దిల్ హజ్జ్ మాసపు పది దినాల ప్రత్యేకత
దిల్ హజ్జ్ మాసపు మొదటి పది పవిత్రదినాలలో ముస్లింలు ఆచరించటానికి ప్రయత్నించవలసిన కొన్ని మంచి పనులు: ఉపవాసం. దిల్ హజ్జ్ 9వ తేదీన ఉపవాసం ఉండటమనేది ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆచరించి మార్గదర్శకత్వం వహించిన ఆచరణలలోనిది. ఈ శుభసమయంలో మంచి పనులు చేయవలెనని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించి ఉన్నారు. మరి, ఉపవాసమనేది పుణ్యకార్యాలలో ఒక మహోన్నతమైన పుణ్యకార్యం కదా. సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథపు [...]
