర్ఆనీ ఆయతులు అర్థం కాని విధంగా అత్యంత వేగంగా పఠి౦చట౦ పాపం కూడా. అదీ గాక, తరావీహ్ నమాజ్లో గంటల తరబడి ఉపవాసులను నిలబెట్టడం భావ్యం కూడా కాదు.

లైలతుల్ ఖద్ర్

إنا أنزلناه في ليلة القدر. وما أدراك ما ليلة القدر. ليلة القدر خير من ألف شهر. تنزل الملائكة و الروح فيها پإذن ربهم من كل أمر. سلام هي حتى مطلع الفجر

మేము దీన్ని (ఖుర్ఆన్ని) ఘనమయిన రాత్రిన అవతరింపజేశాము. ఘనమయిన రాత్రి గురించి మీకేం తెలుసు? ఘనమయిన రాత్రి వేయి నెలలకంటే కూడా శ్రేష్టమయినది. దైవ దూతలు మరియు ఆత్మ (జిబ్రయీల్ అలైహిస్సలాం) తమ ప్రభువు అనుమతితో, ప్రతీ అనుజ్ఞతో ఆ రాత్రి దిగి వస్తారు. ఆ రాత్రి శాంతియుతమయినది. శుభోదయం వరకు. (అల్ ఖాదర్- 1-5 )

ఏడాది మొత్తంలో శుభప్రదమయినది రమజాన్ నెల. కాగా, రమజాన్ నెలలో అత్యంత విలువయిన, పుణ్య ప్రదమయిన రేయి ఒకటి ఉంది. ఆ రాయిని అన్వేషిచి, దాన్ని పొంది పశ్చాత్తాప భావంతో దైవ సన్నిధిలో గడిపిన వ్యక్తీ నిజంగా ధన్యుడు. అతని గత అపరాధాలన్నీ మన్నించబడతాయి. కారుణ్య ప్రదాయిని అయిన ఆ రేయిని పొంది కూడా, దాన్ని పోగొట్టుకున్న వాడిని మించిన దౌర్భాగ్యుడు మరొకడుండడు అని మహా ప్రవక్త (సఅసం) ప్రవచనాల ద్వారా తెలుస్తోంది.

1 . ఒక హదీసులో ఉంది –

“మహా ప్రవక్త ముహమ్మద్ (సఅసం) ప్రవచించారని హజ్రత్ అబూహురైరా (ర.అ) ఉల్లేఖించారు: “ఎవరయితే (నిష్కల్మషమయిన) విశ్వాసంతో మరియు పుణ్య ఫలాపేక్షతో షబెఖద్ర్ (ఘనమయిన రాత్రి) నందు దైవారాధనలో గడిపాడో అతని వాళ్ళ జరిగిన పాపాలు, జరగబోయే పాపాలు క్షమించ బడతాయి.

(బుఖారీ, అబూ దావూద్, అహ్మద్, నిసాయి, ఇబ్నుమాజ)

2 . హజ్రత్ ఆయిషా(ర.అ) ఉల్లేఖించారు:

“నేను మహా ప్రవక్త (స అ సం) అడిగాను, “ఓ దైవ ప్రవక్తా!

నేను గనక ఘనమయిన రాత్రిని పొందితే ఏమని ప్రార్థించాను?’ ఆయన ఉపదేశించారు ”అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ ఆఫ్వ ఫాఫు అన్నీ (ఓ అల్లాహ్) నీవు క్షమించే వాడవు. క్షమ అంటే నువ్వు యిష్టపడతావు. కనుక నన్ను క్షమించు. అని వేడుకో)”

ఏ ఏ రాత్రుల్లో అణవేషి౦చాలి?

అంతటి శుభ ప్రదమయిన ఆ రేయి, కారుణ్య ప్రభువు తరఫునుండి కదలి వచ్చిన ఆ కరుణా సాగరం రమజాన్ మాసంలోని ఏ రాత్రిన ఉంది? అన్నది ఖచ్చితంగా నిర్దారి౦చబడలేదు. దాని మర్మం, దాని పరమార్థం సర్వలోక ప్రభువైన అల్లాహ్కే బాగా తెలుసు! ఆఖరికి అంతిమ దిన ప్రవక్త (సఅసం)కు సయితం, అది ఫలానా రాత్రి అని ఇదమిత్తంగా తెలియదు. అయితే రమజాన్ మాసంలోని చివరి అయిదు బేసి రాత్రుల్లో (21 , 23 ,25 , 27 , 29 )ఆ శుభ ప్రదమైన రాత్రిని వెతకమని మహా ప్రవక్త (సఅసం) ఉపదేశించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.

బేసి రాత్రులకు సంబంధి౦చిన౦త వరకు కూడా వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. అయితే 27 వ రాత్రి “లైలతుల్ ఖద్ర్” ఉండటానికి ఎక్కువ ఆస్కారముందని ప్రవక్త సహచరుల ఉట౦కాలనుబట్టి తెలుస్తోంది.

ఒక హదీసులో ఇలా ఉంది.

“ఎవరయితే రమజాన్ మాసం అంతా క్రమం తప్పకుండా మగ్రిబ్, ఇషా నమాజ్ను సామూహికంగా చేశారో, వారు లైలతుల్ ఖద్ర్ యొక్క ఒక పెద్ద భాగాన్ని పొందారు.” (బైహఖీ)

పై హదీసుపై వ్యాఖ్యానిస్తూ కొంత మంది ఇస్లామీయ విద్వాంసులు, ‘ఈ ఘనమైన రాత్రి ఏడాది మొత్తంలో ఎప్పుడయినా ఆసన్నం కావచ్చు గణక్ నిత్యం దైవారాధనలో గడపాలని అన్నారు. ఇదిలావుండగా, రమజాన్ నెలలోని చివరి అయిదు బేసి రాత్రుల్లో (తాఖ్ రాత్రులు మాత్రమే) లైలతుల్ ఖద్ర్ ను పొందేందుకు ప్రయత్నించమని బలమయిన హదీసుల ద్వారా నిర్దారితమవుతోంది.

ఇంతటి శ్రేష్టమయిన రేయి ఫలానా తేదీ రాత్రిన అవరతరిస్తుందని విశ్వ ప్రభువు స్పష్టంగా ఎందుకు తెలియ జేయలేదు? అన్న ప్రశ్న క్జూడా జనిస్తుంది ఒక్కోసారి.

ఆ రాత్రిని అన్వేషించే తాపత్రయంలో తన దాసులు వీలయినంత ఎక్కువగా ఆరాధనలలో గడపాలని, తమ పాపాల క్షమాపణ కోసం మరింత అధికంగా వారు వేడుకోవాలన్నది కారుణ్య ప్రభువు ఉద్దేశ్యం కావచ్చు! సాటిలేని కరునామయుడాయన!

ముస్లిములకు మనవి

ముస్లిం సమాజం ఒక విషయాన్ని గమనించాలి. “లైలతుల్ ఖద్ర్” ను సద్వినియోగం చేసుకోవాలన్నది వారి లక్ష్యం కాగలగాలి. మ్స్జిడులకు విద్యుద్దీపాలు అలంకరించి, ఏదో ఉబుసుపోక మ్స్జిడులకు వచ్చినట్లు వచ్చి కాస్సేపు కబుర్లు చెప్పుకొని చల్లగా యింటికి వెళ్ళేవారు కొందరున్నారు. మిఠాయిలు, చాయల కోసం కాస్సేపు మేల్కొని ఆ తతంగం కాస్తా ముగియగానే నిశ్చింతగా ఇంటి దారి పట్టే మహానుభావులూ ఉన్నారు. ఆ రాత్రి 4 గంటల దాకా ఏకాగ్రతతో దైవారాధనలో గడిపి ఫజ్ర్ నమాజ్లో మాయమయ్యే ప్రబుద్ధులూ ఉన్నారు.

వారందరికీ ఓ మనవి.

“లైలతుల్ ఖద్ర్ ప్రాముఖ్యతను వారు గుర్తించాలి. నిస్సందేహంగా అల్లాహ్ క్షమా గుణం కలవాడు. క్షమను ఆయన ఎంతో ఇష్టపడతాడు. తన దాసుల అపరాధాలను ఆయన దయతో క్షమిస్తాడు.

అయితే ఏడాది అంతా దైవాదేశాలను ధిక్కరించి, ఇష్టారాజ్యం, చేసి, అపసవ్యమయిన, వ్యర్థమయిన ప్రలాపనలకు పాల్పడి ఏడాది కొకసారి – ఒకే రాత్రిన – తమ ప్రభువు సన్నిధికి వచ్చి పాపాల ప్రక్షాళన చేయమని అడగటం శుద్ధ అవివేకమే కాగలదు. సాలుకొకసారి అన్నం తిని మనం బ్రతకగాలమా?

ఆ రేయి, పశ్చాత్తాపభావంతో కుమిలిపోయి, ఇకపై దుష్కార్యాలకు చెడులకు దూరంగా ఉంటానని వాగ్దానం చేసి, మాట నిలబెట్టుకునే దాసులనే సర్వోన్నత ప్రభువు ఇష్టపడతాడు. దైవం మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక!

ఏతెకాఫ్ అంటే ఏదైనా ఒక దానితో సంబంధం ఏర్పరచుకోవటం అని అసలు అర్థం. ఇస్లామీయ పరిభాషలో ఏతెకాఫ్ అంటే దైవారాధనా సంకల్పంతో ఒక నిర్ణీత కాలం వరకు దైవ గృహంలో ఆగటం అని అర్థం.

మహనీయ ముహమ్మద్ (స అ సం) ఉపదేశించారని హజ్రత్ అబూ హురైరా (ర.అ) ఉల్లేఖించారు.

“కొందరున్నారు – వారు మస్జిదులకు గుంజల వంటివారు (అంటే, మస్జిదుల్లో కూర్చోవటాన్ని, దైవారాధనలో నిమగ్నులై ఉండటాన్ని ఇష్టపడేవారు). అలాంటి, వారికి తోడుగా దైవదూతలు ఉంటారు. ఒక వేళ వారు గనక వ్యాధిగ్రస్తులయి ఉంటే వారిని పరామర్శిస్తారు. ఇంకా, వారికి ఏదన్నా అవసరముంటే, ఆ అవసరం తీరటంలో దూతలు వారికి సహాయపడతారు.”

‘ఏతెకాఫ్’ వ్రతం పాటించేవారిని ‘మోతకిఫ్’ అని అంటారు. వారు కూర్చునే స్థలాన్ని ‘మోతకిఫ్’ అనంటారు.

ఏతెకాఫ్ వ్యవధి

రమజాన్ నెల 20వ తేదీ రాత్రి మొదలుకుని షవ్వాల్

మొదలుకుని షవ్వాల్ మాసపు నెలవంక కనిపించే వరకూ (మొత్తం పది రోజులు) ఏతెకాఫ్ వ్రతం పాటించటం ‘సున్నత్’ (ప్రవక్త ఆచరణ) గా కొనసాగుతూ ఉంది.

మహాప్రవక్త ముహమ్మద్ (స అ సం) రమజాన్ నెలలోని చివరి పది రోజుల్లో ఏతెకాఫ్ పాటించేవారని హజ్రత్ అబూ హురైరా (ర.అ) ఉల్లేఖనం ద్వారా రూడ్హీ అవుతోంది.

(బుఖారీ, ముస్లిం, అబూదావూద్, నిసాయి, అహ్మద్)

ఏతెకాఫ్ నియమాలు

1 . ఏతెకాఫ్ కోసం సంకల్పం చెసుకూవాలి. మనసులో సంకల్పం చేసుకున్నా సరిపోతుంది.

౨. ఏతెకాఫ్ పాటించేవారు – స్త్రీలైనా, పురుషులైనా – కేవలం మస్జిదులో మాత్రమె ఏతెకాఫ్ పాటించాలి. నివాసగృహం లేక మరేదైనా చోట ఏతెకాఫ్ కోసం కూర్చోరాదు. ఎందుకంటే దివ్య ఖుర్ఆన్లో ఏతెకాఫ్ను గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు మస్జిదును ప్రస్తావించటం జరిగింది.]

“మస్జిదులలో ఏతెకాఫ్ పాటించినపుడు, మీరు మీ భార్యలతో సంభోగించకండి”. (అల్ బఖరా)

3 . హజ్రత్ ఆయిషా(ర.అ ) ఉల్లేఖించారు: “మహనీయ ముహమ్మద్ (స.అ.సం) ఏతెకాఫ్ పాటిస్తున్న సమయంలో – మస్జిద్ నుండే తన తలను నా వైపుకు వంచేవారు. నేను ఆయన తల దువ్వేదాన్ని, ఎతేకాఫ్లో నుండగా ఆయన(ససన్) మానవ సహజమయిన అవసరం ఏర్పడితే తప్ప (మల, మూత్ర విసర్జన కోసం వెళ్ళ వలసి ఉంటే తప్ప) బయటికి వచ్చే వారు కాదు. ఆఖరికి వుజూ చేయవలసి ఉన్నా వచ్చేవారు కాదు”

(బుఖారీ, ముస్లిం, తిర్మిజి, అబూదావూద్, ఇబ్నుమాజ, నిసాయి)

4 . అజాన్ పిలుపు ఇచ్చే, జామాఅత్ నమాజ్ అయ్యే అన్ని మస్జిడులలోనూ ఏతెకాఫ్ పాటించవచ్చు.

5 . ఏతెకాఫ్ పాటించేవారు ఉపవాస వ్రతం కూడా పాటించే వారి ఉండాలి.

ఎతేకాఫ్లో పుణ్యప్రదమైన అంశాలు

“ఏతెకాఫ్ లో ఉన్నప్పుడు వీలయినంత అధికంగా దైవ ధ్యానం చేయాలి. దివ్య ఖుర్ఆన్ను ఎక్కువగా పారాయణం చేస్తూ ఉండాలి.

“సుబ్ హానల్లాహ్, అల్హందులిల్లాహ్, అల్లాహుఅక్బర్” అని వీలైనన్ని ఎక్కువ సార్లు పలకాలి. పాపాల క్షమా భిక్ష కోసం అల్లాహ్ను వేడుకోవాలి.

మహా ప్రవక్త (సఅసం) పై దరూద్ పంపాలి. హదీసు, ఫికహ్కు సంబంధించిన గ్రంథాలు పఠించడం కూడా పుణ్య ప్రదమేనని ఇమాం అబూహనీఫా (రహ్మా.లై), ఇమాం షాఫయీ (రహ్మా.లై), భావిస్తున్నారు, ముఖ్యంగా దివ్య ఖుర్ఆన్ను అర్థం చేసుకుని చదవటం పుణ్యం ప్రదం.

ఏతెకాఫ్; అయిష్టకరమైన విషయాలు.

1 . ఏతెకాఫ్ పాటించేవారు అనవసరమైన మాటల్లో, పనుల్లో కాలం వృధా చేయకూడదు.

మహనీయ ముహమ్మద్ ఉద్బోధించారు హజ్రత్ అబూహురైరా (ర అ) ఉల్లేఖించారు: “మానవుని ఇస్లాం బాగుందేందుకు వ్యర్థమైన మాటలు, పనికి రాణి చేష్టలకు దూరంగా ఉండటం కూడా అవసరమే”. (తిర్మిజి, ఇబ్నుమాజ)

2 . పుణ్య ఫలాపేక్షతో బొత్తిగా మౌనం వహించటం కూడా సబబు కాదు. ]

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (ర.అ) ఉల్లేఖించారు; మహా ప్రవక్త (స అ సం) ప్రసంగింస్తూ, ఒక వ్యక్తీ నిలబడి ఉండటం చూశారు. ఆ వ్యక్తీ గురించి ఆయన దర్యాఫ్తు జరపగా ప్రజలు అతని గురించి ఇలా తెలియ జేశారు: ‘ఇతని పేరు అబూ ఇస్రాయీల్. తను నిలబడే ఉంటానని, కూర్చోనని ఈతను నిశ్చయించుకున్నాడు.

తానెవరితోను మాట్లాడానని, ఆఖరకి తన నీడ కూడా ఎవరిపై పడరాదని ఇతను సంకల్పించుకున్నాడు. ఇంకా, ఉపవాసంతోనే ఉంటానని దీక్ష బూనాడు.”

ఆయన (స అ సం) ఉపదేశించారు: “మాట్లాడమనీ, కూర్చోమనీ, ఉపవాసాన్ని విరమించుకోమని అతనికి చెప్పండి.” (బుఖారీ, అబూ దావూద్, ఇబ్ను మాజా)

మరికొన్ని సూచనలు

1 . ఎతేకాఫ్లో ఉన్నప్పుడు పురుషులు తమ భార్యల ద్వారా తమ తలలు కడిగించుకోవటానికి, తల దువ్వుకోవటానికి అనుమతి ఉంది. ఈ కారణంతో వారు తలను మస్జిద్ నుండి బయటికి తీయవచ్చు.

2 . ఎతేకాఫ్లో ఉన్న వారిని కలుసుకోవడానికి మరెవరయినా వస్తే వారికి వీడ్కోలు యివ్వడానికి – ఎతేకాఫ్లో కూర్చున్న స్థలం వద్దనుండి లేవ వచ్చు.

3 . మొత్తం పది రోజులు ఏతెకాఫ్ వ్రతం పాటించాలి. ఒక వేళ ఎవరయినా అంతకంటే తక్కువ రోజులు ఏతెకాఫ్ పాటిస్తే తగిన పుణ్యం ప్రాప్తమవుతుందిగాని ‘సున్నత్’ మాత్రం నెరవేరదు.

4 . ఎతేకాఫ్లో నున్నవారు మస్జిద్లో ఒక ప్రత్యెక స్థలాన్ని తమ కోసమని ఎంచుకోవచ్చు. ఆ స్థలం చుట్టూ పరదా కట్టుకోవచ్చు. ఒంటరితనం, ఏకాగ్రత ప్రాప్తం కావాలన్నదే దీని పరమార్థం. అయితే తాము ఆక్రమించుకున్న జాగా మూలంగా ఆ మస్జిద్లో స్థలాభావం ఏర్పడకుండా, నమాజీలకు కష్టం కలుగకుండా జాగ్రత్తపడాలి. మస్జిదు మూలల్లో పరదా కట్టుకోవటం మంచిది.

5 . మల మూత్ర విసర్జన కోసం “మోతకిఫ్’ మస్జిద్ నునెఇ బయటికి రావచ్చు. ఈ కారణంతో వారు తమ ఇండ్లకు కూడా వెళ్ళ వచ్చు. ఐతే ఒక్క క్షణం కూడా

ఆలస్యం చేయకుండా తిరిగి వచ్చేయాలి.

6 . ఇమాం అబూ హనీఫా(రహ్మలై దృష్టిలో, మోతకిఫ్లు రోగుల్ని పరామర్శించడానికి, జనాజా నమాజ్లో పాల్గొనడానికి వెళ్ళలేరు. ఇతర ఇమాములు మాత్రం అందుకు అనుమతించారు. అయితే ‘మోతకిఫ్’ ఏతెకాఫ్ను ప్రారంభించే ముందు ఆ మేరకు సంకల్పం చేసుకొని ఉండాలన్నది షరతు.

7 . ఏతెకాఫ్ పాటించేవారు – ఆ నిర్ణీత కాలం వరకు – తమ భార్యలతో సంభోగించాకూడదు.

8 . ఏతెకాఫ్ పాటిస్తున్న సమయంలో ఏ విధమైన వ్యాపారం చేయరాదు.

9 . ఏతెకాఫ్ పాటించేవారు మస్జిద్ ఇమామ్ గాని, ఖతీబ్ గాని అయి ఉంటె వారు నమాజ్కు ఇమామత్ చేయవచ్చు. ఖుత్బా ఇవ్వవచ్చు. ఇందులో ఎలాంటి సందేహానికి తావులేదు.

10 . ఏతెకాఫ్ పాటించేవారు – తాము స్నానం చేయవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడితే మస్జిద్ ఆవరణలోనే స్నానం చేయాలి.

ఒకవేళ మస్జిద్ ఆవరణలో ఆ సౌలభ్యం లేకపోతె ఇంటికి వెళ్ళవచ్చు. కాని స్నానం చేసి వెంటనే వచ్చేయాలి.

11 . ఎతేకాఫ్లో నున్న వారు – వ్యాధిగ్రస్తులవుతే డాక్టరును పిలుచుకోవచ్చు. లేక డాక్టరు దగ్గరకు కూడా వెళ్ళవచ్చు. అయితే వెంటనే వాపసు రావాలి.

12 . ఎతేకాఫ్లో నున్న వారు సుగంధ ద్రవ్యాలు పూసుకోవచ్చు. నూనె రాసుకోవచ్చు.

మహిళల ఏతెకాఫ్

1 . స్త్రీలు ఏతెకాఫ్ పాటించడానికి తమ భర్తల అనుమతి తీసుకోవటం అవసరం.

2 . స్త్రీ, అపరిశుద్దావస్తలో (బహిష్టు అయి ఉన్నప్పుడు) ‘ఏతెకాఫ్’ పాటించ జాలదు.

ఫిత్రా పరమార్థ

1 ) మంచిని పెంచడానికి చెడుని రూపు మాపడానికి విశ్వ ప్రభువు తరఫున నియుక్తమయిన శ్రేష్ఠ సమాజం జరుపుకునే పండుగ – ఈదుల్ ఫిత్ర్.

ఈదుల్ ఫిత్ర్లో ఎన్నో పవిత్రమయిన, మరెన్నో పరిశుద్ధమైన భావాలు ఇమిడి ఉన్నాయి.

నెల రోజులు కేవలం తమ ప్రభువు ప్రసన్నత కోసం ఉపవాసాలు పాటించిన వారంతా ఓ విధమయిన ప్రత్యేక అనుభూతిని, ఆనందాన్ని, తృప్తిని పొందటం సహజం. అది నిజంగానే వారి కోసం పర్వదినం. ఆ రోజున వారు కొత్త బట్టలు ధరిస్తారు. సుగంధ ద్రవ్యాలు పూసుకుంటారు. రుచికరమయిన ఆహార పదార్ధాలు భుజిస్తారు. నలువైపులా సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆ వాతావరనమంతా ఆహ్లాదకరంగా తయారవుతుంది.

ఆ సంతోష సమయంలోనూ సమాజంలో లేమికి గురి ఐన సోదరులను, నిరాధారులను, నిరుపేదలను, అనాధలను, వితంతువులను మరచి పోకండి అని తాకీదు చేస్తోంది ఇస్లాం! “వారి కష్టాల్లో మీరూ పాలు పంచుకోండి. వారికి ఫిత్రా దానాలిచ్చి వారు కూడా ఎంతో కొంత పండుగ జరుపుకునేలా చూడండి” అని ఉపదేశిస్తోంది ఇస్లాం!!

2 ) అంతేకాదు –

దాసులు తమ స్వామీ మెప్పుకోసం పాటించిన ఉపవాస వ్రతాలలో మానవ సహజమైన దౌర్బల్యాల వల్ల జరిగే పొరబాట్లు, లోటుపాట్లను ఫిత్రాదానాల వల్ల ప్రక్షాళనం చేసుకోవాలన్నది కూడా ప్రధాన అంశమే.

ఒక హదీసులో ఉంది.

హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (ర.అ) ఉల్లేఖించారు:

“మహా ప్రవక్త (సఅసం) ఫిత్రా దానాన్ని తప్పనిసరిగా నిర్ధారించారు. తద్వారా అనవసరమైన, అపసవ్యమైన మాటల నుండి ఉపవాసి పరిశుద్ధుడు అయ్యేందుకు మరియు నిరాదారులకు ఆహారం ప్రాప్తమయఎందుకు! ఎవరైతే దీన్ని (ఈ దానాన్ని) పండుగ నమాజ్ కంటే ముందు ఇచ్చాడో అది (దైవ సమక్షంలో) సమ్మతించబడిన దానం అవుతుంది,. ఇంకా, ఎవరైతే దీన్ని నమాజ్ అనంతరం ఇచ్చాడో, అది దానాలలో ఒక దానంగానే పరిగనిన్చబడుతుంది.”

ఫిత్రా ఆదేశం, పరిమాణం

అసలు ఫిత్రా అనే పదం ఇఫ్తార్ నుండి వచ్చింది. ఇది ముస్లిములన్దరిపై తప్పనిసరి చేయబడింది.

హజ్రత్ ఇబ్నె ఉమర్ ఉల్లేఖనం ప్రకారం, మహా ప్రవక్త (స అ సం) ఖర్జూరంగాని, గోదుమలాంటిది) గాని “ఒక ‘సా’ (‘సా’ అంటే భారత కొలమానం ప్రకారం సుమారు మూడున్నర సేర్లు)

ఫిత్రాదాన్నాన్ని ప్రతి బానిసపై, స్వతంత్రునిపై, స్త్రీపై, పురుషునిపై, చిన్నవారిపై పెద్ద వారిపై విధిగా నిర్ణయించారు.

(బుఖారి, ముస్లిం, అబూదావూద్, నిసాయి, తిర్మిజి, ఇబ్నుమాజ, అహ్మద్)

ఫిత్రాకి ఆర్ధిక స్తోమతతో సంబంధం లేదు. ప్రజలు బీదవారైనా, ధనికులయినా ఫిత్రా దానం తప్పక ఇవ్వాల్సిందే.

ఇమాం అబూ హనీఫా (రహ్మలై) దృష్టిలో: జకాత్’ ఎవరిపైనైతే విధిగా నిర్నయిన్చాబడిందో ఫిత్రా కూడా వారిపైనే వాజిబ్ చేయబడింది.

ఇతర ఇమాముల(రహ్మలై) దృష్టిలో; ఒక రోజుకు సరిపడా ఆహారంకంటే తక్కువ యింట్లో నిలవ ఉంటె చాలు, వారు ఫిత్రా దానం యివ్వటం తప్పనిసరి అయిపోతుంది..

ఒక్క గోధుమలను బిన్హాయించి, మిగిలిన ఆహార ధాన్యాలు ఏవైనాసరే పూర్తీ “సా” (అంటే మూడున్నర సేర్లు) ఓ ఫిత్రాగా ఇవ్వాలన్న విషయంలో నల్గురు ఇమాముల అభిప్రాయం దాదాపు సంయుక్తన్గానే ఉంది. గోధుమలైతే “అర్ధపా’ (పావు తక్కువ రెండు సేర్లు) యివ్వవచ్చును.

ఫిత్రా ఎప్పుడు ఇవ్వాలి?

ఫిత్రాదానం రామజన్ మాసం చివరిలో వాజిబ్ అవుతుందని (తప్పనిసరి అవుతుందని) పేర్కొనబడింది. ఈ విషయంపై నలుగులు ఇమాములు కూడా ఏకీభవించారు.

అయితే, ఇమం అబూహనీఫా (రహ్మా.లై) ప్రకారం ఫిత్రా, పండుగ రోజు ఉషోదయం కాగానే వాజిబ్ అవుతుంది.

ఇమాం అబూహనీఫా (రహ్మా.లై) దృష్టిలో పండుగ రోజు ఉషోదయానికి ముందు జన్మించే పిల్లవానిపై కూడా ఫిత్రా వాజిబ్ అవుతుంది. ఇతర ఇమాముల దృష్టిలో ‘వాజిబ్’ కాదు.

ఇమాం అహ్మద్ (రహ్మా.లై) దృష్టిలో ఫిత్రా, రమజాన్ నెల చివరి రోజున సూర్యాస్తమయం కాగానే వాజిబ్ అవుతుంది. ఫిత్రా దానం రమజాన్ చివరలో వాజిబ్ అయినప్పటికీ అంతకంటే ముందు కూడా దాన్ని ఇచ్చేయవచ్చు.

ఫిత్రా దానం పండుగ నమాజ్ చేయకముందే ఇచ్చివేయటం శుభ ప్రదం.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (ర.అ) ఉల్లేఖనం ప్రకారం – “ప్రజలు ఈద్గాః వైపు వేలేముందే ఫిత్రా యిచ్చివేయాలని” మహా ప్రవక్త (స అ సం) ఉపదేశించారు.

(బుఖారీ )

ఫిత్రా ఎవరెవరికి ఇవ్వాలి?

‘జకాత్’ మొత్తాన్ని ఈ అంశాల్లో ఖర్చు చేస్తారో ఫిత్రా దానాలను కూడా దాదాపు అవే పద్దుల్లో కేటాయించవచ్చు. అయితే నిరుపేదలు, నిరాదారులు, అనాధలు, మొదలగు వారికి ప్రాధాన్యత నివ్వాలి. సమీప బంధువుల్లో బీదవారు, లేమికి గురైన వారుంటే మొదటి ప్రాధాన్యత వారికే యివ్వాలి. అనేక ఫిత్రాలను ఒక వ్యక్తికి ఇవ్వవచ్చు. ఒకే ఫిత్రాను అనేక మందికీ పంచవచ్చు.

ఈదుల్ ఫిత్ర్

హనఫీ ఫికహ్ ననుసరించి ఈదుల్ ఫిత్ర్ (ఫిత్రా పండుగ) ముస్లిములకు వాజిబ్ చేయబడింది.

హంబలీ ఫికహ్ ప్రకారం ఈదుల్ ఫిత్ర్ ఫర్జ్ (విధి)గా నిర్ణయించబడింది.

మాలికీ, షాఫయీ ఫికహ్ మరియు అహలె హదీసీల ప్రకారం ఈదుల్ ఫిత్ర్ “సున్నతే ముఅక్కిద” గా ఖరారు చేయబడింది.

హజ్రత్ అనస్ (ర.అ) ఉల్లేఖించారు: మహా ప్రవక్త (సఅసం) మక్కా నుండి మదీనాకు ఎతేన్చినపుడు అక్కడ ప్రజలు ఏడాదిలో రెండు రోజులను ఆటలకోసం, సైరు షికార్ల కోసం ప్రత్యేకి౦చుకోవటాన్ని చూశారు ‘ఏమిటీ ఆ రెండు దినాల విశేషం;’ అని ప్రవక్త గారు వారిని అడగ్గా, ‘అజ్ఞానం వల్ల మేము ఇందులో (ఈ రెండు రోజుల్లో) ఆడుకున్టాము,’ ఆనందాన్ని అనుభవిస్తాము’ అని జవాబిచ్చారు. ఆయన (సఅసం) ఉపదేశించారు. ‘ఈ రెండు రోజులను అల్లాహ్ మీ కోసం ఇంతకంటే మేలయిన (పర్వ) దినాలుగా మార్చివేశాడు,’ వాటిలో ఒకటి ఈదుల్ ఫిత్ర్, రెండవది, ఈదుల్ అజ్హా.”

పండుగ రోజున, శరీఅత్ చూపిన పరిధులలో స్వాదిష్టమయిన ఆహార పదార్థాలు సేవించటం, శుభాకాంక్షలు తెలుపుకోవటం సంప్రదాయం. హజ్రత్ ఆయిషా (రజి అల్లాహు అన్హా) ఇలా అంటున్నారు:

“ఒక పర్వదినాన నీగ్రోలు (నల్లవారు) మహా ప్రవక్త దగ్గరికి విన్యాసాలు చేస్తూ వచ్చారు. నేను మహా ప్రవక్త (సఅసం) భుజముపై నుండి తొంగి చూడ సాగాను.

(ఇది గమనించి) ఆయన (సఅసం) తన భుజాన్ని క్రిందికి వంచుకున్నారు. నేను ఆయన భుజంపై నుండి తనివి తీరా ఆ దృశ్యాన్ని తిలకించి వెళ్ళిపోయాను.

(బుఖారి, ముస్లిం, అహ్మద్)

పండుగ రోజున స్నానం చేయటం, సుగంధ ద్రవ్యాలు పూసుకోవటం, ఉన్న వాటిలో మంచి దుస్తులు ధరించటం ఉత్తమం. ఇది మహా ప్రవక్త (స అ సం) ఆచరణా విధానం కూడా.

ఈద్ నమాజ్ బస్తీ లేక గ్రామం వెలుపల ఒక బహిరంగ ప్రదేశంలో – ఈద్ గాహ్ లో చేయటం సున్నత్. సౌకర్యం లేని పక్షంలో మస్జిద్లో కూడా పండుగ నమాజ్ సలపవచ్చు.

తక్బీర్

ఈద్ నమాజ్ కోసం ఈద్ గాహ్ వైపునకు వెళ్ళేటప్పుడు బిగ్గరగా తక్బీర్ ( ఇమాం అబూ హనీఫా (రహ్మలై) దృష్టిలో తక్బీర్ నెమ్మదిగా పలకటం ఉత్తమం) పలుకుతూ పోవాలి.

“అల్లాహు అక్బర్ -అల్లాహు అక్బర్- లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్- అల్లాహు అక్బర్- వలిల్లాహిల్ హమ్ద్”

(“దేవుడే గొప్పవాడు, నిస్స౦దేహంగా దేవుడే గొప్పవాడు, ఆయన తప్ప మరో దేవుడు లేడు. దేవుడే గొప్పవాడు, స్తోత్రం ఆయన కొరకే)

ఈద్ గాహ్కు వెళ్ళేటప్పుడు ఒక దారిన వెళ్లి వాపసు వచ్చేటప్పుడు ఇంకొక దారిన రావటం ఉత్తమం. పురుషులతోపాటు స్త్రీలు, పిల్లలు ఈద్ గాహ్ వెళ్లి, ఈద్ నమాజ్లో పాల్గొనటం కూడా సున్నతే (సంప్రదాయమే)

ఈద్ నమాజ్ సమయం

ఆ రోజు సూర్యుడు ఉదయించి సుమారు రెండు బారెళ్ళు పైకి రాగానే పండుగ నమాజ్ వేళ ప్రారంభమవుతుంది. ఈదుల్ ఫిత్ర్ నమాజ్ను కాస్త ఆలస్యంగా, ఈదుల్ అజ్హా నమాజ్ను కాస్త త్వరగా చేయాలి. సూర్యుడు నెత్తి పై నుండి వాలడంతోనే పండుగ నమాజ్ వేళ ముగుస్తుంది.

హజ్రత్ జన్దుబ్ (ర.అ) ఉల్లేఖనం ఇలా ఉంది.

“ఈదుల్ ఫిత్ర్ నమాజ్ను మహా ప్రవక్త (స అ సం) చదివిన్చేతప్పుడు రెండు బారెళ్ళ ప్రొద్దెక్కి ఉండేది, ఈదుల్ అజ్హా నమాజ్ చదివిన్చేతప్పుడు ఒక బారెడు ప్రొద్దెక్కి ఉండేది.

(అహ్మద్ బిన్ హసనుల్ బన్నా)

పండుగ నమాజ్ కోసం అజాన్ ఇవ్వకూడదు, అదేవిధంగా పండుగ నమాజ్కు ముందు ‘ఇఖామత్’ చెప్పనవసరం లేదు.

శుక్రవారం నమాజ్లో ప్రసంగం (ఖుత్బా) తర్వాత నమాజ్ చదివిస్తారు ఇమాం. అయితే పండుగ రోజున ముందు నమాజ్ చదివించి తర్వాత ప్రసంగిస్తారు.

పండుగ నమాజ్కు ముందుగాని, నమాజ్ అనంతరంగాని ఎలాంటి సున్నత్ నమాజ్ కూడా చేయరాదు. దేవుని అంతిమ ప్రవక్త (సఅసం) గాని, ఆయన ప్రియ సహచరులుగాని అలా చేసినట్లు ఆధారమేదీ లేదు. ఈ విషయంపై ఇస్లామీయ ధర్మ వేత్తలందరి మధ్యనా ఏకాభిప్రాయం ఉంది. అయితే ఇక మిగిలినవి నఫిల్ నమాజులు; వాటి గురించి (నఫిల్ చదవరాదని) ఏ హదీసు ద్వారా కూడా రూఢీకాలేదు గనక నఫిల్ నమాజులు పండుగకు ముందు మరియు తర్వాత చదవ వచ్చునన్నది కొంత మంది ధర్మవేత్తల దృక్పథం. కాని సాధారణంగా రోజా ఏ ఏ వేళల్లో నయితే నఫిల్ చదువుతారో ఆ వేళల్లో పండుగ రోజున కూడా చదవాలన్నది నిబంధన. ఈ నఫిల్ నమాజ్ వలన పండుగ నమాజ్కు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూసుకోవటం ఆయా వ్యక్తుల బాధ్యత.

ఈద్ నమాజ్ : రకాతులు, సూరాలు

౧) ఈద్ నమాజ్ రెండు రకాతులు.

౨) ప్రతీ రకాత్లోనూ ఫాతిహా సూరా పతించిన పిదప దివ్య ఖుర్ఆన్లోని మరే భాగమయినా పఠించవచ్చు. అయితే మహా ప్రవక్త ముహమ్మద్ (సఅసం) స్వయంగా ఏ సూరాలనైతే పండుగ నమాజ్లో పఠించేవారి ఆ సిఇరాలనే మనం కూడా పఠించటం ఉత్తమం.

హజ్రత్ సమర (ర.అ) ఉల్లేఖించారు.

“పండుగ నమాజ్లలో మహా ప్రవక్త (సఅసం), మొదటి రకాత్లో (ఫాతిహా సూరా అనంతరం) ‘సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా’, రెండవ రకాత్లో ‘హల్ అతాక హదీసుల్ ఘాషియా’ పఠించేవారు”. (అహ్మద్)

మరో హదీసులో ఉంది.

“ఈదుల్ ఫితర్- ఈదుల్ ఫితర్ నమాజ్లలో మహా ప్రవక్త (సఅసం) ఏం పఠించేవారు అని హజ్రత్ అబూ వాఖిడ్ లేసీ (ర.అ)ని దర్యాప్తు చేయగా “ప్రవక్త (సఅసం) సూరా ఖాఫ్ మరియు ఖమర్ పఠించేవారు”. అని ఆయన వివరించారు.

౩) ఈడ నమాజ్ సామూహికంగా, బిగ్గరగా, చేయాలి.

పండుగ నమాజ్లో – మొదటి రకాత్లో తక్బీరే తఃరీమా (ప్రథమ తక్బీర్)ను మినహాయించి, ఖిరాత్ కంటే ముందు అంటే సూరాలు చదవక ముందు ఏడుతక్బీర్లు చెప్పటం, రెండవ రకాత్లో కూడా ఖిరాత్కు ముందు ఐదు సార్లు తక్బీర్లు పలకటం సున్నత్. ఇది ప్రవక్త సహచరులు మరియు సహచరులను కళ్ళారా చూసిన వారి విధానం కూడా. అహలె హదీసు వారు కూడా ఈ విదానానే అనుసరిస్తారు. (మొత్తం 12 అదనపు తక్బీర్లతో ఈద్ నమాజ్ చేస్తారు.)

హనఫీ ఫిఖ్ ప్రకారం ;- హనఫీ ఫిఖ్ ప్రకారం మొదటి రకాత్లో తక్బీరే తహ్రీమా తరువాత ‘సనా’ పఠించాలి. తరువాత ఖిరాత్ చదవకముందే రెండు సార్లు అల్లాహు అక్బర్ అంటూ చేతులు ఎత్తి వదలివేయాలి. మూడవసారి “అల్లాహు అక్బర్” అని పలికి ఈ సారి చేతులు కట్టుకోవాలి. ఇప్పుడు ఇమాం ఫాతిహా సూరా, వేరొక సూరా పఠించి మొదటి రకాత్ పూర్తి చేయించాలి.

రెండవ రకాత్ కోసం నిలబడగానే – మామూలుగా ఖిరాత్ చదవాలి. అయితే ‘రుకూ’లోకి వెళ్లకముందు మూడు సార్లు “అల్లాహు అక్బర్” అంటూ చేతులెత్తి వదిలేయాలి. నాల్గవసారి కేవలం ‘ అల్లాహు అక్బర్’ అని (చేతులేత్తకుండానే) రుకూచేయాలి. తరువాత యధాప్రకారం రెండవ రకాత్ను పూర్తి చేసుకోవాలి. ఈ విధంగా మొదటి రకాత్ రెండవ రకాత్లో మూడేసి అదనపు తక్బీర్ల (మొత్తం ఆరు అదనపు తక్బీర్లు) తో ఈద్ నమాజ్ చేయాలి.

నమాజ్ ముగిసిన తర్వాత సామూహిక దుఆ చేయాలని ఎక్కడా లేదు. కనుక ఎవరికీ వారు వ్యక్తిగతంగా దుఆ చేసుకోవచ్చు.

పండుగ ప్రసంగం

పండుగ రోజు నమాజ్లో – నమాజ్ అనంతరం ప్రసంగించటం సంప్రదాయం.

హజ్రత్ అబ్డుల్లః బిన్ సాయిబ్ (ర.అ) ఉల్లేఖించారు.

“ఒక పర్వదినాన నేను మహా ప్రవక్త (స అ సం) వెంట ఈద్గాహ్లో ఉన్నాను. నమాజ్ చేయటం పూర్తయ్యాక ఆయన (స అసం)