Proverbs in telugu

మీ వ్యక్తిత్వం నీటి లాంటిది, దాన్ని ఏ రంగు పాత్రలో నింపితే ఆ రంగును అవలంభిస్తుంది. ఒక వేళ mee 
తత్వం దానికి రాజీ పడి ఆనందిస్తే దానిలో సంతోషం, మేలు మరియు అందాన్ని చవి చూస్తుంది. ఒక వేళ దాన్ని ఇరుకైనడిగా నలుపుగా భావిస్తే అసంతోశానికి గురై దానిలో చెడునే చూస్తుంది.
ఒక వేళ  ప్రాపంచిక న్యాయాలయంలో న్యాయం లభించక పోతే  మీ కర్మల రికార్డును ఉన్నత స్థాయికి ప్రళయ న్యాయస్థానానికి చేర్చండి, దానికి సాక్ష్యం దైవ దూతలు, మీ
కేసును భద్రంగా ఉంచేవారు, మరి న్యాయాధికారి సకల లోకాల సర్వాధికారి. 
శుభ వార్త!  ఎవరైతే తమకు కలిగిన శుభాలకు కృతఙ్ఞతలు తెలుపుకుంటారో, ఆపదలకు గురైతే సహనం చూపేవారో, తప్పులు జరిగితే క్షమాపణ కోరేవారో, ఆగ్రహానికి నిగ్రహించుకునే వారు, న్యాయాధికారిగా నియమించబడితే న్యాయం చేసేవారికి శుభవార్త.
ఓ అల్లాహ్ naa వద్ద చాలా దుఖముంది అని కాక ఓ దుఖమా నా వద్ద చాలా గొప్ప దైవమున్నాడు అనండి.
మీకు చెవుడు, మూగత్వం, గ్రుడ్డి  లేదు, పిచ్చికి, క్రుష్టు వ్యాధికి దూరంగా ఉన్నారు, క్షయ క్యాన్సర్ల నుండి సురక్షితంగా ఉన్నారు. మరి అల్లాహ్, ఆ కరుణామయుడికి కృతఙ్ఞతలు తెలుపుకున్నారా?

అల్లాహ్ స్మరణ అతన్ని రాజీ చేస్తుంది, మనిషికి ఆనందాన్నిస్తుంది, శైతాన్ను చికాకు పరుస్తుంది. దుఖాలను తొలగిస్తుంది, కర్మల త్రాసు పళ్ళేన్ని నింపుతుంది.

ఒకవేళ మీరు ఎ పాపం చేయకుండా ఉంటే, ఎవరిపై ఏ అత్యాచారం చేయకపోతే ప్రశాంతంగా నిద్రించండి. సంతోషించండి మీకది గొప్ప అవకాశం, మీ అలసట తీరింది, మీకే శత్రువూ లేదు. 

ఎన్ని సార్లు అల్లాహ్  మీ కోరికలను తీర్చాడు, ఎన్ని సార్లు మీరడిగింది ప్రసాదించాడు, ఎన్ని సార్లు మీరు పడుతుంటే ఆదుకున్నాడు, ఎన్ని సార్లు మీ కష్టాలు తొలగించాడు, ఎన్ని సార్లు మీ మొరలను ఆలకించాడు.

బాధితుడి మొరలనాలకించు వాడెవడు
మునిగే వాడు పిలిచినప్పుడు చేయూతనిచ్చేవాడెవడు,
కష్టాలను కనుక్కొని వాటిని దూరం చేసే వాడెవడు,
ఎవరన్నారు, అల్లాహ్ ?
వారికే అల్లాహ్ !
ఉదయాన సూర్యోదయాన్ని ఆనంద దృష్టి తో చూడండి,
దానిలో ఉంది అందం, గాంభీర్యం,
ఆ ప్రకాశ ప్రగతి మీలో క్రొత్త ఆశలను స్పురిమ్పజేస్తుంది.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *